బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి ధాటికి అఫ్గానిస్తాన్ 400 పరుగులు దాటుతుందని అనిపించింది.
కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడం.. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. ప్రస్తుతం 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఇక అఫ్గానిస్తాన్ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడమే కాకుండా ప్రపంచ రికార్డుతో మెరిశారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
► రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 256 పరుగులు జోడించారు. అఫ్గాన్ వన్డే చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2010లో స్కాట్లాండ్‌పై కరీమ్ సాదిక్, మహ్మద్ షెహజాద్‌లు రెండో వికెట్‌కు 218* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు.2010లోనే షార్జా వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షెహజాద్, నూర్ అలీ జర్దన్‌లు రెండో వికెట్‌కు 205 పరుగులు జోడించి మూడో స్థానంలో ఉన్నారు.
► ఇక ఓవరాల్‌గా అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో పరిశీలిస్తే 256 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికంగా ఉంది. ఇక మొదటి స్థానంలో అస్గర్ అప్గన్, హస్మతుల్లా షాహిది జోడి ఉంది. ఈ జోడి 2021లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు.
► ఇక వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2022లో టీమిండియా నుంచి కోహ్లి, ఇషాన్ కిషన్‌ల జోడి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు.
The moment @RGurbaz_21 reached his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/0AmNoEtGol
— Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023
When @IZadran18 brought up his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/Lv1eV610cg
— Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023
చదవండి: విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్‌షాపులో డబ్బులు ఎగ్గొట్టి
Comments
Please login to add a commentAdd a comment