తుఫాను తీవ్రతపై అప్రమత్తంగా ఉన్నాం: రఘువీరారెడ్డి
పై-లీన్ తుఫాను తీవ్రతపై తాము అప్రమత్తంగా ఉన్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోతే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న విశాఖపట్నానికి ఆయన ఉదయమే చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయని, సముద్రంలో చిక్కుకుపోయిన 40 మంది మత్స్యకారులు పారాదీప్‌లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
విశాఖ తీరంలో 40బోట్లు దెబ్బతినగా, 3 ఇళ్లు కూలిపోయాయని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు.
కంట్రోల్ రూం నెంబర్లు
శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191
విశాఖపట్టణం: 1800425002
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
గుంటూరు : 08632345103/08632234990
నెల్లూరు: 08612331477