న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు.
వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్‌లోనూ ఎఫ్‌వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?)
Comments
Please login to add a commentAdd a comment