షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(98) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మెహాది హసన్ మిరాజ్(66) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. నబీ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ..
అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అఫ్గాన్ లక్ష్య చేధనలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్' అజ్మతుల్లా ఒమర్జాయ్(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment