
శ్రీకాకుళం జిల్లా బెండి వద్ద తీరం దాటిన తుపాను
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం బెండి వద్ద పై-లీన్ తుపాను తీరం దాటింది. ఆరుగంటలపాటు తుపాను తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్కలి, సంతబొమ్మాళి మండలాలు అంథకారంలో ఉన్నాయి. కళింగపట్నంలో కూడా భారీ వర్షం కురుస్తోంది.
గోపాల్‌పూర్ వద్ద తుపాను తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావంతో 6 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
గోపాల్‌పూర్ వద్ద, బెండి వద్ద గంటకు 220 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.