ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్‌తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు.
ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా.
ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్‌తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు.
ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది.
టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్‌ను టోనీకి సర్‌ప్రైజ్‌గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment