
ఆత్మహత్యకు పాల్పడేందుకు మెట్రో ట్రాక్‌పై నడుస్తున్న మహిళ
సాక్షి, న్యూఢిల్లీ : స్టేషన్లలో పౌరుల భద్రతకు, ఆత్మహత్యలను నిరోధించేందుకు ఢిల్లీ మెట్రో అధికారులు పలు చర్యలు చేపడుతున్నా ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా పలు స్టేషన్‌లకు మెట్రో ట్రాక్‌లపైనే నడిచి వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. నోయిడా సెక్టార్ 15 మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 16 మెట్రో స్టేషన్‌కు ట్రాక్‌పై నుంచి మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఆమె మెట్రోలో వెళ్లకుండా ట్రాక్‌ల పైనుంచి వెళ్లడం గమనార్హం.
మహిళ ట్రాక్‌లపై నడవడాన్ని గుర్తించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అధికారులు ఇరు స్టేషన్ల మధ్య రైళ్లను నిలిపివేశారు. ట్రాక్‌పై నడుస్తున్న మహిళను స్ధానికులు వారించినా ఆమె వినిపించుకోకపోవడం గమనార్హం.మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలామ వ్యవహరించారని భావిస్తున్నారు. ట్రాక్‌పై నడుస్తున్న మహిళను అధికారులకు డీఎంఆర్‌ఆసీ అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment