నడవని రైళ్లు | trains are stopped due to phailin cyclone | Sakshi
Sakshi News home page

నడవని రైళ్లు

Published Mon, Oct 14 2013 3:23 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

trains are stopped due to phailin cyclone

 ఆమదాలవలస, న్యూస్‌లైన్:
  పై-లీన్ ప్రభావంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయూరుు. దసరా పండగకు స్వగ్రామాలకు చేరుకోవాలనుకునే దూరప్రాంత ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రరుుంచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. తూర్పుకోస్తా రైల్వే (భువనేశ్వర్), దక్షిణ మధ్యరైల్వే (సికింద్రాబాద్), దక్షణ తూర్పు రైల్వే(కోల్‌కత్తా) డివిజన్‌ల పరిధిలోని రైళ్లను ఆదివారం కూడా రద్దు చేశారు. దీంతో రైల్వే ఆదాయూనికి భారీ గండి పడింది. పలాస-విశాఖపట్నంల మధ్య పాసింజర్ సర్వీసులను, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(18411/18412)లను రెండు రోజుల కిందటే నిలిపివేశారు. కొన్ని గూడ్స్‌రైళ్లు శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లోనే నిలుపుదల చేశారు.
 
  యశ్వంత్‌పూర్, ప్రశాంతి, చెన్నై మెయిల్, విశాఖ ఎక్స్‌ప్రెస్, కోణార్క్, ఫలక్‌నామా, ఈస్ట్‌కోస్ట్ వంటి రైళ్లన్నీ రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ముందు చేయించుకున్న రిజర్వేషన్‌లను రద్దు చేసుకోవడంతో రైల్వే శాఖకు భారీ నష్టం వాటిల్లింది. టిక్కెట్ చార్జీలను తిరిగి చెల్లించారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో రైల్వే ఉన్నతాధికారులు లైన్‌లను పరిశీలిస్తున్నారు. సిబ్బందితో పాడైన లైన్‌ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. ఒడిశాలోని రైల్వేలైన్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, వాటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున సోమవారం నాటికి రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. వాల్తేరు నుంచి వచ్చిన రైల్వే ఉన్నతాధికారుల బృందం ైరైల్వే లైన్‌ల పనులను పరిశీలిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement