పై-లీన్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని చూసిన బాలీవుడ్ ప్రముఖులు చలించిపోయారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ సందేశాలు పంపారు. గడిచిన 14 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించిన పై-లీన్ తుఫాను కారణంగా ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరు ఏమన్నారంటే..
అమితాబ్ బచ్చన్: దేవుడి ఆగ్రహం పై-లీన్ తుఫాను రూపంలో కనిపించింది!! అందరూ జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కలవారినీ రక్షించాలి. అందరి కోసం ప్రార్థించండి!
T 1186 -The fury of the God's in cyclone #Phailin !! Be careful, beware and be protected .. and be in prayer !!
— Amitabh Bachchan (@SrBachchan) October 12, 2013
మాధురీ దీక్షిత్: పై-లీన్ తుఫాను వల్ల ప్రభావితమైనవారందరి కోసం నేను ప్రార్థిస్తాను. వారు ఈ కష్టాన్ని అధిగమించేందుకు దేవుడు వారికి తగినంత మనోధైర్యాన్ని ఇవ్వాలి.
My prayers go out to all the people affected by Cyclone Phailin. May God give them strength to overcome this ordeal.
— Madhuri Dixit-Nene (@MadhuriDixit) October 13, 2013
అక్షయ్ కుమార్: ప్రకృతి ప్రకోపానికి బలైనవారందరికీ నా ప్రార్థనలు తోడుంటాయి. ఒడిశాలో ప్రశాంతత నెలకొనాలని ఆశిస్తున్నా. ఈ సమయంలో మనమంతా చేయగలిగినది ఇది మాత్రమే.
బొమ్మన్ ఇరానీ: ఈసారి మనం ప్రతిసారి కన్నా బాగా ఎక్కువ సంసిద్ధులయ్యాం. దాన్ని ప్రకృతి కూడా గౌరవించింది. అనుకున్నదానికంటే దాని క్రూరత్వం కూడా కాస్త తక్కువగా ఉంది.
Seems we were more prepared than usual. Even nature seems to respect that and in turn has been less brutal than expected.
— boman irani (@bomanirani) October 13, 2013
మీరా నాయర్: ఊపిరి బిగబట్టి తుఫాను బీభత్సాన్ని చూస్తున్నా. నా జన్మభూమి ఒడిశా వాసులకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ప్రకృతి విలయతాండవాన్ని మనం అధిగమించాలి.<
Holding my breath about #Phailin, prayers and courage for the people of my birthplace in #Odisha. May nature's fury be contained
— Mira Nair (@MiraPagliNair) October 12, 2013
/p>