మా గతేంకాను? | what we have to do ? | Sakshi
Sakshi News home page

మా గతేంకాను?

Published Wed, Nov 20 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

what we have to do ?

అయ్యో... గిదెక్కడి పాపం. కోతకొచ్చిన పంటలన్నీ తుపాను నీళ్లలో కొట్టుకుపోతే మంచిగున్నాయంటున్నారా... బాయికాడికి వచ్చిన అధికారులు వానకు
 నేలకొరిగిన పంటలను కళ్లారా చూశారు కదా. నాకున్న  మూడెకరాల్లో వరి,
 రెండెకరాల్లో పత్తి సాగు చేసిన. వరి పంట మొత్తం నీళ్లలో వంగిపోయింది. కాయలు పగిలి పత్తి నల్లబడింది. వరదలో తడిసిన వరిని కోయగా... 16 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. అందులో 12 బస్తాలు తాలు ధాన్యమే... రెండెకరాల పత్తి మొత్తం ఏరితే ఒక్క క్వింటా దిగుబడి వచ్చింది.పెట్టుబడి ఖర్చులు 80 వేలయితే..  8 వేల విలువైన దిగుబడి కూడా రాలే. ఇది నట్టం కాదా ? మరి  గట్టెట్ల రాసిండ్రు. అంతా అయిపోయింది... ఇక మాకు దిక్కెవరు? మళ్ల ఫిర్యాదు చేస్తే రీ సర్వే చేత్తరట... ఇప్పుడేమైనా నీళ్లుంటయూ... రైతులంటే పతొక్కరికీ నవ్వులాటే.. ఇప్పుడచ్చి ఏం సూత్తరు... ఏం సేత్తరు...
 
 
 ...ఇదీ బచ్చన్నపేట మండలం రామచంద్రాపురానికి చెందిన అమనగంటి చంద్రమౌళి ఆవేదన... ఆక్రోశం. అతనే కాదు... ఆ ఊళ్లో ఏ రైతును పలకరించినా నెత్తీనోరు బాదుకుంటున్నాడు. అధికారుల నష్టం నివేదిక జాబితాలో ఆ గ్రామం పేరు లేకపోడమే ఇందుకు కారణం. ఇలా ఆ ఒక్క ఊరే కాదు... జిల్లావ్యాప్తంగా 350కి పైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఆయూ ప్రాంతాల్లో నష్టం జరగలేదా అంటే... పై-లీన్ పంజాతో నేలకొరిగిన, నీట మునిగిన, దెబ్బతిన్న పంటల దృశ్యాలే నిజమని సమాధానం చెబుతాయి. మరి తప్పు ఎక్కడ జరిగింది... అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా పంటనష్టం లేదని జాబితా రూపొందించిన అధికారులదా... 50 శాతానికి పైగా పంట దెబ్బతింటేనే నష్టపరిహారం వర్తిస్తుందని నిబంధనలు విధించిన ప్రభుత్వానిదా...హాస్యాస్పదమే...
 పంట నష్టం జరిగినా.. జాబితాలో పేరు లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే రీ సర్వే చేస్తామని చెబుతుండడం అధికారులను నవ్వులపాల జేస్తోంది.
 
  పై-లీన్ తుపాన్ ప్రభావం ముగిసింది. వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన వరి ఇప్పటికే కోతకు రాగా... నల్లబడిన పత్తిని రైతులు ఖర్చుల నిమిత్తం విక్రయించారు. మిగిలిన పంటలనైనా దక్కించుకుందామనే ఉద్దేశంతో నీటిని ఎత్తిపోశారు. తడిసిన పత్తి, మక్కలను ఎండబెట్టారు... ఎంతో కొంతకు అమ్ముకున్నారు. ఇప్పుడు దాదాపు మొదటి దశ పంట పూర్తిగా నాశనం కాగా... రెండో దశ పంటలో భాగంగా పత్తి మళ్లీ కాతకు వచ్చింది. ఈ సమయంలో రీ సర్వే కోసం పంటల వద్దకు వెళ్లితే ఏముటంటుంది... అక్కడ ఏమైనా నష్టం జరిగినట్లు కనిపిస్తుందా... ఏమో మరి.. రైతులన్నట్లు అధికారులే సమాధానం చెప్పాలి.
 
 అన్యాయం చేస్తే మట్టికొట్టుకుపోతరు...
 వాన ఎలువగానే సార్లు బాయికాడికి వచ్చిరి కదా. ఆగకుండా పడ్డ వానతో ఇరిగిపోయిన మక్క, కుళ్లిపోయిన వరి, పత్తి పంటలను సూపించా కదా. నేను సెప్పిందల్లా రాసుకుని పోయిండ్రు. ఎకరా పత్తిలో బత్తా కూడా దిగుబడి వచ్చేలా లేదు. ఇప్పుడు నట్టం జాబితాలో మా ఊరు పేరే లేదు. మా ఊళ్ల పంట నట్టం జరగలేదా... మాకు అన్యాయం చేస్తే మట్టికొట్టుకుపోతరు. వేలకువేలు పోసి పంటలు సాగుచేసినం. వానదేవుడు కోపగించి చేతికొచ్చే పంటలను తీసుకుపోతే ఆదుకోరా..?
 - పిట్టల సత్తయ్య, రైతు, ఇటికాలపల్లి
 
 ఇప్పుడు సర్వే చేస్తే ఏముంటది ?
 తుపానుతో వరిగింజలు, పత్తి, మక్క కంకులు తడిసిపోయి మొలకొచ్చినయి... అప్పులు తెచ్చి సాగుచేసినం అంటూ సర్వేకొచ్చినప్పుడు సార్లకు పంటలను చూపిస్తూ ఏడిసినం. అంతా పోయింది.. ఆదుకోం డి సారూ అంటూ రెండు చేతులెత్తి వేడుకున్న. అయినా వారి మనుసు కరగలే. రైతుల నో ట్లో మట్టికొట్టే సర్వేలు చేస్తున్నరు. అప్పుడేమో అంతా ఎత్తిపోసిన తర్వాత వచ్చిండ్రు... నట్టమేం లేదని రాసిండ్రు. ఇప్పుడు సర్వే చేసినా ఒరిగేదేముండదు.
 - ఉమ్మెత్తుల చంద్రారెడ్డి, ఇటికాలపల్లి, బచ్చన్నపేట
 
 ఇవి సాక్ష్యాలు కావా ?
 పంటల నష్టం అంచనాల్లో ఊళ్లకు ఊళ్లనే కొట్టేశారు. బచ్చన్నపేట మండలంలో 21 గ్రామపంచాయతీలు, 10 శివారు గ్రా మాలున్నాయి. ఇందులో ఎనిమిది గ్రామాలు పంట నష్టం జాబితాలో లేకుండా పోయూరుు. పై-లీన్ ధాటికి దబ్బగుం టపల్లి, గంగాపురం, ఇటికాలపల్లి, ల క్ష్మాపురం, లింగంపల్లి, కొన్నె, నాగిరెడ్డిపల్లి, రామచంద్రాపురంలో పత్తి, మక్క, వరి పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తేల్చేయడంతో అక్కడి రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా ఒక్క బచ్చన్నపేట మండలమే కాదు... జిల్లావ్యాప్తంగా 350కి పైగా గ్రామాల్లోని రైతులు గుండెలు బాదుకుంటున్నా రు. మరి ఆయూ ప్రాంతాల్లో వాస్తవంగా పంట లు దిబ్బతినలేదా అంటే... ఇక్కడి ఫొటోలే నిదర్శనంగా నిలుస్తున్నారుు. చాలా మేరకు పంటలు నీటిలో కొట్టుకుపోరుునట్లు.. దెబ్బతిన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement