Cyclone Phailin
-
వరదల్లో చనిపోయినవారికి రూ.2 లక్షలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పైలీన్ తుపాను, వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇవ్వనుంది. అలాగే గాయపడిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలకు తక్షణ సాయం కింద కేంద్రం వెయ్యికోట్ల రూపాయలు విడుదల చేసింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తరువాత కేంద్రం ఈ సహాయాన్ని పెంచుతుంది. -
ఒడిశాకు రేపు కేంద్ర పరిశీలన బృందం
పై-లిన్ తుపాన్ తాకిడితో ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ తుపాన్ సృష్టించిన బీభత్సంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం బృందం సోమవారం ఒడిశా రానుందని ఆ రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రష్మీ గోయెల్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఆ కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోతుందని చెప్పారు. పైలిన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న గంజాం, పూరీ, బాలసోర్, మయూర్ బంజ్ జిల్లాల్లో ఆ బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. ఆ బృందాలు ఈ నెలాఖరు వరకు ఒడిశాలో పర్యటిస్తాయని చెప్పారు. పై లిన్ తుపాన్‌తో వచ్చిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల 60 మంది మృత్యువాత పడ్డారు. అలాగే వీపరితమైన ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు మూడు లక్షల చెట్లు నెలకొరిగాయి. రోడ్డు, రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఒడిశాలో పై లిన్ తుపాన్ వల్ల నెలకొన్న నష్టంపై కేంద్ర బృందం అధ్యాయనం చేసి కేంద్రానికి నివేదిక అందజేయనుంది. -
మొద్దు నిద్రలో ప్రభుత్వం: చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రకృతి విపత్తులతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని.. పాలకులు మొద్దునిద్ర వీడటం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన ఆయన నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. శనివారం ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన మొదట నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు వద్ద ముంపునకు గురైన వరి పంటను పరిశీలించారు. అక్కడే పలాస ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆయన్ను కలుసుకుని రాష్ట్ర విభజన లేఖ వెనక్కి తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అక్కడి నుంచి బాబు కంచిలి, కేసరపడ, కొజ్జీరియా జంక్షన్, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. నిలదీసిన బాధితుడు: కంచిలి, కేసరపడ, కొజ్జీరియా జంక్షన్, లొద్దపుట్టిలో పర్యటించిన చంద్రబాబు ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తూ, టీడీపీ గురించి గొప్పలు చెప్పుకోవడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అనపాన కుభేర్రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల సందర్శనకు వచ్చి, రాజకీయాల గురించి మాట్లాడటమేమిటని నిలదీశాడు. మీరు గొప్పగా చెప్పుకొంటున్న జాతీయ రహదారి అభివృద్ధి కారణంగానే తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురైందని గట్టిగా చెప్పడంతో బాబు కంగుతిన్నారు. బాధితులను ఆదుకోవటంలో విఫలం విశాఖపట్నం: పై-లీన్ తుపాను నుంచితేరుకోకముందే ప్రస్తుత వర్షాలు ఉత్తరాంధ్రను మ రింత కుంగదీశాయని, బాధితులకు సహాయ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతూ ఆయన శనివారం విశాఖ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. -
బెంగాల్, ఒడిశాల్లో తెరిపినివ్వని వర్షాలు
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలు ఇంకా తెరిపినివ్వడం లేదు. ఒడిశాలోని 13 జిల్లాలు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, పరిసర జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వర్షాలు, వరదల కారణంగా ఒడిశాలో మరణించిన వారి సంఖ్య అరవైకి చేరుకుంది. పై-లీన్ తుపాను తాకిడి తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన కొద్దిరోజులకే వర్షాలు ముంచెత్తడంతో ఒడిశా అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా నయాగఢ్, జాజ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో శనివారం ఇద్దరేసి మృతి చెందగా, మయూర్భంజ్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. కోల్‌కతాలో ఇద్దరు, బుర్ద్వాన్ జిల్లాలో ఒకరు మరణించారు. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుషికుల్యా, గొడాహడ, వంశధార వంటి నదులు వరదలతో పొంగి పొర్లుతుండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించగా, కొన్ని రైళ్లు రద్దయ్యాయి. భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసినట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రకటించింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పింఛనుదారులకు వచ్చేనెల అదనంగా ఒకనెల పింఛను చెల్లించనున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. -
ఒడిషాలో తుఫాను బాధితులకు రిలయన్స్ ఉచిత టాక్‌టైం
పై-లీన్ తుఫాను బీభత్సానికి ఒడిషా వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోవడం దుర్లభంగా మారింది. తప్పిపోయినవారి వద్ద మొబైల్ ఫోన్లున్నా, వాటిలో బ్యాలెన్స్ అయిపోవడం, రీచార్జి చేయించుకునే దిక్కు లేకపోవడంతో చాలామంది ఆచూకీ తెలియట్లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ముందుకొచ్చింది. ఒడిషాలో ఈనెల 20వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రోజుకు పది నిమిషాల చొప్పున ఉచిత రీఛార్జి అవకాశం కల్పించింది. సీడీఎంఏ, జీఎస్ఎం రెండు రకాల వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఒడిషాలోని చాలా ప్రాంతాల్లో తుపాను దెబ్బకు విద్యుత్ సరఫరా దారుణంగా దెబ్బతినడంతో బ్యాటరీ సాయంతో ఫోన్లను చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా తమ కంపెనీ స్టోర్స్ వద్ద, ప్రధాన మార్కెట్ల వద్ద కల్పించింది. ఇందుకోసం పెద్ద పెద్ద బ్యాటరీలను ఏర్పాటుచేసి, వాటిద్వారా చార్జింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. -
తుఫాన్ దాటికి 26 లక్షల చెట్లు నేలమట్టం
-
పచ్చదనంపై తుపాను పంజా
భువనేశ్వర్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ఒడిశాకు పెను నష్టాన్ని మిగిల్చింది. దీని దెబ్బకు రాష్ట్రంలో కనీసం 26 లక్షల చెట్లు నేలకూలినట్టు తేలింది. తుపాను దెబ్బకు రాష్ట్రంలో చాలా అటవీ ప్రాంతాల్లో ఇంకా అడుగుపెట్టలేని పరిస్థితి ఉందని, వాటిని కూడా పరిశీలిస్తే వృక్ష నష్టం మరెంతో ఎక్కువగా ఉండవచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గంజాం, గజపతి జిల్లాల్లో ఈ నష్టం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని పూడ్చుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని అధికారులన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్టు అటవీ మంత్రి బిజయ్శ్రీ చెప్పారు. గత 14 ఏళ్లలో భారత తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన అత్యంత శక్తివంతమైన తుపానుగా పై-లీన్ నిలిచింది. 1999 సూపర్ సైక్లోన్ సైతం ఒడిశాలోని లక్షల చెట్లను నేలకూల్చింది. ఇక పై-లీన్ వల్ల ఒడిశాకు కనీసం రూ.4,242 కోట్ల మేరకు నష్టం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి ఈ మేరకు నివేదించింది. ఇందులో ఒక్క గంజాం జిల్లాలోనే ఏకంగా రూ.1,550 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు వివరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గోస్వామి ఆదివారం పర్యటించారు. గంజాం జిల్లాను ప్రత్యక్షంగా పరిశీలించారు. పై-లీన్ నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు, మూడు రోజుల్లో మంత్రుల బృందం ఏర్పాటవుతుందని, ప్రభావిత ప్రాంతాలను అది పరిశీలిస్తుందని తెలిపారు. వేగంగా పెరిగే చెట్లే ఎక్కువ కూలాయి! వేగంగా పెరుగుతాయన్న భావంతో పెంచిన స్థానికేతర జాతుల చెట్లే తుపాను గాలుల ధాటికి ఎక్కువగా కూలాయని నిపుణులు చెప్పారు. యూకలిప్టస్, గుల్మొహర్ వంటి మెతక జాతుల చెట్లు ఎక్కువగా నాశనమయ్యాయి. దృఢమైన చింత, మామిడి, వేప, జామ, మర్రి మొక్కలను నాటితే మేలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్స్, రేడియోలే ప్రాణదాతలు పూరీ (ఒడిశా): అక్టోబర్ 12న ఒడిశాలో పెను విధ్వంసం సృష్టించిన పై-లీన్ తుపాను బారి నుంచి పలువురిని కాపాడటంలో రేడియోలు, మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషించాయి. పై-లీన్ దెబ్బకు వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం మాత్రం కేవలం 44కు పరిమితమవడంలో వాటి పాత్ర చాలా ఉంది. తుపా ను సమీపిస్తున్న విషయాన్ని రేడియోలో వినడం వల్లే తాను, తన కుటుంబం బతికి బయట పడ్డామని గజేంద్ర జనా (55) చెప్పారు. రేడియోలో ప్రత్యేక తుపాను హెచ్చరికలను వినగానే వీలైనన్ని నిత్యావసరాలను వెంటబెట్టుకుని ఆయన కుటుంబమంతా సమీపంలోని తుపాను షెల్టర్‌కు చేరుకుంది. ఆ వెంటనే విరుచుకుపడ్డ తుపాను ఆయన ఇంటిని నేలమట్టం చేసింది. అధికారులు కూడా మొబైల్ ఫోన్లను వీలైనంత విరివిగా వాడటం ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అత్యధికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. రేడియో, మొబైల్స్ లేకుండా ఇది సాధ్యపడేది కాదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. తుపాను హెచ్చరికల అనంతరం రాష్ట్రంలో రేడియోల అమ్మకాలు కూడా బాగా పుంజుకోవడం విశేషం! బాధితులకు సైకత శిల్పి బాసట పై-లీన్ బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ముందుకొచ్చారు. కాన్వాస్‌పై తాను సృజించిన పలు సైకత మూర్తులను విక్రయించి, తద్వారా వచ్చే మొత్తాన్ని బాధితులకు అందజేస్తానని ప్రకటించారు. -
పై-లీన్ సహాయ కార్యక్రమాలు నాలుగు రోజుల్లో పూర్తి
పై-లీన్ తుఫాను సహాయ కార్యక్రమాలన్నీ మరో నాలుగురోజుల్లో పూర్తవుతాయని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలన్నింటి నుంచి నీరు లాగేసిందని, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారిలో చాలామంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లారని ఒడిషా రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె. మొహాపాత్ర తెలిపారు. ఈనెల 22వ తేదీకల్లా సహాయ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయన్నారు. శనివారం రాత్రి గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన పై-లీన్ తుఫాను పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. గంజాం, పూరీ, గజపతి, ఖుర్దా జిల్లాలు ఈ తుఫాను వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయి. బాలాసోర్, భద్రక్, కియోంఝర్, మయూర్భంజ్, జాజ్‌పూర్ జిల్లాల్లో వరదలు వచ్చాయి. ఈ తుఫాను ప్రభావంతో 43 మంది మరణించగా 17 జిల్లాల్లోని 1.2 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. -
ఫై-లీన్ సహాయక చర్యలు భేష్: ప్రపంచ బ్యాంక్
ఫై-లీన్ తుపాన్ బాధితులకు భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల్లో దాదాపు పది లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తప్పించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించిందని పేర్కొంది. లక్షలాదిమంది ప్రజలను తరలించడం చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ముందుగా అప్రమత్తమై ప్రమాద తీవ్రతను గుర్తించి తగు చర్యలు చేపట్టిందని ప్రపంచ బ్యాంక్ కితాబిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నాలుగు రోజుల పాట నిరంతరం శ్రమించి పునరావాసం కల్పించదని తెలిపింది. ఫై-లీన్ ధాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల ప్రజలు భయకంపితులైన సంగతి తెలిసిందే. ఒడిశాను వరదలు ముంచెత్తడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. -
వందకు పైగా గ్రామాలు అంధకారంలోనే..
సాక్షి, విశాఖపట్నం : పై-లీన్ తుపాను వెళ్లిపోయినా అది మిగిల్చిన నష్టం మాత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)ను వేధిస్తోంది. మరోవైపు విద్యుత్ పునరుద్ధరణకు నోచుకోక ఇప్పటికీ వందకు పైగా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వందలమంది ఉద్యోగులు విధుల్లో ఉన్నా.. ఆశించిన స్థాయిలో పునరుద్ధరణ చర్యలు సాగట్లేదని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికీ కవిటి, కంచిలి, సోంపేట పరిధిలోని చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. చాలాచోట్ల స్తంభాలు విరిగి, తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఇప్పటికీ 33/11 కేవీ సబ్స్టేషన్ల మరమ్మతు పనుల్లోనే విద్యుత్ సిబ్బంది ఉన్నారని, గ్రామాలకు విద్యుత్ సరఫరా దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ లేక కమ్యూనికేషన్ వ్యవస్థ మూగబోయింది. చాలా గ్రామాల్లో అద్దెకు జనరేటర్లను తీసుకొచ్చి, మొబైల్ ఫోన్లకు చార్జింగ్‌ను వ్యాపారంగా చేసుకున్నారు. ఒక్కో సెల్‌ఫోన్ చార్జింగ్కు రూ.20 వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈపీడీసీఎల్ పరిధిలో రూ.78 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్క తేల్చారు. 1026 విద్యుత్ స్తంభాలు, 112 సబ్ స్టేషన్లు పాడైనట్టు నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట డివిజన్ పరిధిలో ఎక్కువ నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి. శేషగిరిబాబు సహా 1450 మంది ఉద్యోగులతో 128 బృందాలు విద్యుత్ పునరుద్ధరణ చర్యల్లో ఉన్నాయి. శుక్ర, శనివారాల్లోగా మరమ్మతులన్నీ పూర్తిచేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఒడిశాలో పై-లీన్ బాధితులు 1.23కోట్లు
భువనేశ్వర్: పెను తుపాను పై-లీన్ ఒడిశాలో 1.23కోట్ల మందిని బాధితులుగా మిగిల్చింది. 17 జిల్లాల్లోని 18,117 గ్రామాలపై తుపాను, వరదలు ప్రభావం చూపాయి. తాజా గణాంకాలను ఒడిశా సర్కారు గురువారం విడుదల చేసింది. ఐదు జిల్లాలలో వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించింది. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగింది. గంజాం జిల్లాలో మూడు, నయాగఢ్ జిల్లాలో రెండు మృతదేహాలు బయట పడడంతో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. బాలాసోర్ జిల్లాలోని బాలిపాల్, భోగరాయ్ తాలూకాలు ఇంకా ముప్పు ఎదుర్కొంటున్నాయని పునరావాస ప్రత్యేక కమిషనర్ పీకే మొహపాత్రా భువనేశ్వర్‌లో మీడియాకు తెలిపారు. సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలపైనే తమ ప్రధాన దృష్టి అని ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ మంత్రి ఎస్ఎన్ పాత్రో పేర్కొన్నారు. గంజాం, బాలాసోర్, మయూర్భంజ్పై తుపాను, వరదల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. గంజాం జిల్లాలో ఎనిమిది లక్షల కుటుంబాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని చెప్పారు. -
బాధలు వింటూ.. భరోసా ఇస్తూ... విజయమ్మ పర్యటన
మారుమూల గ్రామాల్లో విజయమ్మ పర్యటన సాక్షి, శ్రీకాకుళం: పై-లీన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో విజయమ్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఆమె అడుగిడిన ప్రతిచోటా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారు. కంచిలి మండలం జాడుపూడి నుంచి ఉదయం 11.55 గంటలకు విజయమ్మ పర్యటన మొదలైంది. అక్కడి కొబ్బరి, జీడి మామిడి, పనస తదితర తోట పంటల రైతుల్ని పరామర్శించారు. అక్కడి నుంచి పెద కొజ్జిరియా, చిన కొజ్జిరియాల్లో పర్యటించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కవిటి మండలం రాజపురం చేరుకున్నారు. కాలి నడకనే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే బయలుదేరి బొరివంక మీదుగా ఇద్దివానిపాలెం చేరుకున్నారు. అక్కడ మత్స్యకార మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిటి, ఇచ్ఛాపురం, మందస, సోంపేట మండలాల్లోని మత్స్యకారులకు సుమారు రూ. 25 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకార ఐక్య వేదిక ప్రతినిధులు వెల్లడించారు. బి.గొనపపుట్టుగలో కూడా స్థానికులతో విజయమ్మ ముఖాముఖి మాట్లాడారు. కుసుంపురంలో మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా నిలిచి పుష్పగుచ్ఛాలిచ్చేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి కళింగపట్నం, బల్లిపుట్టుగ, మాణిక్యపురం వెళ్లారు. మాణిక్యపురంలో అభిమానులు భారీ సంఖ్యలో జెండాలు పట్టుకుని రోడ్డుపైకి చేరుకోగా విజయమ్మ వారందరినీ చిరునవ్వుతో పలకరించి, చేతులూపుతూ అభివాదం చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆమెకు రుషికుద్దలో రైతులు తమ పంట నష్టాల్ని చెప్పుకున్నారు. ఇసకలపాలెంలో మత్స్యకారులు తమ చేపలు, వలలు, బోట్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విజయమ్మ గొల్లగండి మీదుగా బారువ చేరుకుని మత్స్యకారుల కష్టాలు తెలుసుకున్నారు. బారువలో రక్షణ గోడ నిర్మాణానికి హామీ ఇచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె తన పర్యటనను ముగించుకుని విశాఖలో రాత్రి బస చేసేందుకు తిరుగుముఖంపట్టారు. -
647 గ్రామాలు ఇంకా వరదలోనే...
భువనేశ్వర్: పై-లీన్ బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశాలో 647 గ్రామాలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. బాలాసోర్ జిల్లాలోని బస్తా, భోగరాయ్, జలేశ్వర్, బలియాపాల్ బ్లాకుల్లో వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మిగతాచోట్ల పరిస్థితి మెరుగుపడింది. ప్రధాన నదుల్లో వరద ఉధృతి తగ్గింది. సహాయక కార్యక్రమాలు ఓ కొలిక్కి రావడంతో ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. అయితే స్థానిక జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) యూనిట్ మరికొన్ని రోజులు బాలసోర్ జిల్లాలోనే ఉంటుందని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక కమిషనర్ పీకే మహాపాత్రో తెలిపారు. జిల్లాలోని 83 పంచాయతీల పరిధిలో 647 గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. మయూర్భంజ్, భద్రక్, జాజ్‌పూర్, కోయెన్జార్లలో పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. జిల్లాకు చెందిన 96 వేల మంది నిరాశ్రయులు వివిధ సహాయక కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భద్రక్ జిల్లాలో వైతరణి నది పొంగుతుండడంతో 70 గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక పెను నష్టాన్ని చవిచూసిన గంజాం జిల్లాలో విద్యుత్ లైన్లు, రోడ్డు మార్గాల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. అంటువ్యాధులు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నీటిని శుద్ధిపరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది. కాగా, ఒడిశాలో పై-లీన్ దెబ్బకు బుధవారం నాటికి 36 మంది మరణించగా, జార్ఖండ్‌లో ఐదుగురు మృతిచెందారు. నిధులు విడుదల చేయండి: ఒడిశాలో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే రూ.1,523 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. తీవ్రంగా నష్టపోయిన గంజాం జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టేందుకే 900 కోట్లు అవసరమవుతాయని లేఖలో పేర్కొన్నారు. ఉదారంగా విరాళాలు ఇవ్వండి: సీఎం వరద బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు, వాణి జ్య, పారిశ్రామిక రంగ సంస్థలను కోరారు. విరాళాలను చెక్కుల ద్వారాగానీ, డ్రాఫ్ట్‌ల ద్వారా గానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపాల్సిందిగా సూచించారు. -
సహాయక చర్యలపై అమెరికా ప్రశంసలు
వాషింగ్టన్: పై-లీన్ తుపాను సమయంలో వేగంగా స్పందించి.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత అధికారులపై అమెరికా ప్రశంసలు కురిపించింది. తీర ప్రాంతాల నుంచి ముందుగానే భారీగా ప్రజలను తరలించడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని చెప్పింది. పై-లీన్ తుపాను ప్రభావానికి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 10 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పై-లీన్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు తమ సానుభూతి తెలియజేస్తున్నామని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ చెప్పారు. -
తుఫాను వెలిసింది...కష్టం మిగిలింది
-
విద్యుత్ లైన్లను పునరుద్ధరించుకుంటున్న మత్స్యకారులు
-
విద్యుత్ లైన్లను పునరుద్ధరించుకుంటున్న మత్స్యకారులు
పై-లీన్ తుఫాను ధాటికి శ్రీకాకుళం ప్రాంతం అతలాకుతలమైంది. దీన్ని పునర్నిర్మించుకోడానికి మత్స్యకారులు తమంతట తాము ముందుకొస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో ఏకంగా 832 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. వాటిని పునరుద్ధరించడం విద్యత్ శాఖ ఉద్యోగులకు తలకు మించిన భారంగా మారిపోయింది. పై-లీన్ ధాటికి కాజ్వే కొట్టుకుపోవడంతో కవిటి మండలం కళింగపట్నం, ఒంటూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ కారణంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆయా ప్రాంతాలకు చేరుకోవడం కూడా అసాధ్యం అయిపోయింది. దాంతో.. మత్స్యకారులు స్పందించారు. తమంతట తాముగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కవిటి మండలం కళింగపట్నం లాంటి గ్రామాల్లో వాళ్లే విద్యుత్ లైన్లను పునరుద్ధరించుకుంటున్నారు. పోల్స్ ఎత్తడం, వైర్లు కట్టడం అన్నీ తామే చేసుకుంటున్నామని చెప్పారు. శ్రమదానంతో తాము అన్నీ చేసుకుంటున్నట్లు గ్రామ సర్పంచి తెలిపారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా పనులు చేసుకుంటున్న మత్స్యకారులను అధికారులు అభినందించారు. -
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒడిశాను ముంచెత్తుతున్న వరదలు
ఫైలిన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఒడిశాను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో సోమవారం కూడా వేలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక, పునరావాస కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ఒడిశాలో బద్ధ బలంగ, బైటరని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు మయూర్భంజ్, బలసోర్ జిల్లాలో చాలా ప్రాంతాలకు చేరడంతో సహాయక చర్యల కోసం అధికారుల్ని ఆ ప్రాంతాలకు పంపించారు. చాలా ఇళ్లు కూలిపోగా, వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో తెలిపారు. ఇళ్లు దాదాపు ఐదారు అడగుల మేర నీటిలో మునిగిపోయాయి. కొందరు భవనాల పైకప్పు మీదకు చేరుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఒడిశాలో నదులు చాలావరకు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో ఇతర జిల్లాల్లోనూ ప్రజల వరదల తాకిడికి భయపడుతున్నారు. తుఫాన్ ప్రభావానికి ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 21కు పెరిగింది. -
విలయ విధ్వంసం
రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల ప్రజలను నిలువెల్లా వణికించిన పెను తుపాను పై-లీన్ శాంతించింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు.. ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్త చర్యలతో.. పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. కానీ.. ఈ ఇంద్రనీలం తుపాను శనివారం రాత్రి భారీ విధ్వంసమే సృష్టించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో దాదాపు కోటి మంది జీవితాలపై ప్రభావం చూపింది. లక్షలాది ఇళ్లను దెబ్బతీసింది. లక్షలాది ఎకరాల్లో పంటను కాలరాసింది. ఒడిశాలో ఒక్క వరి పంటకు జరిగిన నష్టమే రూ. 2,400 కోట్లుగా అంచనా. శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న ఉద్యానవన, ఇతర పంటల నష్టం రూ. వెయ్యి కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. శనివారం రాత్రి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన తుపాను.. గంజాం జిల్లాను కకావికలం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లానూ అతలాకుతలం చేసింది. ఒడిశా తీరంలో తొమ్మిది లక్షల మందిని, ఉత్తరాంధ్ర తీరంలో లక్షన్నర మందిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో ప్రాణనష్టం లేకుండా నివారించగలిగారు. తుపాను తాకిన గోపాల్పూర్ నుంచి దాదాపు 95 శాతం మందిని ముందుగానే ఖాళీచేయించారు. అప్పటికీ.. ఒడిశాలో 21 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో పది మంది గంజాం జిల్లాలోనే చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 23గా చెప్తున్నారు. సాక్షి, భువనేశ్వర్/శ్రీకాకుళం: తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. శనివారం రాత్రి పెను గాలులకు బరంపురంలోని ఓ హోటల్ వద్ద నిలిపి ఉంచిన వ్యాన్ పైకి ఎగిరి కింద పడింది. దీనినిబట్టి గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బరంపురం నగరం ఆదివారం మధ్యాహ్నం వరకూ దాదాపు జలదిగ్బంధంలోనే ఉంది. తీర జిల్లాల్లో సమాచార వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిలో కొన్నిచోట్ల గాలుల కారణంగా లారీల వంటి భారీ వాహనాలు సైతం తిరగబడిపోయాయి. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గంజాం జిల్లాలో తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. దాని తర్వాత పూరి జిల్లాలో అధికంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎస్.ఎన్.పాత్రో తెలిపారు. మిగతా కోస్తా జిల్లాలపై అంత తీవ్ర ప్రభావం లేదన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 14,514 గ్రామాలు, 80,53,620 మంది జనాభాపై తుపాను ప్రభావం చూపిందని చెప్పారు. తుపాను కారణంగా 2.34 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని, 8.73 లక్షల మందికి పైగా ప్రజలను ఖాళీచేయించి శిబిరాలకు తరలించినట్లు వివరించారు. వర్షాలు, వరద ముంపు వల్ల ఐదు లక్షల హెక్టార్లకు పైగా పొలాల్లో పంట ధ్వంసమైందని.. ఈ నష్టం రూ. 2,400 కోట్ల వరకూ ఉంటుందని వివరించారు. తుపాను వల్ల ప్రజల ప్రాణ నష్టాన్ని అత్యంత కనిష్టానికి పరిమితం చేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందులో విజయం సాధించగలిగామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆదివారం భువనేశ్వర్‌లో పేర్కొన్నారు. అయితే కోట్ల రూపాయల అస్తి నష్టం సంభవించిందన్నారు. ఇక పునరావాసం, పునర్నిర్మాణంలో నిమగ్నమవుతామని చెప్పారు. ప్రధానంగా రైల్వే లైన్లు, ప్రధాన నగరాల్లో త్వరగా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వెస్కోకు చెందిన సుమారు 200 మందితో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గంజాం జిల్లాలో విద్యుత్ వ్యవస్థ చక్కబడడానికి, టెలికాం వ్యవస్థ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూరి-హౌరాల మధ్య రైల్వే ట్రాక్‌లను ఆదివారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రైలు సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఈ నగరాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు కూడా ప్రారంభించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన పట్నాయక్ సోమవారం హెలికాప్టర్లో పర్యటించనున్నారు. సిక్కోలులో తుడిచిపెట్టుకుపోయిన పంటలు పెను తుపాను గండం నుంచి ఉత్తరాంధ్ర గట్టెక్కింది. శ్రీకాకుళం జిల్లా బులివాడు గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు భారీ వర్షాలకు ఇల్లు కూలి చనిపోయాడు. కవిటి మండలంలో తుపాను శిబిరంలో నిద్రిస్తున్న 27 ఏళ్ల మత్స్యకారుడొకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలు మినహా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. రోడ్లు, విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 233గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. సుమారు 29 వేల ఎకరాల్లో వరి, 17,500 ఎకరాల్లో కొబ్బరి పంట, 1000 ఎకరాల్లో మామిడి, 500 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మునగ దెబ్బతిన్నాయి. భారీగా మొక్కజొన్న, చెరకు పంటలు కూడా ధ్వంసమయ్యాయి. దాదాపు వంద ఇళ్లు కూలిపోగా, మరో 50 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీగా చెట్లు కూలిపోవటంతో 233 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 39 గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 19 బృందాలు (ఒక్కో బృందంలో 40 మంది చొప్పున), మరో 500 మందికి పైగా సైనిక సిబ్బంది (ఇంజనీర్లు, సమాచార వ్యవస్థ నిపుణులు, వైద్య బృందాలు) సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 294 తీర గ్రామాల నుంచి దాదాపు 1.34 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. తుపాను ప్రభావం తేలిపోవటంతో విశాఖ జిల్లాలోని సహాయ శిబిరాల నుంచి 24,000 మందిని వారి ఇళ్లకు పంపించివేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంకా లక్ష మందికి పైగా తీర ప్రాంత ప్రజలు శిబిరాల్లోనే ఉన్నారు. మరోవైపు ఒడిశాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచివుంది. బీహార్‌కు వరద హెచ్చరిక ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు తుపాను గండం గడిచిపోయిందని.. అయితే బీహార్‌లో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్ మైదాన ప్రాంతాల్లో, కోసి, గంధక్ నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుందని చెప్తూ.. ఆ రాష్ట్రానికి వరద హెచ్చరిక జారీచేసింది. దీంతో వరద అవకాశాలున్న 28 జిల్లాలను బీహార్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు.. సుపాల్, దర్భంగా, గోపాల్‌గంజ్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బేగుసరాయ్, భగల్పూర్, భోజ్‌పూర్, జెహానాబాద్, పాట్నా జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వాయుగుండంగా తుపాను పెను తుపానుగా శనివారం రాత్రి తీరం దాటిన పై-లీన్ ఆదివారం ఉదయానికి బలహీనపడి తుపానుగా మారిందని, సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని, గాలుల వేగం 45-55 కిలోమీటర్లకు తగ్గిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం ఉదయానికి ఇది అల్పపీడనంగా మారుతుందని.. నేపాల్ వైపు పయనిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశాలోని జర్సీగూడ సమీపంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు, ఒడిశాలోని పూరి, బాలాసోర్, జగత్సింగ్ఫూర్, కటక్, సంబల్పూర్ జిల్లాలు.. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు మరికొన్ని రోజులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకొని ఉన్న పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సాగరంలో 4 కి.మీ ఈదుకుంటూ.. ఒడిశా తీరం చేరిన 18 మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్ వద్ద సముద్రంలో చిక్కుకుపోయిన 18 మంది తమిళనాడు మత్స్యకారులు ఆదివారం సముద్రాన్ని ఈదుకుని సురక్షితంగా తీరం చేరుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన వీరు తుపాను సమయంలో పారాదీప్ వద్ద చేపలు వేటాడేందుకు ఉపయోగించే బోటులో చిక్కుకుపోయారు. గత నెల 22న ఒడిశా తీరం నుంచి సుదూర సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరు.. తుపాను రాబోతోందని తెలియగానే తిరిగివచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రయాణం సక్రమంగా సాగకపోగా.. ట్రాలర్లో డీజిల్ కూడా అయిపోవటంతో పారాదీప్ పోర్టుకు నాలుగు కి.మీ. దూరంలో చిక్కుకుపోయారు. కోస్ట్‌గార్డ్ విభాగాన్ని సంప్రదించినప్పటికీ సముద్రం కల్లోలంగా ఉండటంతో సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో వారు ఆదివారం ట్రాలర్ నుంచి దూకివేసి సముద్రంలో నాలుగు కి.మీ. ఈదుకుంటూ జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎర్సామా తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. బంగాళాఖాతంలో మునిగిన నౌక! తుపాను కారణంగా అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతంలో ఎంవీ బింగో అనే సరుకు రవాణా నౌక మునిగిపోయినట్లు భావిస్తున్నామని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.పి.ఎస్.కహ్లోన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పనామాలో రిజిస్టరైన ఎంవీ బింగో నౌక 8,000 టన్నుల ఐరన్ ఓర్ (ముడి ఇనుము ఖనిజం)తో ప్రయాణిస్తోంది. పశ్చిమబెంగాల్ తీరంలోని సాగర్ పోర్టు నుంచి ఈ నెల 11వ తేదీన చైనా వెళ్లేందుకు బయల్దేరింది. శనివారం నుంచి అదృశ్యమైన నౌక జాడ ఆదివారం సాయంత్రానికి కూడా తెలియరాలేదు. బెంగాల్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో లైఫ్బోట్లో ఉన్న నౌక సిబ్బందిని ఆదివారం ఉదయం కోస్ట్ గార్డ్ డోర్నియర్ విమానం గుర్తించింది. వారిని వెనక్కు రప్పించేందుకు మరో నౌకను పంపిస్తున్నారు. తుపాను సమయాల్లో నౌకలను నౌకాశ్రయాల్లో ఉంచితే భారీ నష్టం సంభవించే అవకాశం ఉండటంతో.. వాటిని సముద్రం మీదకి తరలించటం అంతర్జాతీయంగా అనుసరించే విధానం. -
పై-లీన్ బాధితులకు లార్డ్ స్వరాజ్ పాల్ ఆర్థిక సాయం
ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పై-లీన్ తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితలకు పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం లండన్‌లోని తన నివాసంలో లార్డ్ స్వరాజ్ పాల్ విలేకర్లతో మాట్లాడుతూ... పై-లీన్ తుపాన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహారించిన తీరు నభూతోనభవిష్యత్తు అని ప్రశంసించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అత్యంత భీకరమైన ఆ తుపాన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. వీటితోపాటు భారత ఆర్మీ, వైమానిక దళాలు సహాయక చర్యలపై స్వరాజ్ పాల్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పై-లీన్ తుపాన్‌పై జాతీయ, స్థానిక మీడియాలు ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు. అందువల్లే మృతులు కానీ గాయాలపాలైన వారు కాని చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. పై-లీన్ తుపాన్ దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించినట్లు చెప్పారు. రూ. 25 లక్షల విరాళాన్ని సాధ్యమైనంత త్వరగా పై-లీన్ తుపాన్ బాధితులకు అందజేస్తామని లార్డ్ స్వరాజ్ పాల్ వివరించారు. -
బాధితులకు ప్రముఖుల సానుభూతి
పై-లీన్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని చూసిన బాలీవుడ్ ప్రముఖులు చలించిపోయారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ సందేశాలు పంపారు. గడిచిన 14 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించిన పై-లీన్ తుఫాను కారణంగా ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరు ఏమన్నారంటే.. అమితాబ్ బచ్చన్: దేవుడి ఆగ్రహం పై-లీన్ తుఫాను రూపంలో కనిపించింది!! అందరూ జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కలవారినీ రక్షించాలి. అందరి కోసం ప్రార్థించండి! T 1186 -The fury of the God's in cyclone #Phailin !! Be careful, beware and be protected .. and be in prayer !! — Amitabh Bachchan (@SrBachchan) October 12, 2013 మాధురీ దీక్షిత్: పై-లీన్ తుఫాను వల్ల ప్రభావితమైనవారందరి కోసం నేను ప్రార్థిస్తాను. వారు ఈ కష్టాన్ని అధిగమించేందుకు దేవుడు వారికి తగినంత మనోధైర్యాన్ని ఇవ్వాలి. My prayers go out to all the people affected by Cyclone Phailin. May God give them strength to overcome this ordeal. — Madhuri Dixit-Nene (@MadhuriDixit) October 13, 2013 అక్షయ్ కుమార్: ప్రకృతి ప్రకోపానికి బలైనవారందరికీ నా ప్రార్థనలు తోడుంటాయి. ఒడిశాలో ప్రశాంతత నెలకొనాలని ఆశిస్తున్నా. ఈ సమయంలో మనమంతా చేయగలిగినది ఇది మాత్రమే. బొమ్మన్ ఇరానీ: ఈసారి మనం ప్రతిసారి కన్నా బాగా ఎక్కువ సంసిద్ధులయ్యాం. దాన్ని ప్రకృతి కూడా గౌరవించింది. అనుకున్నదానికంటే దాని క్రూరత్వం కూడా కాస్త తక్కువగా ఉంది. Seems we were more prepared than usual. Even nature seems to respect that and in turn has been less brutal than expected. — boman irani (@bomanirani) October 13, 2013 మీరా నాయర్: ఊపిరి బిగబట్టి తుఫాను బీభత్సాన్ని చూస్తున్నా. నా జన్మభూమి ఒడిశా వాసులకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ప్రకృతి విలయతాండవాన్ని మనం అధిగమించాలి.< Holding my breath about #Phailin, prayers and courage for the people of my birthplace in #Odisha. May nature's fury be contained — Mira Nair (@MiraPagliNair) October 12, 2013 /p> -
నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు
-
తిండి లేదు మంచినీరు లేదు - బాధితులు
-
ఫైలిన్ విలయం
-
బాధితులకు ప్రముఖుల బాసట
పై-లీన్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని చూసిన బాలీవుడ్ ప్రముఖులు చలించిపోయారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ సందేశాలు పంపారు. గడిచిన 14 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించిన పై-లీన్ తుఫాను కారణంగా ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరు ఏమన్నారంటే.. అమితాబ్ బచ్చన్: దేవుడి ఆగ్రహం పై-లీన్ తుఫాను రూపంలో కనిపించింది!! అందరూ జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కలవారినీ రక్షించాలి. అందరి కోసం ప్రార్థించండి! T 1186 -The fury of the God's in cyclone #Phailin !! Be careful, beware and be protected .. and be in prayer !! — Amitabh Bachchan (@SrBachchan) October 12, 2013 /> మాధురీ దీక్షిత్: పై-లీన్ తుఫాను వల్ల ప్రభావితమైనవారందరి కోసం నేను ప్రార్థిస్తాను. వారు ఈ కష్టాన్ని అధిగమించేందుకు దేవుడు వారికి తగినంత మనోధైర్యాన్ని ఇవ్వాలి.My prayers go out to all the people affected by Cyclone Phailin. May God give them strength to overcome this ordeal.— Madhuri Dixit-Nene (@MadhuriDixit) October 13, 2013 /> అక్షయ్ కుమార్: ప్రకృతి ప్రకోపానికి బలైనవారందరికీ నా ప్రార్థనలు తోడుంటాయి. ఒడిశాలో ప్రశాంతత నెలకొనాలని ఆశిస్తున్నా. ఈ సమయంలో మనమంతా చేయగలిగినది ఇది మాత్రమే. బొమ్మన్ ఇరానీ: ఈసారి మనం ప్రతిసారి కన్నా బాగా ఎక్కువ సంసిద్ధులయ్యాం. దాన్ని ప్రకృతి కూడా గౌరవించింది. అనుకున్నదానికంటే దాని క్రూరత్వం కూడా కాస్త తక్కువగా ఉంది.Seems we were more prepared than usual. Even nature seems to respect that and in turn has been less brutal than expected.— boman irani (@bomanirani) October 13, 2013 /> మీరా నాయర్: ఊపిరి బిగబట్టి తుఫాను బీభత్సాన్ని చూస్తున్నా. నా జన్మభూమి ఒడిశా వాసులకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ప్రకృతి విలయతాండవాన్ని మనం అధిగమించాలి.Holding my breath about #Phailin, prayers and courage for the people of my birthplace in #Odisha. May nature's fury be contained— Mira Nair (@MiraPagliNair) October 12, 2013 /p> -
దక్షిణ కోస్తాలో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
-
తడిసి ముద్దయిన శ్రీకాకుళం జిల్లా
పై-లీన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లు కనిష్ఠంగా 10 సెంటీమీటర్లతో మొదలుపెట్టి, గరిష్ఠంగా 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గడిచిన 24 గంటల్లో.. ఇచ్ఛాపురంలో 20 సెంటీమీటర్లు, కవిటిలో 15.4 సెం.మీ, కంచిలి 14.7సెం.మీ, కోటబొమ్మాళి 10.8, సోంపేటలో 10.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సంతబొమ్మాళి, గార, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, రణస్థలం మండలాల్లో ఈ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. -
విశాఖపట్నం-హౌరా రైళ్లు రద్దు
ఫైలిన్ తుపాన్ ప్రభావం రైళ్ల సర్వీసులపై రెండో రోజూ ప్రభావం చూపుతోంది. ఆదివారం విశాఖపట్నం, హౌరా మధ్య నడిచే అన్ని రైళ్లను ఆపివేశారు. శనివారం కూడా చాలా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తపాన్ ధాటికి రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య , తూర్పు రైల్వే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులతో కలిపి 70కి పైగా రైళ్లను రద్దు చేశాయి. వీటిలో విశాఖపట్నం, పూరి, భువనేశ్వర్ మధ్య ప్రయాణించాల్సిన రైళ్లు కూడా ఉన్నాయి. తుపాన్ ప్రభావం ఒడిషా తీర ప్రాంత జిల్లాల్లో అధికంగా ఉండగా, రాష్ట్రంలో శ్రీకాకుళం మినహా ఇతర జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. అధికారులు వాతావరణ పరిస్థితుల్ని, ట్రాక్‌లను పరిశీలించి రైళ్లను మళ్లీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారన్న విషయాన్ని నిర్ణయించనున్నారు. -
వచ్చే 48 గంటల్లో ఒడిషాలో వర్షాలు
-
సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో తీవ్రతుఫాను కేంద్రీకృతం
పై-లీన్ ఇప్పటికీ పెను తుఫానుగానే ఉంది. గడిచిన ఆరు గంటలుగా ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత ఉత్తరదిశగా పయనించి, ఈరోజు మధ్యాహ్నానికి తుఫానుగాను, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగాను మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించిన వాతావరణ సూచనలో తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రం మీద ఉత్తర కోస్తాలో తీవ్రంగా ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గాలుల వేగం తగ్గింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలలో ప్రస్తుతం గాలుల వేగం గంటకు 110-120 కిలోమీటర్లుగా ఉంది. ఇది ఈరోజు మధ్యాహ్నానికి గంటకు 80-90 కిలోమీటర్లకు తగ్గుతుంది. విశాఖలో సముద్రం ఇంకా రఫ్ గానే ఉన్నా, నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది. మధ్యాహ్నానికి ఇంకా శాంతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఇంకా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాలుల వేగం, వర్షాలు అన్నీ తగ్గుతాయి. -
ఒడిషాలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
-
చిగురుటాకులా వణికిన శ్రీకాకుళం జిల్లా
పై-లీన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎర్రనీళ్లనే పట్టుకుని వాటినే తాగాల్సి వస్తోంది. అధికారులు గానీ, నాయకులు గానీ ఎవ్వరూ తమ వద్దకు రాలేదని, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా రోడ్డుమీదకు తీసుకురావడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు అందించాలని కవిటి, కంచిలి, మందస, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల ప్రజలు కోరుతున్నారు. ఎక్కడికక్కడ సెల్‌ఫోన్ టవర్లు పడిపోవడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యింది. ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే, ఈ ప్రాంతం మళ్లీ కోలుకోడానికి కనీసం రెండు రోజులు పట్టేలా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్ల మీద పడిపోయిన చెట్లను తొలగించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని, చెట్లు పెద్దవి కావడంతో గొడ్డళ్లతో నరకడం కూడా సాధ్యం కావట్లేదు. మీడియా వాహనాలను కూడా అవతల పెట్టుకుని, ఇవతలకు కాలి నడకనే రావాల్సి వస్తోంది. మంచి రేటు వస్తుందని కొబ్బరి రైతు ఆశిస్తున్న సమయంలో దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి పంట నేలకొరిగింది. అరటితోటలు అసలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. -
తుఫాన్ పీడిత ప్రాంతాల్లో బయటపడుతున్న నష్టాలు
-
తీరం దాటిన ఫైలిన్
-
ముందుజాగ్రత్తలతో తప్పిన పెనుముప్పు
పై-లీన్ తుఫాను తీరం దాటినప్పుడు గాలి వేగం దాదాపు గంటకు 220-240 కిలోమీటర్లు ఉంది. తుఫాను కూడా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది. ఇంత తీవ్రత ఉన్న తుఫాను సంభవిస్తే జనం అల్లాడిపోవాలి. నిజానికి 1999లో కూడా ఇంతే తీవ్రతతో తుఫాను సంభవించి ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది అప్పటి విలయానికి దాదాపు 12 వేల మంది మరణించారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అయితే.. ఈసారి కూడా అంతే తీవ్రతతో తుఫాను తీరాన్ని దాటినా, ప్రాణనష్టం అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం. ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించడం, దానికితోడు రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు.. ఇలా అందరూ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం ఎక్కువ సంభవించకుండా అరికట్టగలిగారు. తుఫాను ప్రభావంతో కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే జాగ్రత్త వహించి ఒడిశా నుంచి దాదాపు 8 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ ప్రాణనష్టం సంభవించకుండా నివారించగలిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ కృష్ణచౌదరి తెలిపారు. -
బీభత్సం సృష్టించిన తుఫాను
పై-లీన్ తుఫాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం వణికించింది. ప్రకృతి విలయం సృష్టించింది. ఏకంగా 60-100 టన్నుల బరువుండే కంటెయినర్లు కూడా గాలి వేగానికి ఆగలేక పడిపోయాయంటే తుఫాను ఎంత తీవ్రస్థాయిలో వచ్చిందో తెలుస్తుంది. ఈ తుఫాను బీభత్సాన్ని రాష్ట్ర ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించేందుకు వెళ్లిన పలు మీడియా వాహనాలు కూడా గాలి వేగానికి కొట్టుకుపోయాయి. సాక్షి ఓమ్నీ వ్యాన్ దాదాపు 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. సాక్షి మీడియా సహా పలు మీడియా సంస్థలకు చెందిన సిబ్బంది మొత్తం గోపాల్‌పూర్‌లోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. ఆ హోటల్ యజమాని జనరేటర్ ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించినా, సమాచార వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావడంతో విజువల్స్ తెల్లవారే వరకు అందలేకపోయాయి. హోటల్ అద్దాలు పగిలిపోయాయి. షట్టర్లను తోసుకుని మరీ గాలి వచ్చేసింది. గంజాం జిల్లాలో పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి. టెలిఫోన్ టవర్లు, విద్యుత్ టవర్లు కూలిపోయాయి. దీంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. ఒడిశాలోని దాదాపు ఏడు జిల్లాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. మంచినీటి సరఫరా అంతంతమాత్రమే. ఒక మాదిరి కచ్చా ఇళ్లన్నీ కూలిపోవడంతో ముందుగానే అక్కడి ప్రజలు పెద్ద భవనాల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. -
వాయుగుండంగా మారనున్న పై-లీన్ తుఫాను
-
రాత్రంతా బిక్కుబిక్కుమన్న తీర ప్రాంత జనం
-
ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు
ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 90 కిలోమీటర్ల వాయవ్యంగా కేంద్రీకృతమై ఉన్న పై-లీన్ తుఫాను ప్రభావంతో ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోపాల్‌పూర్‌లో తీవ్ర విధ్వంసం సంభవించింది. పక్కా ఇళ్లు తప్ప పూరిళ్లు అలన్నీ కూలిపోయాయి. సెల్‌ఫోన్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి. తీరప్రాంతాల్లో ఇప్పుడు కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మరో 36 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పై-లీన్ తుఫాను ప్రభావంతో ఒడిసా పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజికి వరద నీరు ఉధృతంగా వస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు బ్యారేజికి ఉన్న 8 గేట్లు ఎత్తేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో వరద గాలుల తీవ్రతకు 15 పడవలు దెబ్బతిన్నట్లు సమాచారం. -
వాయుగుండంగా మారనున్న పై-లీన్ తుఫాను
పై-లీన్ తుఫాను గోపాల్ పూర్ నుంచి 90 కిలోమీటర్ల వాయవ్య దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండగా మారుతుంది. ఇక ఇప్పుడు మన రాష్ట్రం వైపు వచ్చే అవకాశం లేదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి రాధేశ్యాం తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలపై ఎక్కువ ప్రభావం. తీరం వెంబడి బలమైన గాలులు. వర్షాలు కూడా ఎక్కువగా ఉంటుంది. క్రమంగా బలహీనపడుతోంది. గాలుల తీవ్రత ఎక్కువగానే ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇది తగ్గేవరకు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గానీ, చేపల వేటకు గానీ వెళ్లాలంటే మళ్లీ తాము సూచనలిస్తామని, అంతవరకు మాత్రం వెళ్లడం ప్రమాదకరమేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళింగపట్నంలో 10వ నెంబరు, కాకినాడలో 8వ నెంబరు ప్రమాదహెచ్చరికలు ఎగరేశారు. దక్షిణ కోస్తాలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. -
పై-లీన్‌పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షణ
న్యూఢిల్లీ: ప్రచండ తుపాను పై-లీన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్సేత్ శనివారం పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారి సన్నద్ధతను పర్యవేక్షించారు. ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన సహాయక చర్యలు, తుపాను తీరం దాటిన తర్వాత సాధారణ పరిస్థితులు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో శాఖల వారీగా బాధ్యతలను నిర్దేశించారు. హోం, రక్షణ, పెట్రోలియం, టెలికం, ఆరోగ్య, ఆహార, రైల్వే, తాగునీరు సహా పలు శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. శాఖల మ ధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈ భేటీలో తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తుపాను తీరం దాటిన తర్వాత ఇంధన కొరత లేకుండా చూసేందుకు, సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు టెలికం, పెట్రోలియం శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేశాయని వెల్లడించాయి. మూడు రోజులకు సరిపడా ఇంధనం, వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచారు. విద్యుత్ వ్యవస్థకు విఘాతం కలిగితే, రైళ్లను నడిపేందుకు డీజిల్ ఇంజిన్లను రైల్వే శాఖ సిద్ధంగా ఉంచింది. కనీస నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు కూడా తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించేందుకు వైద్య బృందాలను రంగంలోకి దింపినట్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాల కోసం పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. 1990 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థాయిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇదే మొదటిసారని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. -
వణికిన ఒడిశా
సాక్షి, భువనేశ్వర్, బరంపురం: పై-లీన్ తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తీవ్రస్థాయిలో వణికించింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కళ్లికోట్‌లో చెట్టుకూలడంతో మరణించారు. భారీ వర్షం, గాలుల కారణంగా రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మిగిలిన వాటిని ఒడిశా, ఆంధ్రాలోని వివిధ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గంజాం, పూరీ, కేంద్రపర, ఖుర్దా, జగత్సింగ్పూర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పారాదీప్ పోర్టును అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతంలో సముద్రం 25 మీటర్ల మేర ముందుకు వచ్చింది. తీర ప్రాంతంలో 3 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. భారీ వర్షాలకు గాలులు తోడవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గజగజలాడిన గంజాం గంజాం జిల్లాపై పై-లీన్ ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ జిల్లాలోని గోపాల్పూర్ సమీపంలో తుపాను తీరం దాటినట్టు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలోని ప్రధాన నగరాలైన బరంపురం, గోపాల్పూర్, పురుషోత్తంపూర్ తదితర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాలలో శనివారం రోజంతా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాత్రికి ఈ వేగం సుమారు 200 కిలోమీటర్లు దాటింది. బరంపురం, గోపాల్పూర్ సహా తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి వసతులు కల్పించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించింది. మహానదికి వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు రోజంతా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. బరంపురం నిర్మానుష్యంగా మారింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా ఆరేడు గంటల పాటు గాలులు ఉధృత ంగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందారు. -
18 హెలికాప్టర్లు, 12 విమానాలు సిద్ధం: సుశీల్ కుమార్ షిండే
ఫైలిన్ తుపాన్ బాధితులకు సహాయక, పునరావాస చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. 18 హెలీకాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధ నౌకల్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవరసమైన చోట వీటిని మోహరించినట్టు షిండే చెప్పారు. ఒడిషాలో 5.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మంత్రి తెలియజేశారు. ఒడిషాలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో ఫైలిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 500 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
పలాస పునరావాస కేంద్రంలోతీరప్రాంతవాసులు
-
ఫైలిన్ తుపాన్ సహాయక చర్యలపై ప్రధాని సమీక్ష
ఫైలిన్ తుపాన్ బాధితుల్ని ఆదుకునేందుకు సాధ్యమైనంత వరకు సహాయక చర్యల్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ శాఖల్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభావ రాష్ట్రాలకు సహకారమందించాల్సిందిగా సూచించారు. ప్రజల భద్రతపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశించారు. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం స్వదేశం తిరిగొచ్చిన ప్రధాని ఫైలిన్ తుపాన్ ప్రభావంపై సమీక్షించారు. చేపడుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. -
శ్రీకాకుళం జిల్లాపై ఫైలిన్ తీవ్ర ప్రభావం
ఫైలిన్ తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాపై చూపుతోంది. ఒడిషాలోని గోపాల్పూర్ వద్ద తుపాన్ తీరం దాటిన కాసేపటికి జిల్లాలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తుపాను ప్రభావానికి వణికిపోతున్నారు. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడంతో ఇప్పటికే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపకపోవడం ఊరట కలిగించే విషయం. విజయనగరంపై ఓ మోస్తారు ప్రభావం చూపినా విశాఖపట్నం జిల్లాలో కాస్త తక్కువే. మిగిలిన జిల్లాల్లో అంతగా నష్టం వాటిల్లని దాఖలాల్లేవు. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
ఢిల్లీ-భువనేశ్వర్ రైళ్లు రద్దు
ఫైలిన్ తుపాన్ కారణంగా ఢిల్లీ-భువనేశ్వర్ మధ్య రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైళ్లను అలాగే భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వచ్చే రైళ్లను నిలిపివేసినట్టు ఉత్తరాది రైల్వే శనివారం ప్రకటించింది. ఆదివారం బయల్దేరాల్సిన న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (నెంబర్ 22812)ను, ఈ నెల 14వ తేదీ ఉన్న న్యూఢిల్లీ-పూరి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12802), న్యూఢిల్లీ-పూరినందన్ కణ్నన్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12816), న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 22806)ను రద్దు చేశారు. 15న బయల్దేరాల్సిన హరిద్వార్-పూరి ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు. -
తీరానికి 80 కి.మీ దూరంలో తుపాన్
ఫైలిన్ తుపాన్ ప్రభావానికి ఆంధ్రప్రదేశ్, ఒడిషా కోస్తా తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఒడిషాలోని గోపాల్‌పూర్‌కు తుపాన్ 80 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. గంటకు 20 కి.మీ వేగంతో తీరం వైపు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. ఉత్తరాంధ్రలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
దూసుకొస్తున్న జల ప్రళయం..
జల ప్రళయం దూసుకొస్తోంది. మూడు రోజులుగా భయకంపితులను చేస్తున్న పై-లీన్ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో పెనుముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా నాలుగు జిల్లాలకు పెను ముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. పై- లీన్ తుఫాను ఈ సాయంత్రం గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని మెట్రోలాజికల్ సీనియర్ సైంటిస్ట్ బి.కె. బందోపాధ్యాయ అన్నారు. తీరం దాటిన తర్వాత తుఫాను ప్రభావం ప్రమాదస్థాయిలో ఉంటుందన్నారు. పై-లీన్ తుఫానుతో ఒడిషాలోని గోపాల్పూర్ వాసులు వణికిపోతున్నారు. విజయనగరం జిల్లాలో తీరప్రాంతాల ప్రజలు జడిసిపోతున్నారు . తుఫాను బారి నుంచి తమను కాపాడాలని మత్య్సకార గ్రామాల ప్రజలు గంగమ్మకు పూజలు చేస్తున్నారు. సముద్రం నుంచి ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 23 గ్రామాలు తీరప్రాంతాన్ని అనుకుని ఉన్నాయి. నెల్లూరు జిల్లా వాసులు పై-లీన్ తుఫానుతో వణికిపోతున్నారు. తీర ప్రాంతంలో సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి అధికమైంది. దాదాపు మీటరు ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తడ, తూపిలిపాలెం, కోడూరుపాడు, మైపాడు, జువ్వలదిన్నె, తుమ్మల పెంట, రామతీర్థం వద్ద సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా తీరప్రాంత ప్రజలను పై-లీన్ తుపాను భయపెట్టిస్తోంది. తుపాను హెచ్చరికల నేపధ్యంలో నరసాపురం తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చినలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, మోళ్ళవర్రు గ్రామాల్లోని మత్స్యకారులు పడవలు, వలలను భద్రపరుచుకున్నారు. ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు ఆధ్వర్యంలో తీరప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజలదే ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య అన్నారు. అధికారులు రాలేదని... ఊళ్లు ఖాళీ చేయకుండా ఉండవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇళ్ల ముందు పశువులను కట్టివేయకుండా వదిలేయాలని సూచించారు. మత్య్సకారులు చేపలు పట్టడానికి వెళ్ళవద్దన్నారు. చెట్ల కింద నిల్చోరాదని ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాల్లోనే ఉండాలని డీసీ రోశయ్య సూచించారు. కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్ల నెంబర్లు.. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పైలీన్ గండం
-
పశ్చిమబెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న రాష్ట్రపతి
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్లడానికి బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పై-లీన్ తుఫాను నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు. బెంగాల్‌కు పొరుగు రాష్ట్రమైన ఒడిషాను తుఫాను తీవ్రంగా తాకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. కోల్‌కతాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరాటీ సమీపంలోని కిర్నహార్ గ్రామం నుంచి సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ రోడ్డుమార్గంలో బయల్దేరుతారని అధికారవర్గాలు తెలిపాయి. కారులో ఆయన పానాగఢ్ చేరుకుని, అక్కడింనుంచి విమానమార్గంలో న్యూఢిల్లీ వెళ్తారు. వాస్తవానికి దుర్గాపూజ కోసం తన పూర్వీకుల గ్రామానికి రాష్ట్రపతి చేరుకున్నారు. ప్రణబ్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత దుర్గాపూజకు రావడం ఇది రెండోసారి. -
పై-లీన్ నేపథ్యం: దక్షిణ మధ్య రైల్వే హెల్ప్లైన్ల ఏర్పాటు
పై-లీన్ తుఫాను కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని పలు రైళ్లు రద్దుకావడం, మరిన్ని రైళ్ల మార్గాల మార్పిడి తదితర కారణాల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా 56 రైళ్లను రద్దుచేయగా, 16 రైళ్ల మార్గాలు మార్చామని, నాలుగైదు రైళ్లను పాక్షికంగా రద్దుచేశామని రైల్వే అధికారప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. విజయవాడ, రాజమండ్రి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, మంచిర్యాల స్టేష్లలో ప్రయాణికుల కోసం వీటిని ఏర్పాటుచేశారు. ఆ నెంబర్లు ఇవీ.. విజయవాడ: 0866-2575038, రాజమండ్రి: 0883-2420541, 2420543, కాజీపేట: 0870-2548660, వరంగల్: 0870-2426232, ఖమ్మం: 08742-256025, మంచిర్యాల: 08736-250081 -
తీర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలపాటు తుపాను ప్రభావం
-
పై-లీన్ తుఫాను నేపథ్యం: 3.6 లక్షల మంది తరలింపు
పై-లీన్ తుఫాను విరుచుకుపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున భారీ విధ్వంసం జరుగుతుందన్న ప్రచారంతో ప్రజలను తరలించారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే పెనుగాలులు, వర్షం మొదలయ్యాయి. తీవ్ర పెను తుఫాను పై-లీన్ శనివారం సాయంత్రం 6-8 గంటల మధ్యలో తీరాన్ని దాటొచ్చని, ఆ సమయంలో దాని వేగం గంటకు 210-220 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో దాదాపు ఆరు గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా తీరప్రాంతాల్లో శుక్రవారం రాత్రికే ఈదురు గాలులతో దాదాపు 8-10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిషాలోని గంజాం, ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో పెనుగాఉలుల వీచే ప్రమాదం ఉంది. దీంతో ఒడిషాలో మూడు లక్షల మందిని, ఉత్తర కోస్తాంధ్రలో 64 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలతో పాటు.. జాతీయ విపత్తు నివారణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా రక్షణ చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఒడిషాలోని పలు ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగిందని ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ మొహాపాత్ర తెలిపారు. గంజాంలో గాలుల వేగం గంటకు 60-80 కిలోమీటర్లుంది. గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని భావిస్తుండటంతో అక్కడ భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. గంజాం, గజపతి, ఖోర్దా, పూరీ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూరీ సమీపంలోని ఆస్త్రాంగా ప్రాంతం నుంచి వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. -
తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...
పై-లీన్ తుఫాను అరివీర భయంకరంగా దూసుకొస్తోంది. ఇది తీరం దాటే సమయంలో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సందర్భంలో అసలు ఏం జరిగే అవకాశాలుంటాయి? మనం ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలో ఒక్కసారి చూద్దాం. గతంలో 1996లో కోనసీమ ప్రాంతంలోను, 1999 పెను తుఫాను వచ్చినప్పుడు కూడా గాలుల వేగం అత్యంత తీవ్రంగానే ఉంది. అప్పట్లో గోడలు కూలిపోయాయి. కిటికీల అద్దాలు వాటంతట అవే పగిలిపోయాయి. చెట్లు ఉన్నట్టుండి కూలిపోయాయి. కమ్యూనికేషన్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టవర్లు కూలిపోయాయి. హోర్డింగులు కూడా పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు, మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అందువల్ల పాత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. భారీ హోర్డింగులు, కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలకు సమీపంలో నిలబడటం గానీ, వాటి వద్ద వాహనాలు పార్కింగ్ గానీ చేయకూడదు. కరెంటు వైర్లు తెగిపడొచ్చు కాబట్టి వాటికి దగ్గర్లో కూడా ఉండటం మంచిది కాదు. గాలులు తీవ్రమైన వేగంతో వీస్తాయి కాబట్టి, వర్షం నుంచి కాపాడుకోడానికి గొడుగులు పనికిరావు. టోపీలు గానీ, రెయిన్ కోట్లు గానీ తీసుకెళ్లడం మేలు. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి, మ్యాన్‌హోళ్లు ప్రమాదకరంగా ఉండొచ్చు కాబట్టి, ముందుగానే వాటివద్ద హెచ్చరిక బోర్డులు, కర్రలతో జెండాలు ఏర్పాటుచేయాలి. తాగునీటికి తీవ్రమైన కొరత రావచ్చు కాబట్టి ముందుజాగ్రత్తగా రెండు మూడు రోజులకు సరిపడ నీరు నిల్వచేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నందున సరిపడగా క్యాండిళ్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఉంటే వారికోసం కావాల్సిన మందులు కూడా సదా సిద్ధంగా ఉంచుకోవాలి. కిటికీ రెక్కలు, తలుపులు, గాజు కిటికీలకు సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. గాలి వేగానికి వాటివల్ల ప్రమాదం సంభవించొచ్చు. సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూం నెంబర్లు, సహాయ కేంద్రాల ఫోన్ నెంబర్లను రాసి, అందుబాటులో ఉంచుకోవాలి. సెల్ఫోన్లకు పూర్తిగా చార్జింగ్ పెట్టుకుని, అత్యవసరమైన కాల్స్ మాత్రమే చేయాలి. రెండు మూడు రోజులు విద్యుత్ సరఫరా లేకపోయినా కమ్యూనికేషన్ దెబ్బతినకుండా చూసుకోవాలి. కూరగాయలు, నిత్యావసరాలను సరిపడగా నిల్వచేసి ఉంచుకోవాలి. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
గోపాల్ పూర్ కు 200 కిలోమీటర్ల దూరంలో పై-లిన్
-
వాయుగుండం సాక్షి ఎక్స్‌క్లూజివ్ విజువల్స్
-
తుఫాన్లను గుర్తించేదెలా.. నిపుణులకు ఆధారాలేంటి?
యూవీ భాస్కరరావు, విశాఖపట్నం సాక్షి విలేకరి తుఫాను తీరం దాటబోతోందని, తీరానికి ఇంత దూరంలో ఉందని వాతావరణ కేంద్రానికి చెందిన నిపుణులు, ఇతర వాతావరణ నిపుణులు చెబుతుంటారు. అయితే, వాళ్లకు ఆ సమాచారం ఎలా వస్తుందన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు అర్థంకాని విషయాలను నిపుణులు సునాయాసంగా చెబుతూ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తారు. ఆ వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం.. వాతావరణ కేంద్ర నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, ఇంకా అవసరాన్ని బట్టి మరిన్ని సార్లు వాతావరణంలోకి బెలూన్లు వదులుతారు. వాటిలో కొన్ని రసాయనాలుంటాయి. వాటిద్వారా అవి గాలి తీవ్రతను పసిగట్టి, వాతావరణ కేంద్రంలోని కంప్యూటర్లకు పంపుతాయి. అలాగే, వాతావరణ కేంద్రాల్లో ట్రాపికల్ మీటర్లుంటాయి. వాటి ద్వారా కూడా వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. డాప్లర్ రాడార్ సిస్టమ్ ద్వారా గాలిలోని తేమ శాతాన్ని గుర్తిస్తారు. ఇక తీరప్రాంతంలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్) ఉన్నాయి. వాటి పరిధిలో ఎక్కడైనా సరే ఒక్క మిల్లీ మీటరు వర్షం పడినా అవి వెంటనే రికార్డు చేసి, వాతావరణ కేంద్రాలకు పంపుతాయి. ఇది కాక, భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంటుంది. ప్రతి మూడుగంటలకు ఒకసారి చొప్పున విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం స్పెషల్ బులెటిన్లు ఇస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాఖ సిబ్బంది, విశాఖ తుఫానపు హెచ్చరికల కేంద్రం సిబ్బంది, పదవీ విరమణ చేసిన నిపుణులు.. అందరూ ఈసారి రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని రంగరించి, పై-లీన్ తుఫాను గమనాన్ని, అది కలగజేసే ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ భానుకుమార్, వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీ కృష్ణ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం రిటైర్డ్ అధికారి అచ్యుతరావు.. వీళ్లంతా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
5లక్షల మందిని ఖాళీ చేయిస్తున్న ఒడిశా సర్కార్.
-
విచిత్రమైన తుఫాను.. పై-లీన్
యూవీ భాస్కరరావు, విశాఖపట్నం సాక్షి విలేకరి పై-లీన్ తుఫాను చాలా విభిన్నమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా చాలా తుఫాన్లు వచ్చి వెళ్లినా, వాటన్నింటి కంటే దీని ప్రవర్తన చాలా తేడాగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పై-లీన్ తుఫాను కడపటి వార్తలు అందేసరికి తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. అంటే ఇది అత్యంత వేగంగా పయనిస్తున్నట్లు లెక్క. ఇప్పటికే రాష్ట్రంలో్ని 8 ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. రెండు చోట్ల సెక్షన్ ౩ హెచ్చరికలు కూడా జారీచేశారు. అయితే, ఇంత వేగంగా తుఫాను దూసుకొస్తున్నా, ఇప్పటివరకు వాతావరణంలో మాత్రం మరీ చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదు. గాలులు వేగంగా వీయట్లేదు, అలలు మరీ ఎక్కువ ఎత్తుకు ఎగసిపడటంలేదు. అందువల్ల అసలీ తుఫాను ప్రభావం ఎప్పుడు, ఏ నిమిషంలో ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నట్లు నిపుణులు అంటున్నారు. అర నిమిషంలోనే ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చి, పెనుముప్పునకు కారణం కావచ్చని చెబుతున్నారు. లేదా.. అసలు ఎలాంటి నష్టం కలగజేయకుండా కూడా తీరాన్ని దాటే అవకాశం లేకపోలేదన్నది వాతావరణ నిపుణుల అభిప్రాయం. కేవలం ఈసారి మాత్రమే ఇలా అవుతోంది. ఇంతకుముందు వచ్చిన 73 తుఫాన్లలో ఏ ఒక్కటీ ఇలా ప్రవర్తించలేదని తెలుస్తోంది. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ
-
తూర్పులో వర్షాలు: అప్రమత్తమైన అధికారులు
-
విశాఖ మత్స్యకారుల పైలిన్ ప్రభావం
-
పడగ విప్పుతున్న పై-లీన్ పెను తుపాన్ !
-
73వ రోజు ధర్నాలతో దద్దరిల్లిన సీమాంధ్ర
సాక్షి నెట్వర్క్ : ఫైలిన్ తుపాను హెచ్చరికలు.. ఈదురుగాలులు.. అక్కడక్కడా భారీవర్షాలు.. అయినా సరే లెక్కచేయని సీమాంధ్ర ప్రజ సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే లక్ష్యంగా ఉప్పెనంత ఉద్యమంతో కదంతొక్కుతోంది. రాష్ర్టం ఒక్కటిగా ఉంచాలని కోరుతూ కోస్తా, రాయలసీమ ప్రజలు వరుసగా 73వ రోజైన శుక్రవారం కూడా ఆందోళనలు చేపట్టారు. జాతీయ రహదారి దిగ్బంధం పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడేపల్లిగూడెంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. భీమవరంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పశు సంవర్థక శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పశువుల ఆస్పత్రి వద్ద తప్పెటగుళ్లు కళాకారులు సమైక్యాంధ్ర గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన చేశారు. వివిధ శాఖల రాష్ర్ట నాయకులు కాకినాడ కలెక్టరేట్ వద్ద దీక్షల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో నలుగురు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జేఏసీ సభ్యులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. నక్కపల్లిలో ఏపీఎన్జీవోల దీక్షలు కొనసాగుతున్నాయి. గాజువాకలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా గంట్యాడలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లు నిరసన ర్యాలీ చేశారు. గజపతినగరంలో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేశారు. పార్వతీపురంలో మహిళా ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆటతో సమైక్య స్ఫూర్తి చిత్తూరులో న్యాయశాఖ ఉద్యోగులు బతుకమ్మ ఆడి సమైక్యస్ఫూర్తిని ప్రదర్శించారు. పీలేరులో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమై తెలంగాణ వాదుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందన్న ఇతిృత్తంతో లఘునాటికను ప్రదర్శించారు. చంద్రగిరిలో సమైక్యవాదులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు సోనియా, కేంద్రమంత్రుల ఫ్లెక్సీలను చాటలు, పొరకలతో కొడుతూ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో సమైక్యవాదులు మోకాళ్లపైనడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 21 మంది సమైక్యవాదులు చేపట్టిన ఆమరణ దీక్ష 5వ రోజుకు చేరింది. అనంతపురం, గుంతకల్లులో సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు. కర్నూలులో ఆర్అండ్బీ ఉద్యోగులు స్థానిక ఎస్ఈ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి గర్జన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో విద్యార్థి గర్జన పేరిట భారీసభ నిర్వహించారు. నెల్లూరులో ఎన్జీఓ భవన్లో ప్రభుత్వ వైద్యులు దీక్షలు నిర్వహించారు. ఉదయగిరిలో జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో సోనియా, దిగ్విజయ్‌సింగ్, ఆనం రామనారాయణరెడ్డి దిష్టిబొమ్మలను కోడిగుడ్లతో కొట్టారు. విజయవాడలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. పామర్రులో విద్యార్థులు మానవహారం, ర్యాలీ చేశారు. గుంటూరులో ఏపీఎన్జీవోలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అత్తలూరు, పిడుగురాళ్ళ, దాచేపల్లిలో ముస్లింలు రోడ్డుపై నమాజ్చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్జీఓలు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కనిగిరిలో కాపు, బలిజ సామాజికవర్గానికి చెందిన వారు ర్యాలీ నిర్వహించారు. 18 నుంచి వరుస ఆందోళనలు ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ప్రకటన సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి వరుస ఆందోళనలు చేపట్టి మరింత ఉధృతం చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విద్యా సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం విజయవాడలో విద్యాసంస్థల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థి నేతలు, సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు ఎల్.రత్తయ్య, చిగురుపాటి వరప్రసాద్, ప్రొఫెసర్ శామ్యూల్, ప్రొఫెసర్ నర్సింహారావు, చలసాని శ్రీనివాస్, ఎ.కిశోర్, పున్నం రాజు తదితరులు సమావేశమై జేఏసీ ఏర్పాటుచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆందోళనల్లో భాగంగా ఒకరోజు రాత్రంతా జనజాగరణ చేపడతామని, మరో రోజు పెట్రోల్ బంకులను మూయించివేస్తామని, ఇంకో రోజు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి మౌనప్రదర్శన చేస్తామని చెప్పారు. 22 నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేస్తామన్నారు. అన్ని జేఏసీలను కలుపుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు. కాగా, కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సహాయ నిరాకరణ ప్రారంభమైంది. సమైక్యాంధ్ర కోరుతూ గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరిస్తూ ఉద్యమ బాట పట్టారు. విజయనగరం ప్రశాంతం నేడు పగటి పూట కర్ఫ్యూ ఎత్తివేత సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆందోళనలతో అట్టుడికిన విజయనగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. శుక్రవారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు నుం చి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూ సడలించడంతో ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి కొనుగోళ్లు చేశారు. వారం రోజుల తరువాత బ్యాంకులు తెరవడంతో కౌంటర్ల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఆలయాలు సైతం వారం రోజుల తరువాత తెరచుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి పూజలు నిర్వహించారు. కాగా, విధ్వంసానికి సంబంధించి 11 ఆస్తుల ధ్వంసం కేసులు, రెండు లూటీ కేసుల్లో 168 మందిని అరెస్టు చేశామని ఎస్పీ కార్తికేయ తెలిపారు. అలాగే, మరో 47 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. శనివారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు కలెక్టర్ కంతిలాల్ దండే తెలిపారు. -
పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!
బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపాను ఏకంగా మనదేశం సైజులో సగం వరకూ ఉందట. తీరాన్ని తాకేదాకా పైలీన్ పరిమాణం, బలం తగ్గే అవకాశాలు లేవని హవాయిలో అమెరికా నేవీకి చెందిన ‘జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్(జేటీడబ్ల్యూసీ)’ వెల్లడించింది. పై-లీన్ తీరాన్ని దాటితే భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి పెను విలయం సృష్టించే ప్రమాదం ఉందని ఆ సంస్థ తెలిపింది. అయితే పైలీన్ పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉందని, అది దేశంలో సగం సైజులో లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ పేర్కొన్నారు. 220 కి.మీ. వేగంతో తీరం దాటే అవకాశం.... ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్‌ల మధ్య శనివారం రాత్రి గంటకు 220 కి.మీ. వేగంతో వీచే గాలులతో పై-లీన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. అయితే తుపాను గంటకు 315 కి.మీ. వేగంతో వీచే గాలులతో విరుచుకుపడే అవకాశముందని ‘జేటీడబ్ల్యూసీ’, లండన్‌లోని ‘ట్రాపికల్ స్టార్మ్’ సంస్థల నిపుణులు హెచ్చరించారు. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్ 220 కి.మీ. వేగంతో కూడిన గాలులతో విరుచుకుపడిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. వెంటనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే గనక.. అనూహ్యరీతిలో ప్రాణనష్టం, లక్షలాది మందిపై ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. 1999లో వచ్చిన ఒడిశా సైక్లోన్ ధాటికి సుమారు 10 వేల మంది మృత్యువాత పడగా.. 450 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆ తుపాను తీరం దాటిన ప్రదేశం వైపుగానే దాదాపు అదే తీవ్రతతో పై-లీన్ కూడా సాగుతోంది. అయితే హరికేన్ హంటర్ విమానాలు లేకపోవడంతో పై-లీన్ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా.. ఈ తుపాను 300 కి.మీ. వేగాన్ని మించి విజృంభించనుందని, అదే జరిగితే బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత పెను తుపానుగా ఇది రికార్డులకు ఎక్కనుందని చెబుతున్నారు. ‘కత్రినా’ను మించే విలయం..? అమెరికాను 2005లో వచ్చిన కత్రినా హరికేన్ అతలాకుతలం చేసింది. వేల కోట్ల డాలర్ల నష్టాన్ని కల్గించడమే కాకుండా 1,800 మందిని ఆ హరికేన్ పొట్టనపెట్టుకుంది. అయితే ఆ హరికేన్ కన్నా పై-లీన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఉపగ్రహ చిత్రాల సమాచారాన్ని బట్టి చూస్తే.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వేసిన అంచనాలకు మించి పైలీన్ తీవ్రత పెరగవచ్చని జేటీడబ్ల్యూసీ, ట్రాపికల్ స్టార్మ్ నిపుణులు భావిస్తున్నారు. -
పై-లీన్ పెను తుపాను.. అన్నింటా అప్రమత్తం
24 రైళ్ల మళ్లింపు లేదా రద్దు భువనేశ్వర్: పై-లీన్ పెను తుపాను దృష్ట్యా శనివారం హౌరా-చెన్నయ్ ప్రధాన మార్గంలోని విశాఖపట్నం-భద్రక్‌ల మధ్య రాకపోకలు సాగించే 24 ప్యాసింజర్ రైళ్లను మళ్లించడం లేదా రద్దు చేయాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే భావిస్తోంది. కటక్-పలాస-కటక్, పలాస-భువనేశ్వర్-పలాస, విశాఖ-పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-పలాస-విశాఖ మెము, విశాఖపట్నం-విజయనగరం-విశాఖపట్నం మెము, పలాస-గునుపూర్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారాదీప్, పూరి, అన్గుల్, తాల్చేర్ అనుబంధ లైన్లలో రాకపోకలు సాగించే పలు లోకల్ రైళ్లను కూడా మళ్లించడం లేదా రద్దు చేయనున్నారు. సైన్యం అప్రమత్తం న్యూఢిల్లీ: పై-లీన్ పెనుతుపాను దృష్ట్యా సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో సహాయ కార్యక్రమాల నిమిత్తం తరలివెళ్లేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ శుక్రవారం సూచించారు. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఇల్యూషిన్-76, సి-130జె సూపర్ హెర్క్యులస్, అన్టోన్వీ-32 రవాణా విమానాలతో పాటు మొత్తం 24 విమానాలను మోహరింపజేసింది. 18 హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. రెండు వైమానిక విమానాలు ఇప్పటికే జాతీయ విపత్తు సహాయ దళాలను, అవసరమైన సామగ్రిని భువనేశ్వర్‌కు తరలించాయి. రాయ్‌పూర్, నాగపూర్, జగదల్పూర్, బర్రాక్పూర్, రాంచి, గ్వాలియర్‌తో పాటు పలు స్థావరాల్లో వైమానికదళ యంత్రాగాన్ని సిద్ధంగా ఉంచారు. బర్రాక్పూర్లో మోహరించి ఉన్న టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌కు ఆదేశాలు జారీ చేశారు. నౌకాదళం సహాయ కార్యక్రమాల కోసం చేతక్, యూహెచ్-3హెచ్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. విశాఖలోని తూర్పు నౌకాదళం డైవింగ్ బృందాలను సిద్ధం చేసింది. 35 పెనుతుపాన్లలో 26 బంగాళాఖాతంలోనే! ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా అతి తీవ్రమైన ఉష్ణమండల(ట్రాపికల్) సైక్లోన్లు 35 సంభవించగా.. వాటిలో 26 పెనుతుపాన్లు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. గత రెండు శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రాపికల్ సైక్లోన్ల వల్ల జరిగిన మరణాల్లో 42 శాతం బంగ్లాదేశ్‌లో, 27 శాతం భారత్‌లోనే సంభవించాయి. - జెఫ్ మాస్టర్స్ (అంతర్జాతీయ వాతావరణ నిపుణుడు) పెను గాలుల్లో బయటకు వద్దు పై-లీన్ ప్రచండ తుపానుగా మారిందని, దీని తీవ్రత ముందుగా ఊహించినదానికంటే చాలా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘‘1994లో సూపర్ సైక్లోన్ వచ్చింది. దాని తర్వాత ఈ పై-లీన్ తుపానే అతి పెద్దది, తీవ్రమైనది. దీని ప్రభావం వల్ల శ్రీకాకుళంలో సముద్రం 3మీటర్ల మేరకు ఉప్పొంగే ప్రమాదముంది. శనివారం సాయంత్రం తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయి. చెట్లు, పూరిళ్లు, రేకుల షెడ్లు కూలిపోయే ప్రమాదముంది. మైదానంలోని రహదారుల్లో ప్రయాణించే వాహనాలు గాలుల తీవ్రతకు పల్టీకొట్టే ప్రమాదం ఉంది. గాలుల సమయంలో బయటకు వెళ్లవద్దు. పూరిళ్లు, రేకుల షెడ్లలో ఉండవద్దు’’ అని సూచించింది. -
సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి: జగన్
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నందున తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్న నేపథ్యంలో.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. సూపర్ సైక్లోన్‌గా పరిగణిస్తున్న ఈ పై-లీన్ తుపాను గంటకు 220 కిలోమీటర్లకు పైబడిన వేగంతో దూసుకొస్తోందని హెచ్చరిస్తున్నారని, వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి ప్రజల ప్రాణ, ఆస్తులకు పెనుప్రమాదం పొంచిఉందని తెలుస్తోందని, ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పడగ విప్పుతున్న పై-లీన్ పెను తుపాన్ !
* ఒడిశా, ఉత్తరాంధ్రలను వణికిస్తున్న ‘ఇంద్రనీలం’ * నేటి సాయంత్రం తీరం తాకనున్న పెను తుపాను * పారాదీప్ - కళింగపట్నం మధ్య తీరం దాటనున్న పై-లీన్ * శ్రీకాకుళం సహా ఒడిశాలోని నాలుగు జిల్లాలకు పెను ముప్పు * గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి * తీరం దాటేటపుడు 25 సెంటీమీటర్ల వర్షపాతం అంచనా * విశాఖ - ఒడిషాల మధ్య నేడు రైలు సర్వీసులు రద్దు ప్రస్తుతం ఎక్కడుంది? పై-లీన్ తుఫాను శుక్రవారం సాయంత్రానికి గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. థాయ్ భాషలో ‘పై-లీన్’ అంటే ఇంద్రనీలం అని అర్థం. దూసుకొచ్చేదెప్పుడు? శనివారం సాయంత్రం ఒడిశాలోని పారాదీప్ - ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా) మధ్య ఈ పెను తుపాను తీరాన్ని తాకనుంది. గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద ఇది తీరం దాటుతుంది. ఏ జిల్లాలకు నష్టం? తీరం దాటే సమయంలో గంటకు 220 కి.మీ వేగంతో పెను గాలులు వీస్తాయి. ఈ సమయంలో సముద్రం మూడు మీటర్ల వరకూ ఉప్పొంగుతుంది. తక్కువ సమయంలోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చు. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పెను ముప్పు? 1999లో ఒడిశాను వణికించిన తుపాను 9,885 మందిని బలితీసుకుంది. గంటకు 220 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తాజా తుపాను గాలుల వేగం 240 కి.మీ.పైగా ఉండొచ్చని అమెరికా అంచనా. కుండపోతే! వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్రలో రోజుకు 25 సెం.మీ. వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవవచ్చు. భువనేశ్వర్/విశాఖపట్నం/హైదరాబాద్, సాక్షి: పెను తుపాను పై-లీన్ పడగ విప్పుతోంది. తూర్పు తీరాన్ని కబళించేందుకు వేగంగా దూసుకొస్తోంది. శనివారం సాయంత్రం ఒడిషాలోని పారాదీప్ - ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం మధ్య ఈ పెను తుపాను తీరాన్ని తాకనుంది. గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద ఇది తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో దాదాపు గంటకు 220 కిలోమీటర్ల వరకూ వేగంతో పెను గాలులు వీస్తాయని హెచ్చరించింది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చని వెల్లడించింది. ఈ తుపాను ఒడిషాలోని ఐదు తీర ప్రాంత జిల్లాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అపార విధ్వంసం సృష్టించనుందని అప్రమత్తం చేసింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. అధికార యంత్రాంగం ఒడిషాలోని 14 తీర జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్రలోని లోతట్టు ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు, జాతీయ విపత్తు సహాయ దళం, సైనిక బలగాలు, వాయుసేనలు.. తుపాను ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. 8 ఓడ రేవుల్లో (కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం) మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. సముద్రం ఉప్పొంగుతుంది... థాయ్ భాషలో ‘పై-లీన్’ అంటే అంటే ఇంద్రనీలం అని అర్థం. ఈ తుపాన్ ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. రోడ్లు కొట్టుకుపోతాయి. ఒడిషాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలపై ‘ఇంద్రనీలం’ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ విభాగం అధిపతి డాక్టర్ ఎల్.ఎస్.రాథోడ్ తెలిపారు. ఇది శుక్రవారం సాయంత్రం గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో (కళింగపట్నం తీరానికి తూర్పు, ఆగ్నేయ దిక్కున 410 కిలోమీటర్ల దూరంలో) బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని.. గంటకు 45 కి.మీ. వేగంతో కదులుతోందన్నారు. ఇది దిశ మారుతూ ఒడిశా తీరంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కళింగపట్నం-పారాదీప్ మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయన్నారు. తీరం దాటే సమయంలో తీవ్ర ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో సముద్రం 3 మీటర్ల వరకూ ఉప్పొంగుతుందని రాథోడ్ వివరించారు. ఇది పెను తుపానే కానీ.. సూపర్ సైక్లోన్‌గా మారబోదని రాథోడ్ ఢిల్లీలో పేర్కొన్నారు. 1999లో ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ 9,885 మందిని బలితీసుకుంది. అప్పుడు గంటకు 220 కి.మీ.కి పైగా వేగంతో పెనుగాలులు వీచాయని.. తాజా తుపాను గాలుల వేగం 240 కి.మీ.పైగా ఉండవచ్చని అమెరికా నౌకాదళం అంచనా వేసింది కాబట్టి.. ఇది కూడా సూపర్ సైక్లోనేనని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పి.కె.మహాపాత్రా భువనేశ్వర్‌లో పేర్కొన్నారు. తీర ప్రాంతాలు ఖాళీ... తుపాను కారణంగా ఏ ఒక్కరూ చనిపోకుండా చూడాలన్న లక్ష్యంతో ఏడు కోస్తా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలను వేగంగా ఖాళీ చేయించాలని ఒడిశా సర్కారు ఆదేశించింది. గంజాం, గజపతి, పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపర, నయాగఢ్, ఖుద్రా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను శుక్రవారం సాయంత్రానికల్లా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రక్, బాలాసోర్ జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరంలోని లోతట్టు ప్రాంతాల నుంచి 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సర్వసన్నద్ధంగా సైనిక, సహాయ బృందాలు తుపాన్ నేపథ్యంలో వాయుసేనకు చెందిన రెండు ఐఎల్-76 విమానాల్లో విపత్తు సహాయ దళం బృందాలను, పరికరాలను భువనేశ్వర్‌కు తరలించారు. సహాయ చర్యల కోసం వాయుసేన బలగాలను రాయ్‌పూర్, నాగ్‌పూర్, జగ్దల్పూర్, బారక్పూర్, రాంచి, గ్వాలియర్ తదితర వైమానిక స్థావరాల్లో సంసిద్ధంగా ఉంచారు. తుపాను తీరాన్ని తాకగానే సహాయ, రక్షణ చర్యలు చేపట్టటం కోసం నౌకాదళం, వాయుసేన, జాతీయ విపత్తు సహాయ దళం, ఒడిషా విపత్తు సహాయ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి. 28 ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఒడిషా ప్రభుత్వానికి అందుబాటులో ఉంచారు. గంజాం గజగజ... తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో శుక్రవారం ఉదయం నుంచే గంటకు 65 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి ఈ గాలుల తీవ్రత 100 కిలోమీటర్ల వేగం దాటింది. భువనేశ్వర్, బరంపురం, కటక్ తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. పారాదీప్‌లో సాయంత్రం 7 గంటలకు వర్షం అధికమైంది. భువనేశ్వర్, కటక్ నగరాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోనూ సాయంత్రం 4.30 గంటల నుంచే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకునేందుకు ప్రజలు పోటీ పడడంతో దుకాణాల్లో సరుకులు ఖాళీ అయిపోయాయి. అనేకచోట్ల సాయంత్రం నుంచి దుకాణాలు మూతపడ్డాయి. గంజాం జిల్లా గోపాల్పూర్ సమీపంలో తుఫాన్ తీరం దాటనుండటంతో.. ఆ జిల్లాతో పాటు బరంపురం నగరానికి ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భయం గుప్పిట సిక్కోలు... పై-లీన్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. క్షణక్షణానికీ పెరిగిపోతున్న గాలుల ఉధృతి.. అంతకంతకూ ఎగసిపడుతోన్న కెరటాలతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ప్రత్యేకంగా హెచ్చరికలు పంపారు. తూర్పు నావికాదళం తీర ప్రాంతాల్లో ప్రత్యేక హెలికాప్టర్లతో గస్తీ చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి చిన్నపాటి ఈదురుగాలులతో ప్రారంభమైన చినుకులు క్రమంగా వర్షంగా మారాయి. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సముద్రం సాయంత్రం 4 గంటల నుంచి అల్లకల్లోలంగా మారింది. గార మండలం కళింగపట్నం, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, కంబాలరాయుడు పేట తదితర ప్రాంతాల్లో సముద్రం 30 నుంచి 70 మీటర్ల ముందుకు వచ్చేసింది. అలలు ఐదు, పది మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో అధికారులు, మెరైన్ పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని మత్స్యకారులను, బోట్లను తీరం నుంచి వెనక్కి తరలించారు. అలల ఉధృతికి తీరం కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఉన్న పడవలను గ్రామాల్లోకి తరలించారు. పలు గ్రామాల్లో స్థానికులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. జిల్లాలోని 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల పరిధిలోని 237 గ్రామాలను తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లోని సుమారు 47 వేల మందిలో శుక్రవారం సాయంత్రానికి 12,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను రక్షిత భవనాలు, ప్రభ్వుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 137 పునరావాస కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడే విధంగా బియ్యం, కిరోసిన్, నిత్యావసరాలు సిద్ధం చేశారు. మరోవైపు ఎగువన ఒడిశాలో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నాగావళి, వంశధార నదీ తీర గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లలో నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. గొట్టా బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తివేసి నీటిని కూడా వంశధార నదిలోకి వదిలారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో... విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ, చింతపల్లి, తిమ్మయ్యపాలెం, తిప్పలవలసల వద్ద సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. భోగాపురం మండలం ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. తీర గ్రామాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంతాల ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేసింది. విశాఖ జిల్లా పరవాడలోని ముత్యాలమ్మపాలెం తీరంలో సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది. భీమిలిలోని తీరం ప్రమాదకరంగా మారింది. బోయివీధి తీరానికి సమీపంలోని రక్షణ గోడ ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదముంది. సముద్రంపై వేటకు వెళ్లిన వారు సుమారు 1,500 మందికి పైగానే ఉంటారన్న సమాచారంతో.. వారందరినీ వెంటనే వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపైనా ప్రభావం... పై-లీన్ ప్రభావంతో మచిలీపట్నం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారి ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. మంగినపూడిబీచ్లోకి పర్యాటకులను శుక్రవారం అనుమతించలేదు. గురువారం నాటికి 40 బోట్లు చేపలవేట సాగిస్తుండగా వాటిలో 16 బోట్లు గిలకలదిండి హార్భర్‌కు చేరాయి. మరో 24 బోట్లు తిరిగి రావాల్సి ఉంది. వెలగలేరు వద్ద కుంపిణివాగులో గురువారం గల్లంతైన ఎన్.పావని (14) మృతదేహం శనివారం లభ్యమైంది. వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 116 గ్రామాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున లోతట్టు వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ డెల్టాలోని వరి, పసుపు, వేరుశనగ పంటలు ముంపుబారిప పడకుండా సాగునీటి కాల్వల్లో నీటి విడుదలను తగ్గించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ‘ఇంద్రనీలం’ తీవ్రత ఇదీ... * శుక్రవారం సాయంత్రం నుంచే గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీయటం మొదలయింది. అర్ధరాత్రి నుంచి గాలుల వేగం పెరుగుతూ పోతుంది. శనివారం ఉదయానికి ఈ గాలుల వేగం గంటకు 150 కిలోమీటర్లు దాటుతుంది. * తుపాను శనివారం సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల మధ్య చిలుకా సరస్సు దక్షిణ ప్రాంతాన్ని తాకుతుంది. చిలుకా సరస్సుకు దక్షిణంగా 20 కిలోమీటర్ల పరిధిలో తుపాను పెను విధ్వంసం సృష్టిస్తుంది. పారాదీప్‌లో తుపాను వాతావరణం కొన్ని గంటల పాటు కొనసాగుతుంది. * ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. * అతి తక్కువ సమయంలోనే 25 నుంచి 50 సెంటీమీటర్ల వరకూ వర్షపాతానికి అవకాశముంది. 48 గంటలపాటు ఉత్తరాంధ్రలో కుండపోతగా వర్షం కురుస్తుంది. వడగండ్ల వాన ఉంటుంది. * తుపాను తీరం దాటే సమయంలో తీరంలో గాలుల ఒత్తిడికి సముద్రం 3.3 మీటర్ల వరకూ ఉప్పొంగుతుంది. దీనివల్ల తీరంలోని కొన్ని ప్రాంతాలు నీట మనుగుతాయి. * విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. భారీ స్థాయిలో రోడ్లు కొట్టుకుపోతాయి. చెట్లు నేలకూలుతాయి. రైలు, రోడ్డు, రవాణా స్తంభిస్తుంది. * ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలోనూ భారీ వర్షాలు కురుస్తాయి. * తుపాను తీవ్రత ఆదివారం నాటికి క్రమంగా తగ్గుతుంది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది. -
ఫైలిన్ పొంచి ఉంది.. అప్రమత్తంగా ఉండండి: వైఎస్ జగన్
ఫైలిన్ తుఫాను నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తుఫాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు, అభిమానులను జగన్మోహన్ రెడ్డి కోరారు. ఫైలిన్ తుఫాను కాస్తా తీవ్ర పెను తుఫాను అని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. -
తీవ్ర పెను తుఫానుగా మారిన ఫైలిన్
ఫైలిన్ తుఫాను కాస్తా తీవ్ర పెను తుఫాను అని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య కళింగపట్నం- పారాదీప్ ప్రాంతాల నడుమ రేపు సాయంత్రానికల్లా తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఫైలిన్ వేగం గంటకు సుమారు 205-215 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే అత్యంత భారీ వర్షపాతం కురుస్తుంది. రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర కోస్తాలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో గాలుల వేగం 210-220 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో అలలు మూడు మీటర్ల పైబడి ఎత్తుకు ఎగసే అవకాశం ఉంది. తీరప్రాంతంలోని ఇళ్లకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్తు, కమ్యూనికేషన్ల వ్యవస్థకు భారీ నష్టం కలగొచ్చు. రోడ్డు, రైలు మార్గాలకు కూడా తీవ్ర ఆటంకం వాటిల్లే అవకాశం ఉంది. పంటలు తీవ్రంగా నష్టపోవచ్చు. ప్రభుత్వం సచివాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటుచేసింది. దాంతోపాటు తీరప్రాంతాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో, డివిజన్, మండల కేంద్రాల్లో ఫోన్, మొబైల్, వైర్లెస్, హ్యామ్ రేడియో సెట్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెంబర్లను ప్రచారం చేశారు. విపత్తు నివారణ కేంద్రాలను అప్రమత్తం చేశారు. రాష్ట్రస్థాయిలో తొమ్మిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. శ్రీకాకుళం- జి.వెంకట్రామిరెడ్డి, విజయనగరం- రజత్ కుమార్, విశాఖపట్నం- హర్‌ప్రీత్ సింగ్, తూర్పుగోదావరి - ముద్దాడ రవిచంద్ర, పశ్చిమగోదావరి - సంజయ్ జాజు, కృష్ణా- కె.ప్రవీణ్ కుమార్, గుంటూరు - బి.వెంకటేశం, ప్రకాశం - ఆర్. కరికాల వల్లవన్, నెల్లూరు- బి.రాజశేఖర్ ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని తెలిపారు. తీరంలో ఉన్నవాళ్లు సముద్రంలోకి వెళ్లొద్దన్నారు. చేపల వేటను పూర్తిగా నిలిపివేశారు. పౌరసరఫరాల కేంద్రాల వద్ద ఇప్పటికే బియ్యం, కిరోసిన్, తాగునీరు... ఇలాంటివాటిని నిల్వచేసి ఉంచారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విశాఖలో 40వేల మంది, శ్రీకాకుళంలో 20 వేల మంది, విజయనగరంలో 4వేలమందిని ఇలా తరలించారు. వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ఈ వారంలో ప్రసవాలు కావచ్చని భావిస్తున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. విశాఖపట్నంలోని తూర్పు నేవల్ కమాండ్, ఆర్మీ వర్గాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా వెంటనే వెళ్లేందుకు వీలుగా హెలికాప్టర్లు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. నాలుగు కాలమ్‌ల ఆర్మీని విశాఖకు తరలించారు. -
నేడు పశ్చిమకు జాతీయ విపత్తు నివారణ బృందం
ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీరం వెంబడి 9 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని అలాగే తీర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లు, చెరువు గట్లను ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దొంగరావిపాలెం, సిద్ధాంతంఏటిగట్టు, రాజుల్లంక, నక్కలడ్రైన్, నందమూరు అక్విడెట్టు, కడెమ్మ సూయీజ్లను.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నేడు జిల్లాకు జాతీయ విపత్తు నివారణ బృందం వస్తుందని వెల్లడించారు. ఏలూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్ 08812 230617ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరిక
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తీరం వెంబడి 13 మండలాల్లో అధికారులు ముందస్తుగా సహయక చర్యలు చేపట్టారు. కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దాంతో సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులను జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫైలిన్ తుపాన్ వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 08856 233100కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. -
ఫైలిన్ తుపాన్ కంట్రోలు రూం నెంబర్లు
విశాఖ : ఫైలిన్ తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారానికి తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. దాంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు. టోల్ ఫ్రీ నం. 08812 230617 తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. టోల్ ఫ్రీ నంబర్లు- 08856 2 33100 గుంటూరు జిల్లా తెనాలి కంట్రోల్ రూమ్ నెంబరు- 08644 223800 నెల్లూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు....నంబర్లు: 1800 425 2499, 08612 331477 శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు .....టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191 ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు... టోల్ ఫ్రీ నంబర్లు: 08592 281400