
రైలు పట్టాలను ఇష్టారాజ్యంగా దాటడం, పట్టాలపై రాకపోకలు సాగించడం ప్రమాదమని తెలిసినా... గమ్యానికి చేరుకోవాలన్న ఆత్రుత, రైలు ఇప్పుడే రాదులే అన్న నిర్లక్ష్యంతో పట్టాలు దాటుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతున్న వార్తలు వినిపిస్తున్నా మార్పు కనిపించడం లేదు.




























