టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా ముందు ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిస్తే ఒక రికార్డు.. సిరీస్ గెలిస్తే ఇంకో రికార్డు.. ఇలా అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. టీమిండియాలో మరెవరికి సాధ్యం కాని యునివర్సల్ రికార్డు దీపక్ హుడా పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. మరి ఆ యునివర్సల్ రికార్డు కథాకమీషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున అద్బుత ప్రదర్శన చేశాడు. అనంతరం బరోడా తరపున దేశవాలీ క్రికెట్‌లో దుమ్మురేపి ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఇక దీపక్ హుడా ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 9 టీ20లు, 5 వన్డేలు ఉండగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే విజయం కావడం విశేషం. దీంతో దీపక్ హుడా జట్టులో ఉంటే గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వస్తూ విధ్వంసకర హిట్టింగ్‌తో టీమిండియాకు స్లాగ్ ఓవర్లలో భారీ స్కోర్లు అందించడమే గాక.. బౌలింగ్‌లోనూ ఆఫ్ స్పిన్నర్‌గా తన సేవలందిస్తున్నాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం వరుసగా 14 మ్యాచ్‌ల్లో విజయాల్ని చూసిన భారత ఆటగాడు ఎవరూ లేరు. ఈ విషయంలో మాత్రం దీపక్ హుడా చరిత్ర సృష్టించాడు. అయితే.. ఓవరాల్‌గా మాత్రం ఈ రికార్డ్‌లో రొమానియాకి చెందిన సాత్విక్ నదిగొట్ల 15 మ్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు. సాత్విక్, దీపక్ హుడా తర్వాత దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ (13 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక శంతను వశిష్ట్ (రొమేనియా)-13 విజయాలు, కొల్లిస్ కింగ్ (వెస్టిండీస్)-12 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఒకవేళ జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే దీపక్ హుడా వరుస 15 విజయాలతో రొమేనియా ఆటగాడు సాత్విక్ నదిగొట్టతో సంయుక్తంగా తొలిస్థానం పంచుకోనున్నాడు. ఒకవేళ రెండో వన్డేలోనూ టీమిండియా విజయం సాధించి సిరీస్ గెలిస్తే.. దీపక్ హుడా 16 వరుస విజయాలతో టాప్ స్థానాన్ని ఆక్రమించే అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. ఒకవేళ జింబాబ్వేపై సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ దీపక్ హుడా ఆడితే మాత్రం అతని విజయాల పరంపరకు బ్రేక్ పడనట్లే. మరి ఇది ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి.
చదవండి: Kabaddi Game: కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి
ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు!
Comments
Please login to add a commentAdd a comment