ఫైలిన్ తుపాన్ ప్రభావానికి కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మచిలీపట్నంలో 40 అడుగులు ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
]దీంతో తీర ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లాలో వేటకు వెళ్లిన 16 సోనా బోట్లు తిరిగి రావాల్సివుంది. సాయంత్రానికి తీరం చేరుకోవచ్చని భావిస్తున్నారు.
కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్ల నెంబర్లు..
శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191
విశాఖపట్టణం: 1800425002
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
గుంటూరు : 08632345103/08632234990
నెల్లూరు: 08612331477