తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తీరం వెంబడి 13 మండలాల్లో అధికారులు ముందస్తుగా సహయక చర్యలు చేపట్టారు. కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దాంతో సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులను జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.
అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫైలిన్ తుపాన్ వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 08856 233100కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.