
ఫైలిన్ పొంచి ఉంది.. అప్రమత్తంగా ఉండండి: వైఎస్ జగన్
ఫైలిన్ తుఫాను నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తుఫాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు, అభిమానులను జగన్మోహన్ రెడ్డి కోరారు.
ఫైలిన్ తుఫాను కాస్తా తీవ్ర పెను తుఫాను అని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరారు.