పై-లిన్‌పై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భువనేశ్వర్ : బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపానుపై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 54 అడుగులకు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడి తీరంపై విరుచుకుపడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.
కాగా పై-లిన్ తుపాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విశాఖ చేరుకున్నారు. తుపాను ప్రభావ నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్షించనున్నారు.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477