విశాఖ : పై-లిన్ తుపాను కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ల పునరుద్దరణ పనులను రైల్వే అధికారులు సోమవారం ప్రారంభించారు. విశాఖ నుంచి భువనేశ్వర్, కోల్కతా రైలు మార్గంలో మరమ్మతులు చేపట్టారు. అలాగే ఈ మార్గంలో పరిమిత వేగంతో రైళ్లు నడపాలని నిర్ణయించారు.
కాగా పై-లీన్ తుపాను ప్రభావం తగ్గడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే నిన్న ప్రకటించింది. పలు స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు పేర్కొంది.
భువనేశ్వర్-రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, పూరి- సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య సంపర్క్‌క్రాంతి, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు నిన్న సాయంత్రం షెడ్యూల్ సమయం కన్నా ఆలస్యంగా భువనేశ్వర్ నుంచి బయల్దేరాయి. పూరి నుంచి బయల్దేరనున్న కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే నడిపిస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరుతాయని పేర్కొంది.