యూవీ భాస్కరరావు, విశాఖపట్నం సాక్షి విలేకరి
పై-లీన్ తుఫాను చాలా విభిన్నమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా చాలా తుఫాన్లు వచ్చి వెళ్లినా, వాటన్నింటి కంటే దీని ప్రవర్తన చాలా తేడాగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పై-లీన్ తుఫాను కడపటి వార్తలు అందేసరికి తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. అంటే ఇది అత్యంత వేగంగా పయనిస్తున్నట్లు లెక్క. ఇప్పటికే రాష్ట్రంలో్ని 8 ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. రెండు చోట్ల సెక్షన్ ౩ హెచ్చరికలు కూడా జారీచేశారు.
అయితే, ఇంత వేగంగా తుఫాను దూసుకొస్తున్నా, ఇప్పటివరకు వాతావరణంలో మాత్రం మరీ చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదు. గాలులు వేగంగా వీయట్లేదు, అలలు మరీ ఎక్కువ ఎత్తుకు ఎగసిపడటంలేదు. అందువల్ల అసలీ తుఫాను ప్రభావం ఎప్పుడు, ఏ నిమిషంలో ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నట్లు నిపుణులు అంటున్నారు. అర నిమిషంలోనే ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చి, పెనుముప్పునకు కారణం కావచ్చని చెబుతున్నారు. లేదా.. అసలు ఎలాంటి నష్టం కలగజేయకుండా కూడా తీరాన్ని దాటే అవకాశం లేకపోలేదన్నది వాతావరణ నిపుణుల అభిప్రాయం. కేవలం ఈసారి మాత్రమే ఇలా అవుతోంది. ఇంతకుముందు వచ్చిన 73 తుఫాన్లలో ఏ ఒక్కటీ ఇలా ప్రవర్తించలేదని తెలుస్తోంది.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477