పై-లీన్ తుపాను బాధితులకు విజయమ్మ మనోధైర్యం
Published Thu, Oct 17 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
సాక్షి, శ్రీకాకుళం: ఇరవయ్యేళ్ల కష్టం.. మరో ఇరవయ్యేళ్ల జీవితం.. ఓ తరానికి సరిపోయే జీవనోపాధి. కళ్లముందే నేల కొరిగింది. పై-లీన్ తుపాను తాకిడికి వేల సంఖ్యలో కొబ్బ రి, జీడి మామిడి, పనస తదితర ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. ఇళ్లు శిథిలమయ్యాయి. మత్స్యకారులకు కూడు పెట్టే పడవ లు, వలలు అలలకు కొట్టుకుపోయాయి. బతుకు తెరువు పోయిందన్న బాధ ఓ వైపు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఏసీ కార్లలో వస్తున్న నేతలు.. నేల మీద అడుగు పెట్టకుండానే.. వెళ్లిపోతున్నారన్న ఆవేదన మరో వైపు. ఇలాంటి బాధాతప్త హృదయాల్ని అక్కున చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించారు. రైతులు, మత్స్యకారుల గోడు స్వయంగా విన్నారు. తమ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న భరోసా ఇచ్చారు. మరికొద్ది నెలల్లో జగన్ బాబు ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరి బాధలూ తీరిపోతాయన్న ఆశలు నిం పారు. కొండంత ధైర్యాన్నిచ్చారు.
‘20 ఏళ్లపాటు ఫలసాయమిచ్చే కొబ్బరి, జీడి తోటలు నాశనమయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. కార్లు దిగకుండానే.. ఇక్కడేం నష్టం జరగలేదంటూ తేల్చి చెప్పేశారు’..
- పలికల భాస్కర్, జాడుపూడి
‘అధికార బృందం రాలేదు. నష్టాన్ని అంచనా వేసేవాళ్లు లేరు. ఏం జరిగిందని అడిగే నాథుడే లేడు. చాలా కుటుం బాలు రోడ్డునపడ్డాయి. ఊరంతా అంధకారంలోనే ఉంది. జనరేటర్ల సాయంతో ట్యాంకర్లకు నీటిని నింపి సరఫరా చేసుకుంటున్నాం. వీఆర్వోను అడిగితే.. సమ్మెలో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో చెట్టుకు పరిహారంగా రూ.10 వేలిచ్చినా సరిపోదు’.. - బొడ్డ రామ్‌కుమార్, సర్పంచ్, పెద్దకొజ్జిరియా
‘ఉన్న ఎనిమిదెకరాల్లోని కొబ్బరి పంట నాశనమైంది. ఆ పొలం ఉందని సెప్పి తెల్లకార్డు ఇవ్వలేదు. పెన్షన్‌కు దూరం చేశారు. ఇపుడు నా పంటంతా పోయినాది. నాకు దిక్కేటి’..
- సనపల సరస్వతి, రాజపురం
‘మారాజు. దేవుడిలాంటి వైఎస్సార్ ఇల్లు కట్టుకోడానికి భూమిచ్చారు. పేదలం. ఇల్లు కట్టుకునేందుకు సొమ్మేదీ..! దయచేసి మాకు ఒక రూమ్‌తో ఇల్లు కట్టిత్తే ఆ నాయన పేరు సెప్పుకుని బతికేత్తాం’..
- రట్టి శేషమ్మ, ఇద్దివానిపాలెం
‘మా ఊళ్లో 270 వరకు ఇళ్లున్నాయి. ఎటేపు నుంచీ దారి లేదు. చుట్టూ ఏరే. ట్యాంక్ నీరొస్తే ఫర్వాలేదు. లేదంటే.. మురికినీరే గతి. ఉదానం వైపు మాకు భూమిస్తే ఊరంతా ఎల్లి ఇళ్లు కట్టుకుంటాం’..
- పార్వతి, ఒంటూరు
ఒకరేంటి.. ఒక్కో ఊళ్లో ఒక్కో రకమైన ఆవేదన. కిడ్నీ వ్యాధుల నుంచి తమను రక్షించాలని, ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత పెంచాలంటూ కుసుంపురం వాసులు, బీల నీటి ముంపుతో వరి పొలాలు పాడైపోయాయని రుషికుడ్డ ప్రజలు, థర్మల్ విద్యుత్‌ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని బారువ ప్రజలు.. జగన్ వస్తేనే తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకంతో.. ఆయన తరఫున తమ బాధలు తెలుసుకునేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందు గోడు వెల్లబోసుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు.
ప్రతి ఒక్కరి బాధనూ ఆమె సాంతం విన్నారు. పలు విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..
‘జిల్లాలో తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మిమ్మల్ని పరామర్శించి ధైర్యం నింపడానికే నన్ను జగన్ బాబు ఇక్కడికి పం పించాడు. కొబ్బరి, జీడి తోటలు, బోట్లు, వల లు, ఇళ్లు పాడయ్యాయి. చూస్తే చాలా బాధగా ఉంది. రాజశేఖరరెడ్డిగారున్నపుడు సునామీ వస్తే ఎంతగానో ఆదుకున్నారు. చివరి నిమిషం వరకు మీ కోసమే తపించారు. ఇపుడు ఆ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదు. మీ తరఫున మా ఎమ్మెల్యేలంతా కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ పెడితే.. అక్కడా చర్చిస్తాం. చెట్టుగా కాకుండా ఎకరానికి లెక్కిం చి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతాం. ఐదారు నెలల్లో జగన్ నాయకత్వంలో మంచి రోజులు వస్తాయి. వేటకెళ్లి గల్లంతైన మత్స్యకారులకు వెంటనే రూ.50 వేలు, ఆరు మాసాల వరకు జాడ కానరాకపోతే మిగిలిన రూ.4.50 లక్షలు పరిహారం ఇస్తాం. మీ నుంచి ఒకర్ని ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తానంటూ జగన్ ఎప్పుడో మాటిచ్చారు. మీరంతా ధైర్యం గా ఉండండి. రాజశేఖరరెడ్డి పథకాలన్నింటినీ అమలు చేస్తారంటూ భరోసా ఇచ్చారు.
Advertisement
Advertisement