West Indies vs India, 3rd ODI- Shubman Gill World Record: వెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. వన్డే సిరీస్‌ను మాత్రం ఘనంగా ముగించాడు. ఏరికోరి టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 6, 10, 29(నాటౌట్) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్ డిజిట్ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి.
తీవ్ర ఒత్తిడిలోనూ..
ఇక, రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్ మళ్లీ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం శుబ్‌మన్ గిల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు
బ్రియన్ లారా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతడు 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అద్భుత ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించాడు.
మొన్న బాబర్‌ను దాటేసి
సెంచరీ మిస్ అయినా.. పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక గత మ్యాచ్‌లో 1352 పరుగుల వద్ద ఉన్న గిల్.. బాబర్ ఆజం(1322)ను అధిగమించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించింది వీళ్లే!
1.శుబ్‌మన్ గిల్- 1437
2.ఇమాన్ ఉల్ హక్- 1381
3.రాసీ వాన్ డెర్ డసెన్- 1353
4.రియాన్ టెన్ డొషాటే- 1353
5. జొనాథన్ ట్రాట్- 1342.
చదవండి: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
ఓడిపోతే ఏం జరిగేదో తెలుసు! అందుకే రోహిత్, కోహ్లిలను కాదని ఇలా: హార్దిక్
మొన్న వాటర్‌బాయ్! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్
Well played. Deserved a 💯@ShubmanGill
— FanCode (@FanCode) August 1, 2023
.
.#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/KPWdZjFQt6
Comments
Please login to add a commentAdd a comment