
ఢిల్లీ: రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లలో 100కు పైగా జంతువులు మృతి చెందాయని మధ్యప్రదేశ్ అటవీ విభాగం ఓ నివేదికను రూపొందించింది. రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకులు వ్యర్థ ఆహారాన్ని రైలు పట్టాలపై పారేస్తుండడం వల్ల వాటిని తినడానికి వచ్చిన దాదాపు 100కు పైగా జంతువులు గత ఐదేళ్లలో మృతి చెందాయని పేర్కొంది. తాజాగా 12 పులులు చనిపోయాయని.. వాటిలో 5 పులులు, 7 చిరుతలు ఉన్నాయని తెలిపింది.
సెహోర్ జిల్లాలో ఉన్న రతపాని టైగర్ రిజర్వ్ స్టేషన్ వద్దే ఈ పులులు చనిపోయాయని నివేదికలో పేర్కొంది. ఈ అటవీ ప్రాంతం గుండా 20 కిలోమీటర్లు రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాలపై పడి ఉండే ఆహారం కోతులను, ఇతర జంతువులను ఆకర్షిస్తోందని, వాటి కోసం పులులు కూడా అక్కడకు వస్తున్నాయని తెలిపింది. అలా రైళ్ల కింద పడి చనిపోతున్నాయని తెలిపింది.
చదవండి: హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి
Comments
Please login to add a commentAdd a comment