ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులు సమావేశమయ్యారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులు సమావేశమయ్యారు. పై-లీన్ తుఫాన్ ప్రభావంపై సమీక్ష జరుపుతున్నారు. తుఫాన్ సహాయక చర్యల గురించి తెలుసుకుంటున్నారు.
మరోవైపు రాష్ట్ర రెవెన్యు మంత్రి రఘువీరా రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పై-లీన్ తుపాన్ కారణంగా తలెత్తిన పరిస్థితిని ఆయన అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావం వల్ల వేటకు వెళ్లని మత్స్యకారులను ఆదుకోవాలని సీఎంను ఆయన కోరారు. 74వేల మత్స్యకార కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉత్తరకోస్తాకు ఇంకా తుఫాను ముప్పు తొలగిపోలేదన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమయింది.వచ్చే12 గంటల్లో ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.