పైలిన్ తుపాన్ దూసుకోస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోస్తా తీరంలోని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అందులోభాగంగా కోస్తా తీరం వెంబడి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే అయా జిల్లాలోని కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు: 08942 240557, 96528 38191
తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ కలెక్టరేట్లో తుపాన్ కంట్రోల్ రూమ్ నెంబర్ల నంబర్లు: 0884-2365506,0884-1077
అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100
జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093
పశ్చిమగోదావరి జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 08812 230617
గుంటూరు జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 08644 223800, తెనాలి కంట్రోల్ రూమ్ నెంబరు 08644 223800
నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం నెంబర్లు 1800 425 2499, 08612 331477