ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ కుమార్ గురువారం ఉదయం వెల్లడించారు. తీర ప్రాంతంలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
తమ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏదురైన వెంటనే 08592 281400కు ఫోన్ చేయాలని ఆయన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.