ఫై-లీన్ తుపాన్ బాధితులకు భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల్లో దాదాపు పది లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తప్పించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించిందని పేర్కొంది. లక్షలాదిమంది ప్రజలను తరలించడం చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం ముందుగా అప్రమత్తమై ప్రమాద తీవ్రతను గుర్తించి తగు చర్యలు చేపట్టిందని ప్రపంచ బ్యాంక్ కితాబిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నాలుగు రోజుల పాట నిరంతరం శ్రమించి పునరావాసం కల్పించదని తెలిపింది. ఫై-లీన్ ధాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల ప్రజలు భయకంపితులైన సంగతి తెలిసిందే. ఒడిశాను వరదలు ముంచెత్తడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది.