పై-లీన్ గండం! | Cyclone Phailin threatens 12 million, says disaster authority | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 12 2013 7:19 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

: ఈ ఏడాది సీజన్ మొదట్లోనే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటల సాగు విస్తీర్ణం పెరగగా... పంట చేతికి వచ్చే సమయంలో పై-లీన్ తుపాను ఏ మేరకు ముంచుతుందోనని రైతులు భయపడుతున్నారు. రాబోయే ఐదు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై, వర్షాలు కురిసే అవకాశముందని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అక్టోబర్ 12, 13 తేదీల్లో 30 సెంటీమీటర్లకు తగ్గకుండా, 14, 15, 16 తేదీల్లో 10 నుంచి 16 సెం.మీ. చొప్పున వర్షం కురిసే అవకాశముందని పేర్కొంటున్నారు. వాయువ్య దిశలో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఆకాశం మబ్బులు పడి గాలిలో తేమశాతం పెరుగుతోంది. తుపాన్ ప్రభావం తో వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు సంభవిస్తున్నాయి. అప్పుడే మండే ఎండ, వెం టనే వర్షం వస్తోంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఆకాశంలో మబ్బులు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పంటలు కోతకు వచ్చే అక్టోబర్‌లో తుపాన్లు రావడం పరిపాటే అయి నా... ఈ సారి తుపాన్ ఎక్కువ నష్టం కలిగించే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం తుపాన్‌తో కోతకు వచ్చిన పొలా లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో మొక్కజొన్న, సోయాబీన్, వరి కోతకు వచ్చా యి. మొక్కజొన్న 60వేల ఎకరాల్లో సాగు చేయ గా 40 వేల ఎకరాల్లో పంట కోశారు. కంకులు ఎండబెట్టారు. మిగతా పంట కూడా కోతకు రాగా, వర్షం భయానికి ఆగుతున్నారు. సోయా 21 వేల ఎకరాల్లో సాగు చేయగా 15 వేల ఎకరా ల్లో కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటలు ఆరబెట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది. వరి లక్షా 88 వేల ఎకరాల్లో సాగు చేయగా చాలా చోట్ల గింజలు పోసుకునే దశలో వరి ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడే కోతకు వచ్చి ఉంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో పంటలు కోయొద్దని వ్యవసాయాధికారులు చెబుతు న్నా... వర్షం పడితే ఉన్న పంట కూడా చేతికి రాకుండా నిండా మునిగిపోతామేమోనని రైతు లు తలలు పట్టుకుంటున్నారు. పంట కోత దశలో గింజలు తేమగా ఉంటా యి. ఆరబెట్టకపోతే బూజు పట్టి నాణ్యత చెడిపోయి మార్కెట్‌లో ధర పలకదు. దీంతో కోత లు వాయిదా వేయడమే మంచిదని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే పంటలు కోసిన జగి త్యాల, కోరుట్ల తదితర మండలాల్లో రైతుల బాధలు వర్ణనాతీతమయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇళ్లలో స్థలం లేక రోడ్లపై పోస్తుండ గా రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న, సోయాబీన్ గింజలు నాని మొలక లు వచ్చాయి. ఇప్పుడు పైలీన్ తుపాన్ గండం తో మొత్తం నీటిపాలయ్యే ప్రమాదముందని భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే దిగుబడి మొదలవుతున్న పత్తికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి వర్షానికి పాడైపోయే ప్రమాదముంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement