
'ఫైలిన్.. తీవ్ర తుపాన్ గా మారే అవకాశం'
విశాఖపట్నం: పడగెత్తిన పెను తుపాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రం గజగజా వణికొపోతుంది. సాగర కెరటాల మాటు నుంచి తుపాను రూపంలో ప్రమాదం ఉందని అధికారులు తెలపడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఫైలిన్ తుఫాన్.. తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని శనివారం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ తీవ్ర తుఫాన్ గా మారితే మాత్రం 150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాను హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్ లను ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ముంచుకొచ్చే ముప్పుకు ముందస్తు సంకేతంగా గురువారం అక్కడక్కడా కురిసిన కుండపోత వర్షాలతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపున వివిధ నదులు పొంగిపొర్లుతూ ఉండడంతో పంటలను ముంపు భయం వెంటాడుతోంది.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477