పంటను విక్రయించేందుకు వెళ్లి..
Published Tue, Apr 25 2017 10:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- మరో నలుగురికి గాయాలు
- నర్సరావుపేట వద్ద ఘటన
సి.బెళగల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు వెళ్లిన ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మరో నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన పూర్తి వివరాలు.. తెలుగు వీధిలో నివాసం ఉంటున్న చిన్న పేటరాముడు (65), రామాంజనేయులు, పలుకుదొడ్డి నడిపి ఈరన్న గౌడ్, గోవిందు గౌడ్, లక్ష్మన్న గౌడ్, సూరి తదితరులు తమ పొలంలో పండిన ఎండు మిర్చిని గుంటూరు మిర్చి యార్డలో విక్రయించేందుకు సోమవారం లారీలో బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నర్సరావుపేట బైపాస్ వద్ద మిర్చి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బోయ చిన్న పేటరాముడు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్న పేటరాముడుకు నలుగురు కుమారులు, భార్య సుంకులమ్మ ఉన్నారు.
Advertisement