పై-లీన్ తుఫాను బీభత్సానికి ఒడిషా వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోవడం దుర్లభంగా మారింది. తప్పిపోయినవారి వద్ద మొబైల్ ఫోన్లున్నా, వాటిలో బ్యాలెన్స్ అయిపోవడం, రీచార్జి చేయించుకునే దిక్కు లేకపోవడంతో చాలామంది ఆచూకీ తెలియట్లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ముందుకొచ్చింది. ఒడిషాలో ఈనెల 20వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రోజుకు పది నిమిషాల చొప్పున ఉచిత రీఛార్జి అవకాశం కల్పించింది. సీడీఎంఏ, జీఎస్ఎం రెండు రకాల వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది.
ఒడిషాలోని చాలా ప్రాంతాల్లో తుపాను దెబ్బకు విద్యుత్ సరఫరా దారుణంగా దెబ్బతినడంతో బ్యాటరీ సాయంతో ఫోన్లను చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా తమ కంపెనీ స్టోర్స్ వద్ద, ప్రధాన మార్కెట్ల వద్ద కల్పించింది. ఇందుకోసం పెద్ద పెద్ద బ్యాటరీలను ఏర్పాటుచేసి, వాటిద్వారా చార్జింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది.
ఒడిషాలో తుఫాను బాధితులకు రిలయన్స్ ఉచిత టాక్టైం
Published Wed, Oct 23 2013 1:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement