audi car gift
-
అందాల చిన్నది లగ్జరీ కారు: ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్ చూడాలి!
సాక్షి, ముంబై: బాలనటి, టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. రివా అరోరా (13)రూ. 44 లక్షల విలువైన ఆడి కారును సొంతం చేసుకుంది. ఈమేరకు బ్లాక్ ఆడి కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ('డ్రైవింగ్ లైసెన్స్ బనా హై?') అంటూ మరి కొంతమంది ప్రశ్నించారు. రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తల్లి నిషా ఆమెకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చింది. 44 లక్షలకు పైగా విలువైన బ్లాక్ ఆడి క్యూ3 కారుతో ఫోజులిస్తూ రివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను తమ ప్యాన్స్‌తో పంచుకుంది. కొంచెం ఆలస్యమైనాగానీ, మొత్తానికి సెలబ్రేట్ చేసుకుంటున్నా..ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. 10.6 మిలియన్ ఇన్‌స్టా ఫ్యామిలీ ఎంతో అపురూపమైన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో లైసెన్స్ ఉందా ముందు లైసెన్స్ తీసుకో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. రివా అరోరా ఎవరంటే? రివా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాదు మామ్, మణికర్ణిక, మర్ద్ కో దర్ద్ నహీ హోతా, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ది సర్జికల్ స్ట్రైక్ , గుంజన్ సక్సేనాలో నటించింది. ఆమె చివరిగా రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతో ఆకట్టుకుంది. కాగా మికా సింగ్, కరణ్ కుంద్రాలతో రొమాంటిక్ రీల్ చేయడంపై చిన్నపిల్లతో డ్యాన్సులా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. 2010లో పుట్టిందని భావిస్తున్న రివా వయసుపై వివాదం ఉంది. అయితే తన వయసు 12 కాదంటూ రివా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే రివా వయసు 12 కాదు 16 ఏళ్ల అని నిషా తల్లి ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) -
సాహసం చేసి ప్రాణం కాపాడాడు.. అడి కార్ అందుకున్నాడు
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్‌తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా. ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్‌తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది. టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్‌ను టోనీకి సర్ప్రైజ్గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది. -
టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్
టీమిండియా సెమీస్ దశలోనే ఓడిపోయినా, మన క్రికెటర్లకు మాత్రం బహుమతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే స్పాన్సరర్లు, లేకపోతే అత్తవారు మనోళ్లకు గిఫ్టులు చదివిస్తున్నారు. తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు బంపర్ లాటరీ తగిలింది. ఈనెల 17వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న జడేజాకు అతడి అత్తింటివాళ్లు దాదాపు కోటి రూపాయల విలువైన ఆడి కారు బహూకరించారు. రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె రివబా సోలంకితో జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వరుసగా బిజీ షెడ్యూలులో ఉండటంతో పెళ్లి ముహూర్తం మాత్రం కాస్తా ఆలస్యంగా పెట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన రివబా.. ప్రభుత్వోద్యోగం చేయాలని ఆశిస్తోందట. ఇందుకోసం సివిల్ సర్వీసుల పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జడేజా స్వగ్రామంతో పాటు రాజ్‌కోట్ నగరంలో కూడా మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఉంటాయి. ఈనెల 16న రాజ్‌కోట్‌లోని ఓ హోటల్లో తన తోటి క్రికెటర్లు, ఇతర ముఖ్య స్నేహితుల కోసం ఓ భారీ పార్టీ ఏర్పాటుచేశాడు. 17వ తేదీన అదే హోటల్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఆ హోటల్లోనే రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులను మాత్రమే పిలుస్తున్నారు. కొత్త దంపతులు 18వ తేదీన జడేజా స్వగ్రామమైన హడాతోడాకు వెళ్తారు. అక్కడ గ్రామస్తులతో కలిసి సంబరాలు ఉంటాయి. ఆరోజు సాయంత్రం ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ పెళ్లి వేడుకల నేపథ్యంలో ముందుగానే అత్తింటివాళ్లు అతగాడికి మంచి కారు బహూకరించారు. తనకు కాబోయే భార్యతో కలిసి సోమవారమే షోరూంకు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. హర్దేవ్ సింగ్ సోలంకి, ప్రఫుల్లబా సోలంకి దంపతుల ఏకైక కుమార్తె రివబా. హర్దేవ్కు రాజ్‌కోట్ జిల్లాలో రెండు స్కూళ్లు, మోర్బిలోని నవ్లఖి పోర్టులో వే బ్రిడ్జి, రాజ్‌కోట్ నగరంలో ఓ హోటల్ ఉన్నాయి. రివబా తల్లి రైల్వేశాఖలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తారు.