team india all rounder
-
తొలి వన్డేలో 7 ఓవర్లలో 70.. రెండో మ్యాచ్‌లో 6-3-16-2
Hardik Pandya: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బంతితో విజృంభించాడు. 6 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (కాన్వే, సాంట్నర్) పడగొట్టాడు. హార్ధిక్ తన స్పెల్‌లో ఏకంగా 3 మెయిడిన్ ఓవర్లు సంధించడం విశేషం. హార్ధిక్‌తో పాటు షమీ (6-1-18-3), సిరాజ్ (6-1-10-1), శార్దూల్ (6-1-26-1), కుల్దీప్ (7.3-0-29-1), వాషింగ్టన్ సుందర్ (3-1-7-2) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో రెండో వన్డేలో భారత్.. న్యూజిలాండ్‌ను 108 పరుగులకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కాగా, తొలి వన్డేలో 7 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకుని చెత్తగా బౌలింగ్ చేసిన హార్ధిక్.. మరుసటి మ్యాచ్‌లోనే ఊహించని రీతిలో రికవర్ అయ్యి బౌలింగ్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హార్ధిక్ ఓ ఫైటర్ అంటూ తెగ మోసేస్తున్నారు. 6 ఓవర్లలో ఏకంగా 3 మెయిడిన్లు వేయడం అద్భుతమని కొనియాడుతున్నారు. నిజానికి హార్ధిక్ ఈ మ్యాచ్‌లో ఫ్రంట్ లైన్ పేసర్‌గా సత్తా చాటాడు. షమీ, సిరాజ్‌లతో పోటీ పడి మరీ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. రెండో వన్డేలో హార్ధిక్ ప్రదర్శన తర్వాత కొందరు భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మ్యాచ్‌లో విఫలమైతే దూషించడం, మరుసటి మ్యాచ్‌లో రాణిస్తే ఆకాశానికెత్తడం షరా మామూలుగా మారిందని కామెంట్లు పెడుతున్నారు. -
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొట్టిన త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో త్రీడీ ప్లేయర్‌గా పిలువబడే టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ అదరగొడుతున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేసిన శంకర్ (187 బంతుల్లో 112; 7 ఫోర్లు, సిక్సర్).. ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు మహారాష్ట్రపై 214 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 107 పరుగులు, అంతకుముందు ముంబైపై 174 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసిన శంకర్ వరుసగా మూడు సెంచరీలు చేసి రంజీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. 2019 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన శంకర్.. తాజా ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. భారత టెస్ట్ టీమ్‌లో ఎలాగూ హార్ధిక్ పాండ్యా ప్లేస్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై శంకర్ కన్నేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన శంకర్.. 2018-19 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడినప్పటికీ, ఆశించినంత ప్రభావం చూపలేక జట్టులో స్థానం కోల్పోయాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా నాటి భారత జట్టు ప్రధాన సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణిస్తూ టీమిండియాకు ఎంపిక చేశాడు. అప్పట్లో అంబటి రాయుడును తప్పించి శంకర్‌కు జట్టులోకి తీసుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. తనను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయకపోవడం పట్ల రాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. వరల్డ్‌కప్‌ను త్రీడీ కళ్లజోడుతో చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. రాయుడును కాదని నాడు జట్టులో వచ్చిన శంకర్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు. నాటి నుంచి జట్టుకు దూరంగా ఉన్న శంకర్ తాజాగా హ్యాట్రిక్ సెంచరీలు బాది తిరిగి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న అస్సాం తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 247 పరుగులు వెనుకపడి ఉంది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. శంకర్‌తో పాటు జగదీశన్ (125), ప్రదోశ్ పాల్ (153) శతకాలు బాదారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 266 పరుగులకే ఆలౌటైంది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఫలితంగా తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
జడేజా స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతడికి ఉంది: డేనియల్ వెట్టోరి
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా రవిచంద్రన్ అశ్విన్‌కు ఉందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌కు జడేజా దూరం కావడంతో ఆనూహ్యంగా అశ్విన్‌కు చోటు దక్కింది. కాగా వెటోరి ప్రస్తుతం భారత వేదికగా జరుగుతోన్న లెజెండ్స్‌లో లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో ది హిందూతో వెటోరి మాట్లాడుతూ.. "అశ్విన్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్. అతడు తన క్యారమ్ బల్స్తో బ్యాటర్లను మప్పుతిప్పలు పెట్టగలడు. అశ్విన్ ఈ ఏడాది ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణించాడు. కాబట్టి అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. అశ్విన్ టీ20 ప్రపంచకప్-2022లో భారత జట్టుకు కీలకం కానున్నాడు. అతడికి ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం చాలా ఉంది. ముఖ్యంగా జట్టులో రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయగలడు అని పేర్కొన్నాడు. చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు' -
జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఆసియా కప్‌లో హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్ సందర్భంగా జడ్డూ కుడి మోకాలి గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జడేజా గాయాన్ని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స అనివార్యమని సూచించారు. ఈ నేపథ్యంలో జడ్డూకు నిన్న సర్జజీ జరిగింది. శస్త్ర చికిత్స సక్సెస్ అయినట్లు జడేజానే స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సర్జరీ చేయించుకునే క్రమంలో తనకు చాలామంది మద్దతుగా నిలిచారని.. బీసీసీఐ, సహచరులు, సపోర్ట్ స్టాఫ్, ఫిజయోలు, డాక్టర్లు మరి ముఖ్యంగా అభిమానులు నా వెన్నంటే నిలిచారని జడ్డూ తెలిపాడు. త్వరలోనే కోలుకునే ప్రక్రియ మొదలుపెడతానని, సాధ్యమైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అంటూ సర్జరీ తర్వాతి ఫోటోను షేర్ చేస్తూ కామెంట్స్ జోడించాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) కాగా, గత కొంతకాలంగా జడేజా గాయాలతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాతి నుంచి జడ్డూ ఆడిన ప్రతి సిరీస్‌లోనూ ఏదో ఒక గాయం బారిన పడుతూ వస్తున్నాడు. గాయం కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా అర్ధంతరంగా వైదొలిగాడు. తాజాగా ఆసియా కప్‌లో కీలక దశ మ్యాచ్‌లకు ముందు గాయం తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం టీమిండియాపై భారీగా చూపింది. సరైన బౌలింగ్ ఆల్‌రౌండర్ లేక టీమిండియా ఆసియా కప్ బరిలో నుంచి దాదాపుగా వైదొలిగింది. పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో కాని, తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కాని జడేజా ఉండి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని భారత అభిమానులు భావిస్తున్నారు. అంతకుముందు గ్రూప్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతర్వాత హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ అన్ని విభాగాల్లో పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. గాయంతో జడేజా జట్టు నుంచి వైదొలగడంతో సూపర్-4 దశలో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో జడ్డూ టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికైనా కోలుకుని జట్టులో చేరాలని టీమిండియా అభిమానాలు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ఆసియాకప్‌లో విరాట్ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా! -
ప్రపంచ రికార్డుకు చేరువగా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా
టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా ముందు ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిస్తే ఒక రికార్డు.. సిరీస్ గెలిస్తే ఇంకో రికార్డు.. ఇలా అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. టీమిండియాలో మరెవరికి సాధ్యం కాని యునివర్సల్ రికార్డు దీపక్ హుడా పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. మరి ఆ యునివర్సల్ రికార్డు కథాకమీషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున అద్బుత ప్రదర్శన చేశాడు. అనంతరం బరోడా తరపున దేశవాలీ క్రికెట్లో దుమ్మురేపి ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఇక దీపక్ హుడా ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 9 టీ20లు, 5 వన్డేలు ఉండగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే విజయం కావడం విశేషం. దీంతో దీపక్ హుడా జట్టులో ఉంటే గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తూ విధ్వంసకర హిట్టింగ్తో టీమిండియాకు స్లాగ్ ఓవర్లలో భారీ స్కోర్లు అందించడమే గాక.. బౌలింగ్‌లోనూ ఆఫ్ స్పిన్నర్‌గా తన సేవలందిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం వరుసగా 14 మ్యాచ్‌ల్లో విజయాల్ని చూసిన భారత ఆటగాడు ఎవరూ లేరు. ఈ విషయంలో మాత్రం దీపక్ హుడా చరిత్ర సృష్టించాడు. అయితే.. ఓవరాల్‌గా మాత్రం ఈ రికార్డ్‌లో రొమానియాకి చెందిన సాత్విక్ నదిగొట్ల 15 మ్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు. సాత్విక్, దీపక్ హుడా తర్వాత దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ (13 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక శంతను వశిష్ట్ (రొమేనియా)-13 విజయాలు, కొల్లిస్ కింగ్ (వెస్టిండీస్)-12 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే దీపక్ హుడా వరుస 15 విజయాలతో రొమేనియా ఆటగాడు సాత్విక్ నదిగొట్టతో సంయుక్తంగా తొలిస్థానం పంచుకోనున్నాడు. ఒకవేళ రెండో వన్డేలోనూ టీమిండియా విజయం సాధించి సిరీస్ గెలిస్తే.. దీపక్ హుడా 16 వరుస విజయాలతో టాప్ స్థానాన్ని ఆక్రమించే అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. ఒకవేళ జింబాబ్వేపై సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ దీపక్ హుడా ఆడితే మాత్రం అతని విజయాల పరంపరకు బ్రేక్ పడనట్లే. మరి ఇది ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి. చదవండి: Kabaddi Game: కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు! -
కృనాల్ పాండ్యా వారసుడొచ్చాడు..
Krunal Pandya: టీమిండియా ఆల్‌రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ ఇవాళ (జులై 24) మధ్యాహ్నం ట్విటర్ వేదికగా రివీల్ చేశాడు. భార్య పంఖురి చేతిలో ఒదిగిన బిడ్డను ముద్దాడుతూ దిగిన ఫోటోను కృనాల్ ట్విటర్లో షేర్ చేశాడు. కవిర్ కృనాల్ పాండ్యా అంటూ ఫోటోకు క్యాప్షన్‌ను జోడించాడు. Kavir Krunal Pandya 🌎💙👶🏻 pic.twitter.com/uitt6bw1Uo — Krunal Pandya (@krunalpandya24) July 24, 2022 విషయం తెలుసుకున్న సన్నిహితులు, సహచరులు కృనాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే వైరలైంది. దీంతో అభిమానులు కూడా కృనాల్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కృనాల్ 2017లో ప్రముఖ మోడల్ పంఖురి శర్మను పెళ్లాడాడు. ఇదిలా ఉంటే, టీమిండియా తరఫున 19 టీ20లు, 5 వన్డేలు ఆడిన కృనాల్.. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు వలస వెళ్లాడు. అతను ఇటీవలే ఇంగ్లీష్ కౌంటీ జట్టైన వార్విక్షైర్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్యాటర్ అయిన కృనాల్.. వన్డే అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (26 బంతుల్లో) బాదడంతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..? -
ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్
టీమిండియా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్‌తో పాటు ఎన్సీఏ రిహాబిలిటేషన్‌లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..! -
రాజకీయాల్లోకి కపిల్ దేవ్..?
భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ (1983) అందించిన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ పొలిటికల్ ఎంట్రీపై గతకొంత కాలంగా వివిధ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై హర్యానా హరికేన్ స్పందించాడు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు రాజకీయాల పట్ల ఆసక్తే లేదని చెప్పుకొచ్చాడు. కొంతమంది ఇలా ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తుండటం బాధాకరమని అన్నాడు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని ఇన్‌స్టా వేదికగా స్పష్టం చేశాడు. కాగా, ఈ టీమిండియా మాజీ కెప్టెన్ పలువురు రాజకీయ నాయకులతో టచ్‌లో ఉన్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కపిల్ బీజేపీలో చేరుతున్నాడని కొందరు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నాడని మరికొందరు ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కపిల్ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పని కట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నారు. కపిల్ బీజేపీలో చేరి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు వెళ్తారని, అలాగే ఆప్‌లో చేరి హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. -
అతడు టీమిండియా లీడింగ్ ఆల్‌రౌండర్ అవుతాడు: రవిశాస్త్రి
IPL 2022- SRH Vs PBKS: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ క్రికెటర్, టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌పై భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని, అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతాడని కొనియాడాడు. తను ఆటను తేలికగా తీసుకోడని, సీరియస్ క్రికెటర్ అని కితాబిచ్చాడు. ఐపీఎల్-2022లో ఆఖరి లీగ్ మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. లీగ్ ముగింపు దశలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం(మే 22) పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులు చేశాడు. అదే విధంగా 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ టీమిండియా లీడింగ్ ఆల్రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు. భవిష్యత్తు ఆశాకిరణం అతడే. జడేజా ఫిట్‌గా ఉండి ఇంకొన్నేళ్లు ఆడగలిగినా.. అక్షర్ పటేల్ జట్టులో ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ ప్రీమియర్ ఆల్‌రౌండర్ అవుతాడు. అన్ని ఫార్మాట్లలోనూ తన మార్కు చూపిస్తాడు. అతడు సీరియస్ క్రికెటర్. యువకుడే అయినప్పటికీ ఆట పట్ల అతడికి ఉన్న అవగాహన అమోఘం. ముఖ్యంగా షాట్ సెలక్షన్ విషయంలో తను తానే సాటి. అయితే, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. రానున్న మూడేళ్లలో టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్ అవుతానని అద్దంలో చూసుకుంటూ తనను తాను చెప్పుకోగల అర్హత కలిగిన ఏకైక ఆటగాడు అతడు’’ అంటూ వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2022లో వాషింగ్టన్ సుందర్ సన్‌రైజర్స్ తరఫున ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 101 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 40. 8 ఇన్నింగ్స్‌లలో అతడు పడగొట్టిన వికెట్ల సంఖ్య 6. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చదవండి👉🏾IND Vs SA: డీకేను సెలక్ట్ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 70 as @PunjabKingsIPL end their campaign on a winning note. Win by 5 wickets in 15.1 overs. Scorecard - https://t.co/MmucFYpQoU #SRHvPBKS #TATAIPL pic.twitter.com/ujbQsZaUMz — IndianPremierLeague (@IPL) May 22, 2022 -
Noel David: దయనీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్.. భరోసా కల్పించిన హెచ్‌సీఏ
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ ఆల్‌రౌండర్ నోయెల్ డేవిడ్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా నోయెల్ ఆరోగ్యం గురించి వైద్యుల వద్ద ఆరా తీసిన అజహార్.. నోయెల్ కిడ్నీ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చునంతా హెచ్‌సీఏనే భరిస్తుందని భరోసా ఇచ్చాడు. Team India player was suffering in hospital for years, now Mohammad Azharuddin came forward to help, career was over after 4 matches! https://t.co/zucux7ioUR — News NCR (@NewsNCR2) February 28, 2022 అలాగే నోయెల్‌కు వ్యక్తిగత ఆర్ధిక సాయాన్ని కూడా చేస్తామని అజహార్ హామీ ఇచ్చాడు. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన 51 ఏళ్ల నోయెల్.. 1997లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా తరఫున 1997లో నాలుగు వన్డేలు ఆడిన నోయెల్.. బ్యాటింగ్‌లో తన సామర్ధ్యానికి తగ్గ ప్రదర్శన చేయనప్పటికీ, బౌలంగ్‌లో పర్వాలేదనిపించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్ -
IND Vs WI: 6వ స్థానానికి అతనిని మించిన మొనగాడు లేడు..
Jadeja Is No More Reckless Kid Says Dinesh Karthik: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ వికెట్‌కీపర్, ప్రముఖ వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలి కాలంలో జడేజా నమ్మకమైన ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడంటూ కితాబునిచ్చాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా, పర్ఫెక్ట్ ఫినిషర్‌గా, నాణ్యమైన బౌలర్‌గా, అంతకుమించి అద్భుతమైన ఫీల్డర్‌గా జట్టుకు సేవలందించడం ఇటీవలి కాలంలో మనందరం గమనించామంటూ కొనియాడాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో జడేజా లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్లో సైతం అతను అద్భుతాలు చేయడం చూశామన్నాడు. అతని సామర్థ్యం తెలిసి ధోని(ఐపీఎల్) అతనికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పిస్తే, ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడని గుర్తు చేశాడు. నంబర్ 6 స్థానం కోసం అతనికంటే పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్రికెటర్ ప్రస్తుత తరంలో లేడని ఆకాశానికెత్తాడు. గత ఐపీఎల్ సందర్భంగా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 37 పరుగులు పిండుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. గత కొద్ది సంవత్సరాలుగా బ్యాటర్‌గానే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న జడేజా.. ఆల్‌టైమ్ బెస్ట్ ఆల్‌రౌండర్‌గా రాటుదేలుతున్నాడని, ఇకపై అతనింకెంత మాత్రం నిర్లక్ష్యపు ఆటగాడు కాదని, అన్ని విభాగాల్లో కావాల్సిన పరిణితి సాధించాడని కొనియాడాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాట్‌తో అద్భుతాలు చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, జడేజా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో విండీస్‌తో సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హూడా, తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆల్‌రౌండర్ కోటాలో ఎంపికై దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. చదవండి: IND Squad For WI Series: యార్కర్ల 'నట్టూ' ఏమైనట్టు..? -
ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?
వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో దేశవాళీ స్టార్ ఆల్‌రౌండర్, హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడు రిషి ధవన్ పేరు లేకపోవడం సగటు క్రికెట్ అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. జట్టులో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత ఉందంటూ ముసలి కన్నీరు కార్చే సెలెక్టర్లకు ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిషి ధవన్ కనిపించలేదా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. How is Deepak hooda selected over Rishi Dhawan. Rishi was second highest run scorer and second highest wicket taker this vijay Hazare trophy. You gotta feel for him#INDvWI #CricketTwitter — Nakli Deadpool🦁 (@NakliDeadpool) January 27, 2022 ఐపీఎల్లో ఆడకపోవడమే రిషి ధవన్ చేసిన నేరమా, అందుకే అతన్ని టీమిండియాకు ఎంపిక చేయలేదా అంటూ అతని అభిమానులు నిలదీస్తున్నారు. ఒకప్పుడు దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ ఆధారంగానే టీమిండియాకి ఎంపిక చేసేవాళ్లని, ఇప్పుడేమో ఐపీఎల్ ప్రతిభ ఆధారంగా సెలక్షన్ జరుగుతోందంటున్నారు టీమిండియా అభిమానులు. గత ఐపీఎల్లో కేవలం కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించి జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌ను ఇందుకు ఉదహరిస్తున్నారు. సెలెక్టర్లు ఇకనైనా మొద్దు నిద్రను వీడి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను ఎంకరేజ్ చేయాలని, ఇది భారత జట్టుకు మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. Why did Venkatesh Iyer drop out of ODI team? And why did Rishi Dhawan not get a chance in a format? 👇 *And this guy showed all-round performance like putting out fires in #SMAT & #VijayHazare Trophy. *Day by day the value of Indian Domestic Cricket is getting lost. @BCCI — Md Sahid Mondal (@imdsahidmondal) January 27, 2022 కాగా, గతేడాది ముస్తాక్ ఆలీ టోర్నీలో అద్భుతంగా రాణించిన రిషి ధవన్.. విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిపోయాడు. హిమాచల్‌ప్రదేశ్ జట్టుని ముందుండి నడిపించి, ఆ జట్టుకు మొట్టమొదటి దేశవాళీ ట్రోఫీని అందించాడు. ఫైనల్లో పటిష్టమైన తమిళనాడును మట్టికరిపించడంలో రిషి కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను కీలకమైన 3 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి సత్తా చాటాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2021లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన రిషి.. 69.33 సగటుతో 458 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 5.95 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. Bhai India ka core grp set hai !!! Jab vacancy ayegi, tab naye ko uthaya jayega !!! Vacancy nahi hai !! Ab kya sirf unko khush karne kiliye squad rakhe !!!🤷🏻♀️😐 — Shubham Speaks (@ShubhamRetweets) January 26, 2022 అంతకుముందు ముస్తాక్ ఆలీ టోర్నీలో సైతం రాణించిన రిషి.. 117 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కే ఎంపికవుతాడని అంతా ఊహించారు. అయితే, అప్పుడు హ్యాండ్ ఇచ్చిన సెలెక్టర్లు.. తాజాగా విండీస్ సిరీస్‌కు కూడా మొండి చెయ్యే చూపించారు. కాగా, టీమిండియా తరఫున 3 వన్డేలు, ఓ టీ20 ఆడిన ధవన్.. ఐపీఎల్లో కూడా ఆడాడు. అయితే అక్కడ ఆశించిన మేర రాణించకపోవడంతో అతనికి అవకాశాలు దక్కలేదు. అతను పంజాబ్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున 26 మ్యాచ్‌ల్లో 153 పరుగులు, 18 వికెట్లు పడగొట్టాడు. -
హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ
Hardik Pandya And His Nani Dancing For Pushpa Srivalli Step: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ "పుష్ప" కేవలం సినిమా ప్రపంచాన్నే కాకుండా యావత్ జగత్తును ఉర్రూతలూగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశ, విదేశాలకు చెందిన సామాన్యుల దగ్గరి నుండి సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరికి ప్రస్తుతం పుష్ప ఫోబియా పట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, డ్యాన్సులకు ఫిదా అయిన జనం.. సందర్భంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తమ టాలెంట్‌కి పని చెబుతూ సరదా తీర్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) ఇంతటితో ఆగకుండా వారు చేసిన డ్యాన్సులు, ఇమిటేట్ చేసిన డైలాగులను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి సంబరపడిపోతున్నారు. తాజాగా, ఓ బామ్మ సైతం తాను కూడా తగ్గేదేలేదంటూ పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌ను చిందేసింది. ఈ హడావుడి చేసిన ముసలావిడ ఎవరో అనామకురాలనుకుంటే పొరపాటే. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా నాన్నమ్మ అయిన ఈ బామ్మ.. వయసు సహకరించకపోయినా ఎంతో ఉత్సాహంతో పాటకు స్టెప్పేసింది. ఆమె పక్కనే హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. "అవర్ ఓన్ పుష్ప నాని" అంటూ హార్ధిక్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. నెటిజన్లు బామ్మ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. చదవండి: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు -
టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్
టీమిండియా సెమీస్ దశలోనే ఓడిపోయినా, మన క్రికెటర్లకు మాత్రం బహుమతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే స్పాన్సరర్లు, లేకపోతే అత్తవారు మనోళ్లకు గిఫ్టులు చదివిస్తున్నారు. తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు బంపర్ లాటరీ తగిలింది. ఈనెల 17వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న జడేజాకు అతడి అత్తింటివాళ్లు దాదాపు కోటి రూపాయల విలువైన ఆడి కారు బహూకరించారు. రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె రివబా సోలంకితో జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వరుసగా బిజీ షెడ్యూలులో ఉండటంతో పెళ్లి ముహూర్తం మాత్రం కాస్తా ఆలస్యంగా పెట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన రివబా.. ప్రభుత్వోద్యోగం చేయాలని ఆశిస్తోందట. ఇందుకోసం సివిల్ సర్వీసుల పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జడేజా స్వగ్రామంతో పాటు రాజ్‌కోట్ నగరంలో కూడా మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఉంటాయి. ఈనెల 16న రాజ్‌కోట్‌లోని ఓ హోటల్లో తన తోటి క్రికెటర్లు, ఇతర ముఖ్య స్నేహితుల కోసం ఓ భారీ పార్టీ ఏర్పాటుచేశాడు. 17వ తేదీన అదే హోటల్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఆ హోటల్లోనే రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులను మాత్రమే పిలుస్తున్నారు. కొత్త దంపతులు 18వ తేదీన జడేజా స్వగ్రామమైన హడాతోడాకు వెళ్తారు. అక్కడ గ్రామస్తులతో కలిసి సంబరాలు ఉంటాయి. ఆరోజు సాయంత్రం ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ పెళ్లి వేడుకల నేపథ్యంలో ముందుగానే అత్తింటివాళ్లు అతగాడికి మంచి కారు బహూకరించారు. తనకు కాబోయే భార్యతో కలిసి సోమవారమే షోరూంకు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. హర్దేవ్ సింగ్ సోలంకి, ప్రఫుల్లబా సోలంకి దంపతుల ఏకైక కుమార్తె రివబా. హర్దేవ్కు రాజ్‌కోట్ జిల్లాలో రెండు స్కూళ్లు, మోర్బిలోని నవ్లఖి పోర్టులో వే బ్రిడ్జి, రాజ్‌కోట్ నగరంలో ఓ హోటల్ ఉన్నాయి. రివబా తల్లి రైల్వేశాఖలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తారు.