పెను తుపాను ‘ఫొని’ పడగెత్తింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలపై పెను ప్రభావం చూపడానికి దూసుకెళుతోంది. తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగా బలపడుతూ వచ్చి చివరకు పెను తుపానుగా మారింది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీచే భీకర గాలులు, భారీ వర్షాలతో ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందోనన్న భయాందోళనలు ఇటు ఉత్తరాంధ్ర, ఒడిశా వాసుల్లో వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికే తిత్లీ దెబ్బకు అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ఇంకా పూర్తిగా తేరుకోలేదు.