Big Cat
-
కొమరం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలో పులి కలకలం
-
TS: మూడు జిల్లాలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్స్
సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: చలితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను పెద్దపులి కూడా వణికిస్తోంది. పులి దాడిలో ఓ రైతు మృతి చనిపోవడంతో కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని ఎనిమిది మండలాల ప్రజలను పులుల కదలికలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వాటిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. గురువారం దాదాపు పన్నెండు గంటలపాటు పులి సంచారించిందన్న ప్రచారం.. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ పహారా కాస్తున్నారు. బయటకి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చివరి సారిగా పులి జాడ తెలియగా.. టౌన్ దాటి పెద్ద వాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఆ పులే కాగజ్ నగర్లోనూ సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక.. కాలి ముద్రల ఆధారంగా పులి ఆనవాలును నిర్ధారించుకునే యత్నం చేస్తున్నారు. ఇక పులి సంచారంతో స్థానికులు భయం భయంగా గడిపారు. తలుపులు తీయడానికే జనం వణికిపోతున్నారు. మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను ఇప్పుడు మ్యాన్ ఈటర్స్ వణికిస్తున్నాయి. తొలుత మ్యాన్ ఈటర్స్ కాదని అధికారులు ప్రకటించినా.. ఖానాపూర్ రైతు మరణంతో ఆ భయం రెట్టింపు అయ్యింది. మరోవైపు అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోకారి దారిలో పులి కలకలం రేగింది. రోడ్డు దాటుతూ వాహనదారులకు పులి కనిపించిందన్న ప్రచారంతో అక్కడా భయం నెలకొంది. మైక్‌ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. దహేగాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పులి పంజా విసిరినట్లు తెలుస్తోంది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. తీవ్ర యత్నం అటవీ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తమ ప్రయత్నం గురించి అధికారులు వివరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించారు. కోల్‌బెల్ట్‌లోనూ ప్రచారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోనూ పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. విషయం దృష్టికి రావడంతో.. శ్రీరాంపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించలేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇదీ చదవండి: దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా? -
పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్
కొన్ని వీడియోలు చూడగానే ఆకట్టుకుంటాయి.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. ప్రమాదకరమైన జంతువుల చేతిలో చిక్కినప్పుడు వీడియోలో ఉన్న వ్యక్తులు వాటి నుంచి తప్పించుకున్నారా లేదా అనేది ఆసక్తిగా చూస్తుంటాం. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో అన్న టెన్షన్ నెలకొనడం ఖాయం. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో అలాంటి కోవకు చెందినదే. విషయంలోకి వెళితే.. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది పాత వీడియోనే అయినా.. ఐఎఫ్ఎస్ అధికారి సుషాంత్ నంద దీనిని మరోసారి పంచుకున్నారు. ఒక వ్యక్తి కారిడార్ నుంచి వేగంగా పరిగెత్తుతూ వస్తుండడంతో వీడియో మొదలవుతుంది. అతను అలా ఎందుకు పరిగెడుతున్నాడో అర్థమయ్యేలోపే వెనుక నుంచి ఒక చిరుతపులి అతన్న తరుముతూ వచ్చింది. కొద్ది సెకన్ల గ్యాప్‌లో అతను తప్పించుకోగా.. చిరుత పులి పంజా దెబ్బ గోడకు బలంగా తాకింది. ఒక్కనిమిషం ఆలస్యమయినా ఆ వ్యక్తి చచ్చేవాడే. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలియరాలేదు. చూస్తుంటేనే భయం పుట్టిస్తున్న ఈ వీడియో మరోసారి హల్చల్గా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే 18వేల వ్యూస్ రావడం విశేషం. '' ఇంతకు ఆ మనిషి ఏమయ్యాడు.. పులి చేతిలో చచ్చాడా.. లేక బతికి బట్టకట్టాడా.. ప్లీజ్ ఎవరైనా చెప్పండి.. ఈ ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నాం.. పాపం చిరుత దెబ్బకు వ్యక్తి ప్యాంటు తడిసిపోయి ఉంటుంది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. చదవండి: నర్సు నిర్వాకం, ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్.. వీడియో వైరల్ వైరల్: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి That was close pic.twitter.com/sSQHpcEXlP — Susanta Nanda IFS (@susantananda3) June 24, 2021 -
రైలు పట్టాలపై ఆహారం.. 12 పులులు మృతి!
ఢిల్లీ: రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లలో 100కు పైగా జంతువులు మృతి చెందాయని మధ్యప్రదేశ్ అటవీ విభాగం ఓ నివేదికను రూపొందించింది. రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకులు వ్యర్థ ఆహారాన్ని రైలు పట్టాలపై పారేస్తుండడం వల్ల వాటిని తినడానికి వచ్చిన దాదాపు 100కు పైగా జంతువులు గత ఐదేళ్లలో మృతి చెందాయని పేర్కొంది. తాజాగా 12 పులులు చనిపోయాయని.. వాటిలో 5 పులులు, 7 చిరుతలు ఉన్నాయని తెలిపింది. సెహోర్ జిల్లాలో ఉన్న రతపాని టైగర్ రిజర్వ్ స్టేషన్ వద్దే ఈ పులులు చనిపోయాయని నివేదికలో పేర్కొంది. ఈ అటవీ ప్రాంతం గుండా 20 కిలోమీటర్లు రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాలపై పడి ఉండే ఆహారం కోతులను, ఇతర జంతువులను ఆకర్షిస్తోందని, వాటి కోసం పులులు కూడా అక్కడకు వస్తున్నాయని తెలిపింది. అలా రైళ్ల కింద పడి చనిపోతున్నాయని తెలిపింది. చదవండి: హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి -
మున్నాగారి పేరు మొహం మీదే ఉంది..
మధ్యప్రదేశ్: చిత్రంలోని రాయల్ బెంగాల్ టైగర్ పేరు మున్నా.. దాని మొహం మీద చూడండి. ఏమని ఉందో? క్యాట్ అని.. పులులు, సింహాలు, చిరుతలు బిగ్ క్యాట్ జాబితాలోకి వస్తాయి. ఈ పులి మొహం మీద ఉండే చారలు ఇలా క్యాట్ అనే పేరును సూచిస్తుండటంతో ఇదో సెలబ్రిటీగా మారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులో ఉండే మున్నాను క్లిక్‌మనిపించడానికి పర్యాటకులు పోటీ పడుతుంటారు.