గుంతకల్లు: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బీసీలకు శాపంగా పరిణమించిన జీవో నం-101ను విడుదల చేస్తే ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి బీసీ అయి కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ప్రశ్నించారు. స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో ప్రజాగ్ర హంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిందన్నారు. చచ్చిన శవానికి ఎంత వైద్యం చేసినా ఫలితం ఉండదన్నారు. రఘువీరారెడ్డి కోటి సంతకాలు సేకరణతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని చూస్తుండటం వట్టి భ్రమే అన్నారు.
ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ ఉన్నపుడు బీసీలకు శాపంగా మారిన జీవో 101ను అడ్డుకోకపోవడం సిగ్గు చేటన్నారు. బీసీలపై మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 101 జీవోను రద్దు చేయించడంతోపాటు రిజర్వేషన్ బిల్లు 33/3 శాతం విద్య, ఉద్యోగం, ప్రమోషన్, రాజకీయంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై పోరాడాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాల్మీకి, బెస్త, వడ్డెర కులాలను ఎస్టీల్లో కలిపే విధంగా, బీసీ సబ్‌ప్లాన్‌కు ఆమోదం లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
జీవో 101ను ఎందుకు అడ్డుకోలేదు
Published Fri, Feb 20 2015 3:02 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement