railway tracks
-
కూ.. చకచకా..
సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే లైన్ల పనులను రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మీకులు శరవేగంగా పూర్తి చేశారు. మొత్తంగా 52 గంటల్లో పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్ నడిపించారు. అంతా సవ్యంగా ఉండడంతో బుధవారం మధ్యాహ్నం విజయవాడ– సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కదిలింది. పగలూ.. రాత్రి తేడా లేకుండా...: వరద ఉధృతి పెరిగి తాళ్లపూసపల్లి– కేసముద్రం రైల్వేలైన్‌లోని 432, 433 కిలోమీటరు మార్కు వద్ద 200 మీటర్ల మేర పట్టాల కింద కంకర, మట్టి, సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 418 కిలోమీటర్ రాయి వద్ద 200 మీటర్ల మేర, మరో నాలుగు చోట్ల పాక్షికంగా లైన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో శనివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్మీకులను తీసుకొచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పనులు వేగంగా..: దేశంలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ నడిచే రైలుమార్గం దెబ్బతినడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా, దీంతో మరమ్మతుల పనుల్లో అధికారులు వేగం పెంచారు. ముందుగా డౌన్‌లైన్ పనులు తాళ్లపూసపల్లి– కేసముద్రం మధ్యలో ఏడు జేసీబీలు, 300 మంది కార్మీకులు, 100 మంది సూపర్వైజర్లు, 100 మంది వివిధ కేటగిరీకి చెందిన రైల్వే ఉద్యోగులు ఇలా మొత్తంగా 500 మంది పనిచేశారు. – ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 13 జేసీబీలు, 150 మంది సూపర్వైజర్లు, 300 మంది రైల్వేస్టాఫ్, 550మంది కార్మికులు మొత్తం కలిసి 1000 మందితో పనులు ప్రారంభించారు. పనులకు వరద ప్రవాహం అడ్డురావడంతో బండరాళ్లు, ఇసుక బస్తాలతో వరదను కట్టడి చేసి పనులు వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే అప్‌లైన్ (సికింద్రాబాద్–విజయవాడ) లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు.. కదిలిన రైళ్లు రైల్వే ట్రాక్ పనులు పూర్తి కావడంతో ముందుగా తాళ్లపూసపల్లి– మహబూబాబాద్ మధ్య ట్రయల్ రన్‌గా గూడ్సు రైలును నడిపారు. ఇంటికన్నె–కేసముద్రం మధ్య కేసముద్రం రైల్వేస్టేషన్లో నిలిచిన సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును ట్రయల్ రన్‌గా నడిపారు. ఆ తర్వాత నాలుగు గూడ్స్ రైళ్లను అప్‌లైన్‌లో పంపించారు. ఇక ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో కేసముద్రం–ఇంటికన్నె మధ్య 418 కిలోమీటర్ మీదుగా వేగాన్ని తగ్గించి 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడిపించారు. రైల్వేట్రాక్ మరమ్మతులు చేసిన చోట కొంతవరకు కుంగిపోయింది. కాగా ట్రాక్ కుంగిపోయిన చోట జాకీలతో పైకి లేపి మరమ్మతు పనులు చేశారు. వర్షం కురుస్తున్నా, పనులను మాత్రం ఆపకుండా వేగవంతంగా చేస్తున్నారు. -
గాలిలో రైలు పట్టాలు..
సాక్షి, మహబూబాబాద్/ డోర్నకల్/ మహబూబా బాద్ రూరల్/ కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో నాలుగు చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పట్టాల కింద సిమెంట్ దిమ్మెలు, కంకరరాళ్లు, మట్టి కొట్టుకుపోయి ఊయలలా పట్టాలు వేలాడుతున్న విషయాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడం.. అప్రమత్తమైన అధికారులు ఎక్కడిక క్కడ రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయోధ్య పెద్దచెరువు కట్ట తెగడంతో..మహబూబాబాద్ రూరల్ మండలం అయోధ్య పెద్ద చెరువు కట్ట తెగడంతో వరద నీరు ఉధృతంగా తాళ్లపూసపల్లి సమీపంలో రైల్వేట్రాక్ కిందినుంచి వెళ్లింది. దీంతో కొత్తగా వేస్తున్న విజయవాడ– సికింద్రాబాద్ లైన్‌తోపాటు, పాత లైన్ల కింద ఉన్న మట్టి, కంకర రాళ్లతోపాటు, సిమెంట్ దిమ్మెలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఆరు నుంచి పది అడుగుల మేరకు గొయ్యిపడి పట్టాలు గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కేసముద్రం విలేజీ పెద్ద చెరువు, దామర చెరువు, ఇంటికన్నె చెరువుల వరదతో ఇంటికన్నె, కేసముద్రం మధ్యలో వరద తీవ్రత పెరిగి ట్రాక్ అడుగు భాగం అంతా కొట్టుకుపోయింది. దీంతో ఇంటికన్నె–కేసముద్రం మధ్య 200 మీటర్ల మేర, తాళ్లపూసపల్లి–మహబూబాబాద్ మధ్యలో ఒక చోట 50 మీటర్లు, మరోచోట 10 మీటర్ల మేరకు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నది. అదేవిధంగా నెక్కొండ– వరంగల్ మధ్య రెండు మీటర్ల మేర గొయ్యి పడింది. వేలాది మంది ప్రయాణికులతో ఉక్కిరి బిక్కిరిట్రాక్లు దెబ్బతిన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు కేసముద్రంలో సంఘమిత్ర రెండు రైళ్లు, మహబూబాబాద్‌లో సింహపురి, మచిలీపట్నం, డోర్నకల్‌లో పద్మావతి, అప్, డౌన్ రెండు గౌతమి రైళ్లు నిలిపి వేయడంతో సుమారు పదివేలకు పైగా ప్రయాణికులు ఒక్కసారిగా మూడు స్టేషన్లలో దిగారు. రైళ్లు ఎప్పుడు వెళ్తాయో తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రైవేట్ వాహనాలలో వెళ్లగా, మరికొందరు లాడ్జీలు తీసుకొని ఉన్నారు. ఎటూ వెళ్లలేని వారు స్టేషన్లలోనే ఉండటంతో మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు వారికి పండ్లు, బిస్కెట్లు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, మంచినీరు, మందులు అందజేశారు.సార్లకు సమాచారం ఇచ్చాను..నేను కేసముద్రం– ఇంటికన్నె లైన్‌లోని 550 ఆర్ఏ ఎఫ్టీ వద్ద ఉన్నా. పైనుంచి వరద పెరిగింది. అప్ప టికే నా వద్దకు వచ్చిన పెట్రోలింగ్ టీమ్‌తో మాట్లాడి విషయం ముందుగా ఎస్ఎస్ఏ శ్రీనివాస్‌కు, తర్వాత రాజమౌళికి ఇచ్చాం. ట్రైన్ల వేగం తగ్గించారు. తర్వాత కూడా వరద పెరగడంతో కాషన్ ఆర్డన్ ఇవ్వాలని కోరాం. – మోహన్, ట్రాక్‌మన్, ఇంటికన్నెవారిద్దరి సమాచారంతో రైళ్లు ఆపేశాంగతంలో జరిగిన వరద అనుభవాల దృష్ట్యా రైల్వే లైన్లకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వాచ్మెన్లను పెట్టాం. ట్రాక్‌మన్ సమాచారంతో అప్రమత్తమై రోడ్డు మార్గంలో నేను 575 రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్ వద్దకు వెళ్లాను. అప్పటికే పరిస్థితి విషమించింది. వరద పెరిగింది. విషయాన్ని పై అధికారులకు చేరవేశా. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడ ఆపేశారు. – రాజమౌళి, సీనియర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్ప్రమాద స్థాయి గమనించానునేను తాళ్లపూసపల్లి– కేసముద్రం లైన్‌లోని 575 ట్యాంకు వద్ద ఉన్నా. సాయంత్రంనుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రమాద స్థాయికి చేరుతుందని గమనించి రాత్రి 12 గంటల సమయంలోనే మా ఎస్ఎస్ఈ రాజమౌళికి చెప్పా. గస్తీ వాళ్లకు సమాచారం ఇచ్చి ఆయన వచ్చారు. రైళ్లు ఆపేశాం. – జగదీశ్, ట్రాక్‌మన్, తాళ్లపూసపల్లి -
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
శ్రీసత్యసాయి, సాక్షి: జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఇనుప స్తంభాలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రైలుబోగీల్లోనే 10 గంటలు..
మహబూబాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి చెరువు రిజర్వాయర్‌పై నిర్మించిన రైల్వే వంతెన ట్రాక్‌పైకి వరద నీరు ఉధృతంగా చేరడంతో గురువారం రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సుమారు 10గంటలపాటు ప్రయాణికులు రైలు బోగీల్లోనే నిరీక్షించారు. వడ్డెపల్లి చెరువు కట్టపై 364/27–25 కి.మీ నంబర్ వద్ద రైల్వే ట్రాక్ డేంజర్‌గా మారడంతో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో తిరుపతి–కరీంనగర్, ఎర్నాకులం–బిలాస్పూర్, యశ్వంత్‌పూర్–లక్నో, బెంగళూర్–నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉదయం 10:30 గంటల నుంచి నిలిపివేశారు. కాజీపేట–ఢిల్లీ, వరంగల్–ఢిల్లీ అప్ అండ్ డౌన్ రూట్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ బ్రిడ్జి, ట్రాక్ ఇంజనీర్స్, కాజీపేట జంక్షన్‌కు చెందిన అధికారులు వడ్డెపల్లి రైల్వే ట్రాక్ వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ట్రాక్ సామర్థ్యం టెస్టింగ్ కోసం ట్రాక్‌పై గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. రాత్రి 8 గంటల వరకు ఇదే పరిస్థితిలో రైల్వే అధికారులు సెక్యూరింగ్ చేశారు. కాగా కాజీపేట రైల్వే చరిత్రలో వడ్డెపల్లి చెరువు రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. అయితే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ సమీప దుకాణాల వద్దకు వెళ్లి తిను బండారాలు కొనుగోలు ఆకలితీర్చుకున్నారు. వరంగల్ సమీప గ్రామాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోయారు. సుమారు 10గంటల తర్వాత గురువారం రాత్రి రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ కెపాసిటిని పరిశీలించి మొదటి, రెండో లైన్లకు రాత్రి 8:30 గంటలకు క్లీయర్ ఇచ్చారు. ముందుగా లైట్ ఇంజన్ నడిపించి ఆతర్వాత 10 నుంచి 30 కెంఎంపీహెచ్ స్పీడ్‌తో ఢిల్లీ వైపు యశ్వంత్‌పూర్– బిలాస్పూర్, తర్వాత రాజధా, లక్నో, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లను పంపించినట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్ జలమయం వర్షపునీరు కాజీపేట జంక్షన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దకు, ఎంట్రెన్స్ ఎదుట, ప్లాట్‌ఫాం పైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ► న్యూ ఢిల్లీ వెళ్లే ఏపీ, తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు గురువారం ఉదయం 11.30 గంట ల సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ రెండు, మూడు ప్లాట్ ఫాంలలో నిలిపివేశారు. రైళ్లలో శు క్రవారం ఐఐటీ ఢిల్లీ కళాశాలలో చేరేందుకు వెళ్తు న్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ) ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లా ట్ ఫాం రేకు తగలడంతో రైలు ఆగిపోయింది. ► రఫ్తీసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (గోర్కపూర్– కొచువేలి) రైలు నెక్కొండ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం 11గంటలకు నిలిచిపోయింది. స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడం.. తినుబండారులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. -
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్‌హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్‌కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్‌లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్‌లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్‌లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్‌లో డ్యామ్‌లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్‌లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్‌లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్‌లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందే భారత్ రైలు.. హైదరాబాద్ ట్రాక్‌లపై నడిచేనా!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైళ్ల రాకపోకలకు హైదరాబాద్ ట్రాక్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతిరోజూ ఎంఎంటీఎస్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీసే ట్రాక్‌లోనే వచ్చే ఏడాది నుంచి వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, ముంబై, బెంగళూరు నగరాలకు ఈ అధునాతన రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రహరీలు, ఫెన్సింగ్ వంటి ఎలాంటి రక్షణ చర్యలు లేని నగరంలోని రైల్వేలైన్లు వందేభారత్ రైళ్ల నిర్వహణకు సవాల్‌గా మారాయి. ట్రాక్‌ల వెంట అనేక చోట్ల మలుపులు, ప్రమాదకరమైన స్థలాలు ఉన్నాయి. మనుషులు ఒకవైపు నుంచి మరోవైపునకు ట్రాక్‌లు దాటుతుంటారు. ఈ క్రమంలో గంటకు 150కిపైగా కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే వందేభారత్ రైళ్లకు ఏ చిన్న అవాంతరం ఏర్పడినా భారీ నష్టం వాటిల్లుతుందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకే ట్రాక్‌లో రెండు ప్రమాదాలు.. ► ఇటీవల అహ్మదాబాద్– ముంబై ట్రాక్‌లో ఏకంగా రెండుసార్లు వందేభారత్ రైళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మొదటిసారి అడ్డుగా వచ్చిన అయిదు గేదెలను ఢీకొనడంతో అవి అక్కడిక్కడే చనిపోయాయి. ఈ ఉదంతంలో రైలు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం మరిచిపోకముందే మరో సంఘటనలో ట్రాక్‌కు అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టడంతో రెండోసారి వందేభారత్ రైలుదెబ్బతిన్నది. ట్రాక్‌లకు ఇరువైపులా కంచె లేకపోవడం వల్ల పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ► మరోవైపు సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇంజిన్లు దెబ్బ తినకుండా క్యాటిల్ గార్డ్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రైళ్లు పశువులను ఢీకొట్టినప్పటికీ ఇంజిన్లు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి. కానీ వందేభారత్ రైళ్లకు ఇలాంటి గార్డ్లను ఏర్పాటు చేసే అవకాశం లేదు. సురక్షితమైన ట్రాక్‌ల నిర్వహణ ఒక్కటే పరిష్కారం. అహ్మదాబాద్– ముంబై మార్గంలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల నుంచి హైదరాబాద్‌లో వందేభారత్ రైళ్ల నిర్వహణపై పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదకరంగా పట్టాలు.. నగరంలో సుమారు 45 కిలోమీటర్ల మార్గంలో రెండు వైపులా వందల కొద్దీ బస్తీలు, కాలనీలు ఉన్నాయి. అనేక చోట్ల ప్రహరీ గోడలు కానీ, ఫెన్సింగ్ కానీ లేకపోవడం వల్ల మనుషులు రాత్రింబవళ్లు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్తారు. దీంతో ఎంఎంటీఎస్ రైళ్లు, కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొని తరచుగా మృత్యువాత పడుతున్నారు. పశువులు చనిపోతున్నాయి. భరత్‌నగర్, హఫీజ్‌పేట్, డబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, విద్యానగర్, సీతాఫల్మండి వంటి అనేక చోట్ల పెద్ద సంఖ్యలు మలుపులు ఉన్నాయి. కొన్ని చోట్ల వార్నింగ్ అలారమ్‌లు ఏర్పాటు చేశాను. కానీ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల రాకపోకలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడం, అవసరమైన చోటప్రహరీలు నిర్మించడం వంటి పనులు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రైల్వే చట్టం ప్రకారం మనుషులు, పశువులు ట్రాక్‌లు దాటడం నేరం. ఈ నేరాలు జరగకుండా అరికట్టేందుకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సహా అన్ని రైళ్లకు క్యాటిల్ గార్డ్లు ఉండడం వల్ల రైలు ఇంజిన్లు దెబ్బతినడం లేదు. భవిష్యత్‌లో వందేభారత్ రైళ్లు ఈ మార్గంలో నడిస్తే ఇంజిన్లు దెబ్బతిని అపారమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. చదవండి: సిటీ@431 ఏళ్లు.. హైదరాబాద్‌లో తొలి కట్టడం ఏంటో తెలుసా! -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు. రద్దు చేసిన రైళ్లలో విజయవాడ–గుంటూరు(17783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580/07579), మాచర్ల–విజయవాడ (07782), డోర్నకల్లు–విజయవాడ (07755), భద్రాచలం రోడ్డు–విజయవాడ (07278/07979) ఉన్నాయి. -
Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత పనై ఉండేది
రైలు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొంతమంది కావాలనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. మరికొందరు అనుకోకుండా రైలు ప్రమాదం బారిన పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. అయితే అదృష్టం బాగుండి మృత్యువును జయించి వీరుడిలా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని భర్తన రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. దీనిని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు. వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు వెళ్లింది. ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా వెళ్తుండటం వల్ల పట్టాలపై పడిన వ్యక్తి ముందుగా కనిపించలేదు. నిమిషం తరువాత ట్రైన్ వెళ్లిపోయాక చూస్తే అతను ఎటు కదలకుండా ప్లాట్‌ఫామ్‌కు అనుకొని కింద ఒకేచోట ఉండిపోయాడు. అంతేగాక అద్భుతంగా అతని ఒంటిపై కనీసం ఒక్క గీత కూడా పడకుండా సురక్షితంగా బయటకొచ్చాడు. రైలు స్టేషన్ దాటిన తర్వాత సదరు వ్యక్తి తనను బతికించినందుకు దేవుడికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలతో బయటపడటంతో అక్కడ గుమిగూడిన వారంతా హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వీడియో ఆధారంగా రైలు వచ్చే కొద్ది క్షణాలముందే వ్యక్తి ట్రాక్‌పై పడినట్లు తెలుస్తోంది. అతని వస్తువులు కూడా పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. Viral Video : Train passed over a man at Bharthana railway station in Etawah as death..., watch breath-taking video pic.twitter.com/eHtn1LcN1A — santosh singh (@SantoshGaharwar) September 6, 2022 -
సాహసం చేసి ప్రాణం కాపాడాడు.. అడి కార్ అందుకున్నాడు
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్‌తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా. ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్‌తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది. టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్‌ను టోనీకి సర్ప్రైజ్గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది. -
రైల్వే ట్రాక్‌లను పేల్చేసేందుకు ఐఎస్ఐ కుట్ర
న్యూఢిల్లీ: మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఐఎస్ఐ పెద్ద కుట్ర పన్నిందని తెలిపాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి. గూడ్స్ రైళ్లే టార్గెట్ సరకు రవాణా రైళ్లను ధ్వంసం చేయడానికి పంజాబ్‌తోపాటు పరిసర రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్ఐ ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారతదేశంలోని తన కార్యకర్తలకు ఐఎస్ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని వెల్లడించాయి. భారత్‌లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందని వివరించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఎగదోత ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్‌లో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది. పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. భద్రత కట్టుదిట్టం నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. (క్లిక్: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది) పంజాబ్‌పై గురి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘జమ్మూకశ్మీర్‌లో ఐఎస్ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్‌లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెల్లడైందన్నారు. (క్లిక్: దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం) -
రైలు పట్టాలే యమపాశాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి కాలినడకన సొంతూళ్లకు పయనమయ్యారు. రైలు పట్టాలపై నడక సాగించారు. రైళ్లు ఢీకొట్టడం వల్ల, అనారోగ్యంతో వలస కార్మికులు పట్టాలపైనే ప్రాణాలు విడిచారు. గత ఏడాది దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8,733 మంది మృతి చెందారని, వీరిలో అత్యధిక శాతం మంది వలస కార్మికులేనని రైల్వే బోర్డు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే బోర్డు తాజాగా సమాధానమిచ్చింది. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 2020లో జనవరి నుంచి డిసెంబర్ వరకు రైలు పట్టాలపై 8,733 మంది మరణించారని, 805 మంది గాయపడ్డారని పేర్కొంది. రోడ్లతో పోలిస్తే రైల్వే మార్గాలపై ప్రయాణం తక్కువ దూరం కావడంతో వలస కార్మికులు వీటినే ఎంచుకున్నారని, పట్టాలపై కాలిన నడకన వెళ్తూ చాలామంది మార్గంమధ్యలో వివిధ కారణాలతో మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపై పోలీసుల నిఘా అధికంగా ఉండడంతో చాలామంది రైల్వే ట్రాకులపై నడుస్తూ సొంతూళ్లకు పయనమయ్యా రని అన్నారు. దేశవ్యాప్తంగా 70 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాకులు విస్తరించి ఉన్నాయి. నిత్యం 17 వేల రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. 2016, 2017, 2018, 2019తో పోలిస్తే 2020లో రైలు పట్టాలపై చోటుచేసుకున్న మరణాలు తక్కువేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 2016లో 14,032 మంది, 2017లో 12,838 మంది, 2018లో 14,197 మంది, 2019లో 15,204 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు. (చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్) -
రైలు పట్టాలపై ఆహారం.. 12 పులులు మృతి!
ఢిల్లీ: రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లలో 100కు పైగా జంతువులు మృతి చెందాయని మధ్యప్రదేశ్ అటవీ విభాగం ఓ నివేదికను రూపొందించింది. రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకులు వ్యర్థ ఆహారాన్ని రైలు పట్టాలపై పారేస్తుండడం వల్ల వాటిని తినడానికి వచ్చిన దాదాపు 100కు పైగా జంతువులు గత ఐదేళ్లలో మృతి చెందాయని పేర్కొంది. తాజాగా 12 పులులు చనిపోయాయని.. వాటిలో 5 పులులు, 7 చిరుతలు ఉన్నాయని తెలిపింది. సెహోర్ జిల్లాలో ఉన్న రతపాని టైగర్ రిజర్వ్ స్టేషన్ వద్దే ఈ పులులు చనిపోయాయని నివేదికలో పేర్కొంది. ఈ అటవీ ప్రాంతం గుండా 20 కిలోమీటర్లు రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాలపై పడి ఉండే ఆహారం కోతులను, ఇతర జంతువులను ఆకర్షిస్తోందని, వాటి కోసం పులులు కూడా అక్కడకు వస్తున్నాయని తెలిపింది. అలా రైళ్ల కింద పడి చనిపోతున్నాయని తెలిపింది. చదవండి: హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి -
కాపాడాడు, కానీ చెంప చెళ్లుమనిపించాడు
ముంబై: ఓ పెద్ద మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రైలు పట్టాల మీద తచ్చాడాడు. ఇది చూసిన పోలీసు వెంటనే పరుగుపరుగున వచ్చి అతడిని పైకి లాగి రక్షించిన ఘటన శుక్రవారం నాడు ముంబైలోని దహీసర్ రైల్వే స్టేషన్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరవై ఏళ్ల పెద్దాయన రైల్వే పట్టాల మీదకు ఎక్కాడు. ఇంతలో రైలు కూత వినపడటంతో కంగారుగా వెనక్కు రాబోయాడు. ఈ క్రమంలో అతడి చెప్పు ఊడిపోయింది. అయితే తన ప్రాణం కన్నా కింద పడిన చెప్పే ముఖ్యమన్నట్లుగా వెళ్లి దాన్ని తీసుకున్నాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న పోలీసు వెంటనే పరుగెత్తుకొచ్చి.. "పట్టాల మీదకు ఎక్కకుండా అక్కడే ఉండు, లేదంటే ఎడమ వైపు దూకేయ్" అని సలహా ఇచ్చాడు. దీన్ని పెద్దగా పట్టించుకోని వ్యక్తి రైలు వచ్చేలోగా ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. (చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..) వెంటనే పట్టాల మీదుగా పరుగెత్తగా సరిగ్గా అప్పుడే ట్రెయిన్ వేగంగా దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్న పోలీసు అతడిని ప్లాట్‌ఫామ్ మీదకు లాగి కాపాడాడు. కానీ తన సూచన పాటించకుండా నిర్లక్క్ష్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన అంతా అక్కడి కెమెరాలలో రికార్డవగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రైల్వే ట్రాక్ మీద నడవద్దన్న నిబంధనను ఆ వ్యక్తి తుంగలో తుక్కాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తిని పోలీసు కొట్టడాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం హెచ్చరిస్తే సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!) -
పెళ్లైన నెల రోజులకే పట్టాలపై ప్రేరణకర్త !
భువనేశ్వర్(ఒడిశా): స్థానిక లింగరాజ్ ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆదిత్యదాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ప్రేరణాత్మక వక్త(మోటివేషనల్ స్పీకర్)గా ఇటీవల పేరొందిన ఆయన.. పీపుల్ ఫర్ సేవా పేరుతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. అనతి కాలంలో ఈ కేంద్రంలో 100 మంది వయో వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. అయితే మంగళవారం ఉదయం ఆయన మృతదేహం పట్టాలపై పడి ఉన్నట్లు గమనించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పూర్వాపరాల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానసిక స్థైర్యం పట్ల పలు ప్రేరణాత్మక సందేశాలను సాంఘిక మాధ్యమాల్లో ప్రసారం చేసి, ఉత్తమ వక్తగా పేరొందిన వ్యక్తి.. ఇలా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని స్థానికులు భావిస్తున్నాయి. గత నెల 9న ఆదిత్య దాస్‌కు వివాహం జరిగింది. -
మార్చిలో గజ్వేల్‌కు.. కూ.. చుక్‌చుక్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–గజ్వేల్ మధ్య నడపనున్న రైలు మార్చిలో పట్టాలెక్కబోతోంది. తొలుత పుష్పుల్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన రైల్వే, రామాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి ఆ పనులు మొదలుకానున్నా యి. వాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరినాటికి ఆ పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టేషన్లు... ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్‌తో కరీంనగర్‌ను రైల్వే లైన్ ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజె క్టులో తొలి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ ప్రారం భమైంది. అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి చేయటం ప్రాజెక్టు తొలిదశ. ఇందులో మనోహరాబాద్ వద్ద కొత్త స్టేషన్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్‌లలో స్టేషన్లు ఉంటా యి. జనవరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి. జాతీయ రహదారిని కట్‌చేసి... ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీ, నాలుగు చోట్ల పెద్ద వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట వంతెన నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని కట్ చేసి పని చేపట్టాల్సి ఉన్నందున అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈనెల 20 నుంచి అక్కడ పనులు చేసుకోవచ్చంటూ తాజాగా జాతీయ రహదారుల విభాగం అనుమతించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఫిబ్రవరిలో ట్రయల్ రన్ పూర్తి చేసి మార్చి తొలివారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. -
నాడు నిలిపివేసి..నేడు ప్రయాణం సా..గదీసి
సాక్షి, కొత్తగూడెం : భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ బండి తెల్లవారుజామున 05:45 గంటలకు కొత్తగూడెం నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఉదయం 06:45 గంటలకు షురూ అవుతోంది. డోర్నకల్ సమీపంలోని స్టేషన్ల మధ్యలో జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతుల కారణంగా రైలు నడిచే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే..ఈ ఆలస్యంతో నిత్యం రాకపోకలు సాగించేవారు చాలా అసౌకర్యం చెందుతున్నారు. ఈ రైలు ఎక్కి డోర్నకల్ స్టేషన్‌కు వెళ్లి..అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 05:45 గంటలకు రైలు వెళ్లినప్పడు డోర్నకల్ స్టేషన్లో హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే రైళ్లు ఉండేవి. ప్రస్తుతం మార్పు చేసిన సమయంతో..ఆ ట్రెయిన్లు దొరకట్లేదు. ముఖ్యంగా శాతవాహన, గోల్కొండ, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..అందట్లేదని వాపోతున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. రైల్వే అధికారులు చర్యలు చేపట్టి, పాత సమయంలోనే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలును కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. మార్చి దాకా ఇంతేనా? డోర్నకల్ సమీపంలో రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 2020 మార్చి వరకు అని భావిస్తున్నారు. అయితే..మే వరకు కూడా పనులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రయాణీకుల ఇబ్బందులు సింగరేణి కార్మికులు ఉండే ప్రాంతాలను కలుపుతూ నడిచే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను ఈ ఏడాది మార్చి 26న రద్దు చేశారు. దీని స్థానంలో పుష్పుల్ రైలును వేశారు. అందులో టాయిలెట్లు లేక, సామగ్రి పెట్టుకునే ఏర్పాట్లు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు చేసిన పోరాటాలు, రైల్వే అధికారులకు ఇచ్చిన వినతుల ఫలితంగా మళ్లీ గత అక్టోబర్ 8వ తేదీన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను అధికారులు పున:ప్రారంభించారు. తాజాగా గంట ఆలస్యం ఆంక్షలతో ప్రయాణికులు మళ్లీ మదన పడుతున్నారు. ఇతర రైళ్లను సరైన సమయంలో అందుకోలేకపోతున్నామని అంటున్నారు. రైల్వే ట్రాక్ పనులతో ఆలస్యం.. డోర్నకల్ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రైల్వే ట్రాక్ పనుల వలన సింగరేణి ప్యాసింజర్ గంట ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైం షెడ్యూల్ 2020 మార్చి వరకు కొనసాగనుంది. అయితే ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు కొనసాగించమంటే..అదే షెడ్యూల్‌ను కొనసాగిస్తాం. – కనకరాజు, రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కొత్తగూడెం ఇబ్బంది పడుతున్నాం.. సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ప్రయాణ సమయాన్ని గంట లేటు చేయడంతో మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో తెల్లవారుజామున 5:45కు బయల్దేరినప్పుడు సరైన టైంకు చేరేవాళ్లం. ఇప్పుడు అలా వెళ్లలేకపోతున్నాం. – బొల్లం రమేష్, ప్రయాణికుడు చాలా క్రాసింగ్‌లు పెట్టారు.. రైల్వే అధికారులు చేసిన మార్పుల వలన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌కు చాలా క్రాసింగ్‌లు ఎదురవుతున్నాయి. సింగరేణి రైలును ఆపి, ఎదురుగా వచ్చే ఇతర ట్రెయిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డోర్నకల్‌లో ఇతర రైళ్లను అందుకోలేకపోతున్నాం. – రఘు, ప్రయాణికుడు -
వైరల్ : ప్రాణాలు కాపాడుతానంటున్న యమరాజు
ముంబయి : సాధారణంగా మన ప్రాణాలను హరించేందుకు యముడి రూపంలో వస్తాడని మన పురాణాలు చెబుతుంటాయి. కానీ అదే యముడు ప్రాణాలు కాపాడడానికి వస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాల భారీన పడుతున్న వారికి అవగాహన కల్పించడానికి పశ్చిమ రైల్వే విభాగం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వ్యక్తికి యముని వేషదారణ వేసి రైల్వే ట్రాక్ దాటుతున్న కొంతమందిని ఎత్తుకొని ప్లాట్పామ్ మీదకు తీసుకువచ్చి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. పశ్చిమ రైల్వే విభాగం చేసిన వినూత్న ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 'తరచూ రైల్వే పట్టాలు దాటుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిన విషయమే. వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక మీదట ఎవరు ప్రమాదాల భారీన పడకుండా సబ్వే లేదా రైల్వే బ్రిడ్జిని ఉపయోగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తామని' పశ్చిమ రైల్వే విభాగం ట్విటర్లో పేర్కొంది. 'ప్రయాణికులు ప్రమాదాల భారీన పడకుండా పశ్చిమ రైల్వే విభాగం చేస్తున్న వినూత్న కార్యక్రమం చాలా బాగుంది అంటూ' నెటిజన్లు తమ సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల భారీన పడకుండా కాపాడుతున్న యమరాజు రూపంలో ఉన్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. అయితే గతంలోనూ బెంగుళూరు, గుర్గావ్ నగరాల్లో ప్రయాణికులకు రోడ్ సేప్టీ అవేర్నెస్ కల్పించడానికి ఆయా రాష్ట్రాల ట్రాపిక్ విభాగం ఇలాంటి వినూత్న కార్యక్రమాలనే చేపట్టింది. This Yamraj ji saves lives. He catches people who are endangering their lives by trespassing the railway tracks, but to save them. This Yamraj picks people to release them safely. Please do NOT cross tracks, it's dangerous. pic.twitter.com/PT81eYVajL — Western Railway (@WesternRly) 7 November 2019 -
‘ట్రాక్’లోకి వచ్చేదెలా.!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ కొన్నేళ్లుగా సర్వీసు రోడ్ల పనులు నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాల అవస్థలు పడుతున్నారు. ఫలితంగా రెండు, మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 2012లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదుల నాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ సమీపంలో ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో నరకం చూస్తున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అప్పటి కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినా పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం.. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం.–సిద్దూ, ఘట్కేసర్ వాసి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి మేడ్చల్ మండల పరిధిలో సుతారిగూడ నుంచి గౌడవెళ్ళి వరకు సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పాత జంక్షన్ సుతారిగూడ వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలిపెట్టారు. గౌడవెళ్ళి వద్ద రైల్వె ట్రాక్ ఉండటంతో అండర్‌పాస్ బ్రిడ్జి లేకపోవడంతో ఔటర్ ప్రయాణికులు గౌడవెళ్ళి మీదుగా మూడు కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ చౌరస్తా నుంచి దుండిగల్ వైపు వెళ్ళాల్సి వస్తోంది. సమస్యను రైల్వే అధికారులు, హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –సురేందర్ ముదిరాజ్, గౌడవెళ్లి సర్పంచ్ నిలిచిన సర్వీస్ రోడ్డు పనులు శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు రోడ్డులో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు నిలిచి పోవడంతో వాహదారులు హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండా వెళ్లాల్సి వస్తోంది. వయా యంనంపేట్ ఘట్కేసర్: కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం మీదుగా ఘట్కేసర్ బైపాస్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి వస్తోంది. 3.5 కి.మీ. నరకం మేడ్చల్: గౌడవెళ్లి రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ఔటర్‌రింగు రోడ్డు సర్వీసు అసంపూర్తిగా ఉండటంతో సర్వీసు రోడ్డులో వెళుతున్న వాహనదారులు 3.5 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్ళి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్ళి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల ఇదే పరిస్థితి. పొలాలకు వెళ్లేందుకు దారి లేదు.. ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ చుట్టు తిరిగి రావాల్సి వస్తోంది. -
రైలు పట్టాలపైనే టెంట్ వేసి ఆందోళన
ఢిల్లీ/రాజస్థాన్ : రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపింది. గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో 15 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, మరో అయిదు రైళ్లను దారి మళ్లించింది. రాజస్థాన్ ప్రభుత్వం అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గుజ్జర్లు రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ గుజ్జర్లు నిన్నటి నుంచి సవాయి మాదోపూర్ జిల్లాలో మలర్నా దుంగార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌లపై టెంట్లు వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రద్దు అయ్యాయి. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాల వారికి 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ సర్కార్‌కు ఇరవై రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు. -
బుల్లెట్ ట్రైన్‌నూ ఇలాగే నడిపిస్తారా..?
సాక్షి, ముంబై : చినుకు పడితే రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచి రైలు సర్వీసులకు బ్రేక్ పడుతుండటంపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ముంబై నగరంలో ఇటీవల వరదలతో రైల్వే ట్రాక్‌లపైకి నీరు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు రద్దయిన క్రమంలో ప్రయాణీకుల ఇబ్బందులను ప్రస్తావించింది. నీటిలో మునిగిన ట్రాక్‌లపైనా రైళ్లు నడిచే సాంకేతికత అంతర్జాతీయంగా అందుబాటులో ఉందా..?..త్వరలో నిర్మించే బుల్లెట్ ట్రైన్‌ను వరద నీటిలో నడిపిస్తారా..? అంటూ హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత స్మితా మయాంక్ ధ్రువ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ నరేష్ పాటిల్, జస్టిస్ గిరీష్ కులకర్ణిలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వరదలతో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. పశ్చిమ, మధ్య రైల్వే జనరల్ మేనేజర్ల భేటీ త్వరలో జరుగుతుందని, ఈ సమావేశంలో రైల్వే బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఫ్లాట్‌ఫాం ఎత్తు, మహిళల భద్రత వంటి పలు అంశాలపై చర్చిస్తారని కేంద్రం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇటీవల అంథేరి బ్రిడ్జి కూలిన అంశాన్ని ప్రస్తావించిన బెంచ్ అన్ని బ్రిడ్జిల స్థితిగతులపై రైల్వేలు తక్షణమే వ్యవస్ధాగత ఆడిట్ నిర్వహించాలని కోరింది. -
మెట్రో ట్రాక్‌పై నడిచిన మహిళ
సాక్షి, న్యూఢిల్లీ : స్టేషన్లలో పౌరుల భద్రతకు, ఆత్మహత్యలను నిరోధించేందుకు ఢిల్లీ మెట్రో అధికారులు పలు చర్యలు చేపడుతున్నా ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా పలు స్టేషన్లకు మెట్రో ట్రాక్‌లపైనే నడిచి వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. నోయిడా సెక్టార్ 15 మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 16 మెట్రో స్టేషన్‌కు ట్రాక్‌పై నుంచి మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఆమె మెట్రోలో వెళ్లకుండా ట్రాక్‌ల పైనుంచి వెళ్లడం గమనార్హం. మహిళ ట్రాక్‌లపై నడవడాన్ని గుర్తించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారులు ఇరు స్టేషన్ల మధ్య రైళ్లను నిలిపివేశారు. ట్రాక్‌పై నడుస్తున్న మహిళను స్ధానికులు వారించినా ఆమె వినిపించుకోకపోవడం గమనార్హం.మెట్రో స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలామ వ్యవహరించారని భావిస్తున్నారు. ట్రాక్‌పై నడుస్తున్న మహిళను అధికారులకు డీఎంఆర్‌ఆసీ అప్పగించింది. -
దొంగలు బాబోయ్ దొంగలు..
న్యూఢిల్లీ : రైల్వే సమాన్ల దొంగతనం జరగడం కొత్తకాకపోయిన చోరికి గురౌతున్న వస్తువుల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకు ముందు రైలు పట్టాలను ఎత్తుకెళ్లెవారు. ప్రస్తుతం బాత్రూంలో ఉన్న సమాన్లను కూడా దొంగలు వదలట్లేదని రైల్వే అధికారులు వాపోతున్నారు. బాత్రూంలో ఉండే మగ్గులు, వాష్బెసిన్లు, బోగిలో ఫ్యాన్లను చోరి చేస్తున్నారని అధికారులు తెలిపారు. కిటికిలకు ఉండే ఇనుప కడ్డీలు, పట్టాలు ఎక్కువగా చోరి అవుతున్నట్టు వెల్లడించారు. 2017-18 సంవత్సరానికి గాను చోరి అయిన దాదాపు రూ. 2.97 కోట్ల విలువైన వస్తువులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. దీనికి రెండింతలు గత సంవత్సరం స్వాధీనం చేసుకున్నట్టు తెలపారు. కొన్ని సార్లు ప్రయాణికులు సీట్ల నారను, మగ్గులను వారి బ్యాగులలో తీసుకెళ్లడం తాము గమనిస్తామని, అవి సాధారణంగా జరిగేవే. కానీ రైలు పట్టాల చోరీ మాత్రం భారీ రైలు ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు. దొంగలు ఎక్కువగా రైలు పట్టాలు, ఫిష్ ప్లేట్స్, వాష్ బెసిన్, అద్దాలు, ట్యాబులు, కేబుల్స్, సోలార్ ప్లేట్స్, టెలిఫోన్లు, బ్యాటరీలు, ఫ్యాన్లు, స్విచ్‌లను లక్ష్యంగా చేసుకుని దొంతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. 2016-17 సంవత్సరానికి గాను 5,219 దొంగతనం కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి 5,458 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. 2017-18 గాను 5,239 కేసులు నమోదు అయ్యాయి. ఆర్పీఎఫ్ సిబ్బంది కొరత వల్లే దొంగతనాలను అరికట్టలేకపోతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 74,456 మందికి గాను కేవలం 67,000 మంది సిబ్బందే ఉన్నట్టు తెలిపారు. వారిలో ఎక్కువ శాతం పోలీసు స్టేషన్లకే పరిమితమవ్వడం వల్ల యాంటీ తెఫ్ట్ డ్రైలను నిర్వహించలేక పోతున్నామని అన్నారు. -
రైలు పట్టాలపై సిమెంట్ బ్రిక్స్
రైల్వేగేట్ : రైలు పట్టాల మధ్య సిమెంట్ బ్రిక్స్ పెట్టిన సంఘటనపై బుధవారం రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల15న ఉదయం 11.25 గంటల సమయంలో చింతలపల్లి, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య 386/25–23 అప్‌లైన్ మైలు రాయివద్ద ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు 10 నుంచి 15 కిలోల బరువున్న సిమెంట్ బ్రిక్స్ పెట్టారు. అదే సమయంలో గుంటూర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201) వస్తుంది. ఈ క్రమంలో రైలును కాసేపు నిలిపారు. అనంతరం బ్రిక్స్ తొలగించాక రైలు కదిలింది. ఈ సంఘటనపై బుధవారం రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్‌ల మధ్య సిమెంట్ బ్రిక్స్పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం, సిబ్బంది ఉన్నారు. -
రైల్వే ట్రాక్ ఎక్కితే ఏనుగైనా పీనుగే
బరంపురం : రాష్ట్రంలో మూగజీవాలకు రక్షణ లేకుండా పోతోంది. రైల్వేట్రాక్‌లపై గజరాజులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జంతు ప్రేమికులు, రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో గల రైల్వే ట్రాక్‌పై వివిధ ప్రాంతాల్లో గత 7 ఏళ్లలో జరిగిన దుర్ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 22 ఏనుగులు మృతి చెందిన సంఘటనలు జంతు ప్రేమికులను కలిచివేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఝార్సుగుడ జిల్లాలోని బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ముఖ్యంగా ఏనుగుల రక్షణపై చేపట్టవలసిన చర్యలపై భారత రైల్వే విభాగం, అటవీ శాఖ, వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 2011 నుంచి 2018 ఏప్రిల్ వరకు 7 ఏళ్లలో 22 ఏనుగులు దుర్మరణం చెందాయి. 2012–2013 మధ్య కేవుంజర్ జిల్లా పరిధి చంపువా అటవీ రేంజ్లో గల రైల్వే ట్రాక్‌పై రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 5 ఏనుగులు మృతిచెందాయి. ఇదేవిధంగా 2012 డిసెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి గంజాం జిల్లా కళ్లికోట్ అటవీ రేంజ్ రంబా జంగిల్ పరిధిలో గల సుబలియా రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో 6 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించి కేంద్ర వన్యప్రాణుల సంరక్షణ విభాగం, కేంద్ర అటవీ విభాగం అధికారులతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ సభ్యులు ఏనుగులు మృతి చెందిన సంఘటన స్థలాలకు వచ్చి పరిశీలించి ప్రత్యేకంగా అరా తీసి కేంద్రానికి నివేదిక అందజేశారు. మూణ్ణాళ్ల ముచ్చటగా రక్షణ చర్యలు అనంతరం కేంద్రం ఆదేశంతో ఒడిశా రాష్ట్రం రైల్వే ట్రాక్ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల రక్షణ కోసం పలు విధాలా చర్యలు చేపట్టారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో గల రైల్వేట్రాక్‌పై వెళ్లే రైళ్లు 20 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడపాలని కేంద్ర రైల్వే విభాగం అదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అటవీ శాఖ, వన్యపాణ సంరక్షణ విభాగం, రైల్వే అధికారులు అప్రమత్తమై సాయంత్రం 6గంటల నుంచి (రాత్రంతా) ఉదయం 5గంటల వరకు రంబా సుబలియా రైల్వే లైన్ వచ్చేసరికి సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి పోయే ట్రైన్ల స్పీడ్ తగ్గించారు. ఇరువైపులా ట్రైన్లు 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే నడిచేవి. కొన్నాళ్ల తరువాత రక్షణ చర్యలు అటకెక్కాయి. తాజాగా దుర్ఘటనలు గత 2016–17 మధ్య ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో 7 ఏనుగులు మృతి చెందగా 2018 ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఝార్సుగుడ జిల్లా బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్‌పై తాజాగా రైలు ఢీకొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది రాష్ట్రంలో రైల్వే ట్రాక్‌లపై ఏనుగుల దుర్మరణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి ఏనుగులకు రక్షణ కల్పించాలి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై తక్కువ వేగంతో రైళ్లు నడిపించాలి. ఇదే విధంగా అయా ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ వైర్లు అమర్చాలి. రైలు వచ్చిన సమయంలో ఈ సోలార్ విద్యుత్ వైబ్రేషన్ వచ్చేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న రైల్వేట్రాక్ సైడ్లలో రైళ్లు స్లోగా నడపాలని సూచన బోర్డులు అమర్చాలి. ముఖ్యంగా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వన్యపాణి సంరక్షణ అధికారులు, అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు సయుక్తంగా అయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరపాలని జంతు ప్రేమికులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
లైన్లు రెడీ...రైళ్లేవీ?
ఎంఎంటీఎస్ రెండో దశను నిధుల గండం వెంటాడుతోంది. లైన్లు సిద్ధమైనప్పటికీ కొత్త రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం మార్గంలో కొద్ది రోజుల క్రితమే రైల్వే భద్రతా కమిషన్ తనిఖీలు నిర్వహించింది. రైళ్లు నడిపేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అనుమతులు కూడా ఇచ్చేసింది. కానీ కొత్త లైన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు బోగీలు మాత్రం లేవు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండాఉండిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం గత బడ్జెట్లో తమ వంతు వాటాగా రూ.430 కోట్లు కేటాయించినా..ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో రెండో దశ రూట్లలో రైళ్లు పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో రైల్వే లైన్ల పనులు పూర్తయినప్పటకీ రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్నాయి. ఒక్క 12.5 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్–బొల్లారం లైన్లు మాత్రమే కాకుండా 14 కిలోమీటర్ల పొడవైన మౌలాలి–ఘట్కేసర్, మరో 10 కిలోమీటర్ల పొడవైన పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా మార్గాల్లో పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా రైళ్ల కొనుగోళ్లు, స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల్లో జాప్యంనెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి... నగర శివార్లను కలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు మొదటి నుంచి నిధులు కేటాయించడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సకాలంలో నిధులు అందజేయకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ సంయుక్త ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన మూడు వంతుల నిధులను అందజేయాల్సి ఉంది. మరో 1/4 వంతు నిధులను రైల్వేశాఖ కేటాయిస్తుంది. సుమారు రూ.630 కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నుంచి అందాల్సి ఉండగా ఇప్పటి వరకు దశల వారీగా రూ.200 కోట్ల వరకే అందజేశారు. వీటితో పాటు, రైల్వేశాఖ నిధులతో కొన్ని లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్ వంటి పనులు పూర్తయ్యాయి. మిగతా పనుల్లో నిధుల కొరత తలెత్తింది. సకాలంలో ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి రైల్వేకు అందాల్సిన నిధులను రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని కలిశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు ఇవ్వాల్సిన సుమారు రూ.430 కోట్ల నిధులను అందజేయాల్సిందిగా కోరారు. అలాగే చర్లపల్లి టర్మినల్ కోసం భూమిని కేటాయించాలని, అప్రోచ్ రోడ్డు వేయించాలని కోరారు. నిధులొస్తేనే రైళ్లు.... ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్న సికింద్రాబాద్–బొల్లారం మార్గంలో ప్రతి రోజు కనీసం 20 ట్రిప్పులు నడపాలన్నా ఒక ట్రిప్పుకు 3 బోగీల చొప్పున 15 అవసరమవుతాయి. అలాగే సికింద్రాబాద్ –ఘట్కేసర్, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపాలంటే కొత్తబోగీలు అవసరమే. మొత్తంగా ఎంఎంటీఎస్ రెండో దశ మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ఇంజన్లు, బోగీల కోసం కనీసం రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులు అందజేస్తే తప్ప కొత్త బోగీలు కొనే పరిస్థితి లేదని, రైల్వేశాఖ తన వంతు నిధులను ఇప్పటికే పూర్తిగా ఖర్చు చేసిందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రైల్వే ఉన్నతాధికారులు జరిపిన సంప్రదింపుల్లో ఎంఎంటీఎస్ రెండో దశతో పాటు చర్లపల్లి టర్మినల్‌పై చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.80 కోట్లతో చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇక్కడ భూమి కొరత ఉంది. ఈ అంశంపైన అధికారులు చర్చలు జరిపారు. మరో టర్మినల్ కోసం సర్వే... చర్లపల్లితో పాటు రెండో టర్మినల్‌గా గతంలో వట్టినాగులపల్లిని ప్రతిపాదించారు. కానీ నగరానికి చాలా దూరంలో ఉన్న వట్టినాగులపల్లి కంటే సమీపంలో ఉండి ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఉండే మరో చోట రైల్వే టర్మినల్ కట్టించాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. నాగులపల్లి నుంచి నగరానికి రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. అలాగే రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పైగా రోడ్డు రవాణా మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపాదించిన హైటెక్‌సిటీ వద్ద కానీ లేదా భూమి లభ్యతను బట్టి మరో చోట కానీ టర్మినల్ నిర్మిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంయుక్త సర్వే చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.