Watch Terrifying Video Leopard Chases Man Down Corridor, Video Goes Viral - Sakshi
Sakshi News home page

పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్‌ 

Published Fri, Jun 25 2021 6:18 PM | Last Updated on Fri, Jun 25 2021 6:52 PM

Watch Terrifying Video Big Cat Chases Man At House Corridor Viral - Sakshi

కొన్ని వీడియోలు చూడగానే ఆకట్టుకుంటాయి.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. ప్రమాదకరమైన జంతువుల చేతిలో చిక్కినప్పుడు వీడియోలో ఉన్న వ్యక్తులు వాటి నుంచి తప్పించుకున్నారా లేదా అనేది ఆసక్తిగా చూస్తుంటాం. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో అన్న టెన్షన్‌ నెలకొనడం ఖాయం. తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియో అలాంటి కోవకు చెందినదే.

విషయంలోకి వెళితే.. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది పాత వీడియోనే అయినా.. ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుషాంత్‌ నంద దీనిని మరోసారి పంచుకున్నారు. ఒక వ్యక్తి కారిడార్‌ నుంచి వేగంగా పరిగెత్తుతూ వస్తుండడంతో వీడియో మొదలవుతుంది. అతను అలా ఎందుకు పరిగెడుతున్నాడో అర్థమయ్యేలోపే వెనుక నుంచి ఒక చిరుతపులి అతన్న తరుముతూ వచ్చింది. కొద్ది సెకన్ల గ్యాప్‌లో అతను తప్పించుకోగా.. చిరుత పులి పంజా దెబ్బ గోడకు బలంగా తాకింది. ఒక్కనిమిషం ఆలస్యమయినా ఆ వ్యక్తి చచ్చేవాడే. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలియరాలేదు. చూస్తుంటేనే భయం పుట్టిస్తున్న ఈ వీడియో మరోసారి హల్‌చల్‌గా మారింది.

సోషల్‌ మీడియాలో​ షేర్‌ చేసిన కాసేపటికే 18వేల వ్యూస్‌ రావడం విశేషం. '' ఇంతకు ఆ మనిషి ఏమయ్యాడు.. పులి చేతిలో చచ్చాడా.. లేక బతికి బట్టకట్టాడా.. ప్లీజ్‌ ఎవరైనా చెప్పండి.. ఈ ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నాం.. పాపం చిరుత దెబ్బకు వ్యక్తి ప్యాంటు తడిసిపోయి ఉంటుంది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

చదవండి: నర్సు నిర్వాకం, ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్‌.. వీడియో వైరల్‌

వైరల్‌: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement