పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది | Congress party no wrong step on state bifurcation, says Raghuveera reddy | Sakshi
Sakshi News home page

పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది

Published Fri, Mar 7 2014 1:08 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది - Sakshi

పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సహా కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా పిరికిపందలని మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ను ద్రోహిగా చిత్రీకరించడం కిరణ్కు తగదన్నారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదని తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఆ పార్టీ సాకారం చేసిందని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ కూడా కారణమేనని ఆరోపించారు.

 

సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలతో చర్చించిన తర్వాతే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి హితవు పలికారు. విభజన నేపథ్యంలో ఎగిసిన తెలంగాణ, సమైక్య ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి రఘువీరా రెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement