ఫై-లిన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తుపాన్ వాయుగుండంగా మారి బీహార్కు మళ్లినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
ఫై-లిన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తుపాన్ వాయుగుండంగా మారి బీహార్కు మళ్లినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు పై-లిన్ తుపాను ధాటికి పెను నష్టం వాటిల్లింది. ఒడిశాలో గంజాం, మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కకావికలం అయ్యింది. లక్షల ఎకరాల్లో పంటలు, తోటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్, టెలికం వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. సహాయక శిబిరాల్లో దాదాపు 9లక్షల మంది తలదాచుకుంటున్నారు. శ్రీకాకుళంలో రూ.1000 కోట్ల మేర పంటనష్టం వాటిల్లింది. సహాయ శిబిరాల్లో ఇంకా లక్షమంది ఉన్నారు. తుపాను వల్ల ఒడిశాలో 21మంది, మన రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు.