వజ్రపుకొత్తూరు/పూండి/కవిటి/టెక్కలి, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాం తాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు పర్యటించారు. తుపాను వల్ల వాటిల్లిన నష్టాన్ని పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తుపాను బాధితులకు ఆహార పొట్లాలు, దుప్ప ట్లు పంపిణీ చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని వజ్రపుకొత్తూరు, శారదాపురం, కిడిసింగి తదితర ప్రాంతాల్లో వాటిల్లిన నష్టాన్ని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం పరిశీలించారు. తుపాను వల్ల నష్టపోయిన జీడిమామిడి, కొబ్బరి, వరి రైతులతో పాటు మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వజ్రపుకొత్తూరు మండలంలో తుఫాన్ బాధితులకు వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు అల్పాహారం అందించారు.
హుకుంపేట, మంచినీళ్ళపేట గ్రామాల్లో 600 మందికి రొట్టెలు, పాలు, పండ్లు అందజేశారు. నువ్వలరేవు గ్రామస్తులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందజేశారు. అనంతరం పల్లిసారథి గ్రామంలో టేకు చెట్టు పడి ఇల్లు ధ్వంసమైన పోతనపల్లి అప్పలస్వామిని పరామర్శించారు. పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ టి.సురేష్‌రెడ్డి ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పార్టీ నేతలు డబ్బీరు భవానీశంకర్, బల్ల గిరిబాబు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్, విజయలక్ష్మి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఇద్దివానిపాలెంలో ఉద్దానం ఫౌండేషన్ ద్వారా మత్స్యకారులకు దుప్పట్లను పంపణీ చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాంప్రసాద్ పాల్గొన్నారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లోని తుపాను ప్రభావిత గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పర్యటించి పరామర్శించారు. నియోజకవర్గంలో వాటిల్లిన నష్టంపై పార్టీ తరపున నివేదిక రూపొందించి జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తుపాను బాధితులకు వైఎస్సార్‌సీపీ చేయూత
Published Mon, Oct 14 2013 3:25 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement