ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సైన్యం: ఏకే ఆంటోనీ
న్యూఢిల్లీ: పై-లిన్ తుఫాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. తుఫాన్ తీవ్రరూపం దాల్చడంతో ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం దాటే సమయంలో తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ దీనిపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక దళాలను కోరారు.
ఐఏఎఫ్కు చెందిన ఐఎల్-76 రెండు విమానాలు ఇప్పటికే తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విపత్తు నివారణ బృందాలను, సహాయక సామాగ్రిని భువనేశ్వర్కు తరలించాయి. రెండు సీ 130జే విమానాలు, 18 హెలికాప్టర్లు, రెండు ఏఎన్-32 ఎయిర్క్రాప్ట్లు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచారు. పై-లిన్ తుఫాన్ రేపు తీరందాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది.
శ్రీకాకుళం: 08942 240557, 9652838191
గుంటూరు : 08644 - 223800
తూర్పుగోదావరి: 08856 - 233100
పశ్చిమగోదావరి: 08812 230617
నెల్లూరు: 1800 425 2499, 08612 331477