రూ.20 వేల నుంచి రూ.40 వేలుంటే దిగువ మధ్య తరగతి
రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం ఉంటే మధ్య తరగతి
రూ.లక్ష పైబడితే ఎగువ మధ్య తరగతి
వరల్డ్ బ్యాంక్ వెల్లడి
నిరు పేదలు, మధ్య తరగతి ప్రజలు అంటే ఎవరు? నెలవారీ ఆదాయం ఎంతుంటే మధ్య తరగతి? మధ్య తరగతిలో ఎన్ని వర్గాలు? నిరు పేదల ఆదాయమెంత? వీటిపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచి్చంది. ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలను అధ్యయనం చేసే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)తో కలిసి ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాల స్థిరమైన ఆర్థిక వృద్దిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు ఓఈసీడీ 37 దేశాలతో కలిసి పనిచేస్తోంది.
ప్రపంచ బ్యాంకు, ఓఈసీడీ కలిసి ప్రజల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశాయి. మారుతున్న సామాజిక, ఆరి్థక స్థితిగతులను అనుసరించి జరిపిన ఈ అధ్యయనం నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే మెరుగుపడుతున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పెరిగినట్టు ప్రకటించింది.
ఈ అధ్యయనంలో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజల ఆరి్థక స్థితిగతులపై లోతైన పరిశీలన జరిపింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు వర్గాలుగా విభజించింది. ఇక నుంచి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష లోపు ఆదాయం ఆర్జించే వారిని మధ్య తరగతిగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రూ.లక్ష కు పైబడి ఆదాయం ఆర్జించే వారిని ఎగువ మధ్యతరగతి వర్గీయులుగా పరిగణించాలని పేర్కొంది. రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఆర్జించే వారిని దిగువ మధ్య తరగతిగా గుర్తించాలని ప్రకటించింది.
ఇక రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న వారిని నిరుపేద వర్గానికి చెందిన వారిగా పరిగణించాలని పేర్కొంది. గతంలోకంటే మెరుగైన ఆర్థి క పరిస్థితిగతంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఉన్న వారిని మధ్య తరగతిగా, రూ.40 వేల నుంచి రూ.60 వేల లోపు ఉన్న వారిని ఎగువ మధ్యతరగతిగా, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న వారిని దిగువ మధ్యతరగతిగా పరిగణించేవారు.
రూ.10 వేలకు తక్కువగా ఆర్జించే వారిని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలుగా గుర్తించే వారు. ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనం ప్రకారం అల్పాదాయ, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే కొంత మెరుగు పడినట్టు తేలింది.
జాతీయ తలసరి ఆదాయాన్ని బట్టి అంచనా..
జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 75 శాతం నుంచి 200 శాతం ఆదాయం ఆర్జిస్తున్న వారిని మధ్య తరగతి ప్రజలుగా, 200 శాతం కంటే ఎక్కువ ఆర్జించే వారిని ఉన్నత వర్గాలుగా, 75% కంటే తక్కువ ఆదాయం ఆర్జించే వారిని అల్పాదాయ వర్గాలుగా ప్రపంచ బ్యాంకు విభజించింది.
75 శాతం నుంచి 50 శాతం ఆదాయం పొందే వారిని నిరుపేదలే అయినప్పటికీ, తక్కువ ఆదాయం (నాన్–పూర్ లోయర్ ఇన్‌కమ్) ఆర్జించే వర్గాలుగా పేర్కొంది. 50 శాతంకంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా అభివర్ణించాలని పేర్కొంది.
అదే విధంగా స్థూల జాతీయ ఆదాయం సగటున రూ.97,192 (1145 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను తక్కువ ఆదాయ దేశాలుగా, రూ.3,82,917 (1146–4515 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను దిగువ మధ్య ఆదాయ దేశాలుగా, రూ.11,87,764 (4516–14వేల డాలర్లు) ఆర్జించే దేశాలను ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా అభివరి్ణంచింది. భారత దేశం దిగువ మధ్య ఆదాయ ఆర్జన కలిగిన దేశాల జాబితాలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment