సాక్షి, నరసరావుపేట
జిల్లాలో వరి, మిర్చి, పత్తి, అక్కడక్కడా వేరుశనగ, పసుపు, కంది, పొగాకు వంటి పంటలను పండించడం రైతులకు అలవాటుగా ఉంది. అయితే ప్రధాన పంటలకు ప్రభుత్వ సబ్సిడీలు రాకపోవడంతో మండలాల్లో అధిక శాతంలో వేసిన వరి, మిర్చి, పత్తి పంటల్లో కొంత విస్తీర్ణాన్ని తగ్గించి జొన్న, జూట్, సజ్జ, పెసర, మినుము, నువ్వులు, సోయాబీన్, ఆముదం మొదలగు పంటలు వేసినట్లుగా లెక్కలు తయారు చేసి పంపడం వ్యవసాయాధికారులకు పరిపాటిగా మారి ం ది. ఈ పంటలకు విత్తనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి ప్రభుత్వం అధిక శాతం సబ్సిడీ ఇస్తుండటంతో వీ టి ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతో రైతులు ఈ పం టలను అధికంగా సాగు చేసినట్లుగా లెక్కలు తయారు చేసి అధికారులకు పంపుతున్నారు. అయితే వ్యవసాయాధికారులు పంపుతున్న తప్పుడు లెక్కలు కొన్ని సందర్భాల్లో రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి.
అదెలాగంటే.. గతంలో నీలం తుపాను, ఇటీవల పై-లీన్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అధిక శాతం పత్తి, మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అయితే అధికారులు కొన్ని మండలాల్లో వీటి సాగును తగ్గించి పంపివుండడంతో, దెబ్బతిన్న పంటల విస్తీర్ణాన్ని కూడా తక్కువ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో దెబ్బతిన్న పంటలను పరిహార జాబితాలోకి చేర్చకపోవడంతో బాధిత రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులు పదెకరాల్లో వరి, మిర్చి, పత్తి సాగు చేసి పూర్తిగా నష్టపోయినప్పటికీ లెక్కలను సరి చేయాలనే ఉద్దేశంతో 50 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలను మాత్రమే జాబితాలో చేర్చాలనే ప్రభుత్వ నిబంధన సాకుగా చూపుతూ రెండు మూడెకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని లెక్కలురాసి చేతులు దులుపుకుంటున్నారు. వ్యవసాయాధికారులు ప్రధాన పంటల విస్తీర్ణాన్ని తగ్గించి ఇతర పంటల సాగును అధికంగా చూపడం ప్రస్తుత విపత్తు సమయంలో రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అంశంగా మారింది.
అధికారుల లెక్కల ప్రకారం పంట సాగు వివరాలు
జిల్లాలో వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం మొత్తం 5,59,831 హెక్టార్లలో పంటలను సాగు చేశారు. వరి 2,63,481 హెక్టార్లు, పత్తి 1,80,202 హెక్టార్లు, మిర్చి 57,030 హెక్టార్లలో సాగు చేసినట్లుగా వ్యవసాయాధికారులు లెక్కలు చూపారు. సబ్సిడీలు అధికంగా వచ్చే జొన్న, సజ్జ, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, ఆముదం, చెరకు, పసుపు, పొగాకు, జూట్ మరికొన్ని ఇతర పంటలు కలిపి 59,118 హెక్టార్లలో సాగు చేసినట్లుగా చూపారు. అయితే పంటల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే వరి, పత్తి, మిర్చి పంటలు మినహా మిగిలిన అన్ని పంటల విస్తీర్ణం 20వేల హెక్టార్లలోపుగానే ఉంటుందని రైతుసంఘాల నాయకులు చెబు తున్నారు. వీటిని ఎక్కువగా చూపడం వల్ల పంట నష్టపరిహారం అంచనా జాబితాలో వేలాది మంది బాధిత రైతులకు అన్యాయం జరుగుతుందని వారు మండిపడుతున్నారు.
పై-లీన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం
Published Sat, Nov 16 2013 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement