రాగల 36 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే 36 గంటల్లో తీరం వెంబడి 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం,భీముని పట్నం ఓడరేవుల్లో10వ నెంబర్, విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 8వ నెంబర్, మచిలిపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో 3వ ప్రమాద నెంబర్ హెచ్చరికాలు కొనసాగుతున్నాయి.