వాషింగ్టన్: పై-లీన్ తుపాను సమయంలో వేగంగా స్పందించి.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత అధికారులపై అమెరికా ప్రశంసలు కురిపించింది. తీర ప్రాంతాల నుంచి ముందుగానే భారీగా ప్రజలను తరలించడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని చెప్పింది. పై-లీన్ తుపాను ప్రభావానికి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 10 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పై-లీన్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు తమ సానుభూతి తెలియజేస్తున్నామని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ చెప్పారు.