ముందుగానే తీరం దాటనున్న ఫైలిన్
విశాఖ : పై-లిన్ తుపాను అనుకున్న సమయం కన్నా ముందుగానే తీరం దాటనుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8గంటల మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 3.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసి పడనున్నాయి. అలాగే తీర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలపాటు తుపాను ప్రభావం చూపనుంది.
తీరం దాటాక తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఒడిశా, కోస్తాంధ్రలో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఒక్క గోపాల్ పూర్లోనే లక్షమందిని తరలించారు. మరోవైపు పారాదీప్ పోర్టులో కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. సీ-17 విమానంలో అత్యవసర సామాగ్రిని తరలించారు.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477