టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్ | Ravindra Jadeja gets audi car as gift from would be in laws | Sakshi
Sakshi News home page

టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్

Published Tue, Apr 5 2016 2:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్

టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్

టీమిండియా సెమీస్‌ దశలోనే ఓడిపోయినా, మన క్రికెటర్లకు మాత్రం బహుమతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే స్పాన్సరర్లు, లేకపోతే అత్తవారు మనోళ్లకు గిఫ్టులు చదివిస్తున్నారు. తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు బంపర్ లాటరీ తగిలింది. ఈనెల 17వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న జడేజాకు అతడి అత్తింటివాళ్లు దాదాపు కోటి రూపాయల విలువైన ఆడి కారు బహూకరించారు. రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె రివబా సోలంకితో జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వరుసగా బిజీ షెడ్యూలులో ఉండటంతో పెళ్లి ముహూర్తం మాత్రం కాస్తా ఆలస్యంగా పెట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన రివబా.. ప్రభుత్వోద్యోగం చేయాలని ఆశిస్తోందట. ఇందుకోసం సివిల్ సర్వీసుల పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

జడేజా స్వగ్రామంతో పాటు రాజ్‌కోట్ నగరంలో కూడా మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఉంటాయి. ఈనెల 16న రాజ్‌కోట్‌లోని ఓ హోటల్లో తన తోటి క్రికెటర్లు, ఇతర ముఖ్య స్నేహితుల కోసం ఓ భారీ పార్టీ ఏర్పాటుచేశాడు. 17వ తేదీన అదే హోటల్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఆ హోటల్లోనే రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులను మాత్రమే పిలుస్తున్నారు. కొత్త దంపతులు 18వ తేదీన జడేజా స్వగ్రామమైన హడాతోడాకు వెళ్తారు. అక్కడ గ్రామస్తులతో కలిసి సంబరాలు ఉంటాయి. ఆరోజు సాయంత్రం ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేశారు.

ఈ పెళ్లి వేడుకల నేపథ్యంలో ముందుగానే అత్తింటివాళ్లు అతగాడికి మంచి కారు బహూకరించారు. తనకు కాబోయే భార్యతో కలిసి సోమవారమే షోరూంకు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. హర్‌దేవ్‌ సింగ్ సోలంకి, ప్రఫుల్లబా సోలంకి దంపతుల ఏకైక కుమార్తె రివబా. హర్‌దేవ్‌కు రాజ్‌కోట్ జిల్లాలో రెండు స్కూళ్లు, మోర్బిలోని నవ్లఖి పోర్టులో వే బ్రిడ్జి, రాజ్‌కోట్‌ నగరంలో ఓ హోటల్ ఉన్నాయి. రివబా తల్లి రైల్వేశాఖలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement