Rahmanullah Gurbaz
-
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ఓపెనర్.. సచిన్, కోహ్లి రికార్డులు బద్దలు
షార్జా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అఫ్గాన్ విజయంలో స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 245 పరుగుల లక్ష్య చేధనలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. కాగా రహ్మానుల్లాకు ఇది ఎనిమిదో వన్డే అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. తద్వారా గుర్భాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.సచిన్, కోహ్లి రికార్డు బద్దలు..అంతర్జాతీయ వన్డేల్లో అతి పిన్న వయస్సులోనే ఎనిమిది సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా గుర్భాజ్ రికార్డులెక్కాడు. గుర్భాజ్ కేవలం 22 సంవత్సరాల, 349 రోజుల వయస్సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రన్ మిషన్ విరాట్ కోహ్లిని గుర్భాజ్ ఆధిగమించాడు. సచిన్ 22 ఏళ్ల 357 రోజుల వయస్సులో ఈ రికార్డు సాధించగా.. కోహ్లి 23 ఏళ్ల 27 రోజుల వయస్సులో అందుకున్నాడు.ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ అగ్రస్ధానంలో ఉన్నాడు. డికాక్ 22 ఏళ్ల 312 రోజుల్లో ఈ రికార్డును నమోదు చేశాడు. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో సాధించిన మొత్తం సెంచరీల(30)లో గుర్భాజ్ సాధించినివే 25 శాతం కావడం గమనార్హం.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాను చిత్తు చేసిన అఫ్గాన్
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(98) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మెహాది హసన్ మిరాజ్(66) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. నబీ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ..అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అఫ్గాన్ లక్ష్య చేధనలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్' అజ్మతుల్లా ఒమర్జాయ్(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
Afg vs SA: ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు!
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం ప్రొటిస్ జట్టు అఫ్గన్‌పై పైచేయి సాధించింది. ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (94 బంతుల్లో 89; 7 ఫోర్లుర, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... ఘజన్‌ఫార్ (15 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. రహ్మత్ షా (1), అబ్దుల్ మాలిక్ (9), కెప్టెన్ హష్మతుల్లా (10), అజ్మతుల్లా (2), ఇక్రామ్ (4), నబీ (5) విఫలమయ్యారు.ఇక సఫారీ బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్ (67 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.అప్పుడు రహ్మనుల్లా గుర్బాజ్ క్రీజులో ఉండగా.. రహ్మత్ షా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఎంగిడి ఓవర్లో ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రహ్మనుల్లా. దీంతో సింగిల్ తీసేందుకు రెడీగా ఉన్న రహ్మత్ అప్పటికే క్రీజు నుంచి బయటకు రాగా.. రహ్మనుల్లా సైతం నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు పరుగు మొదలుపెట్టాడు.పాపం.. ఊహించి ఉండడుఅయితే, ఆ కొద్ది సమయంలోనే ఊహించని సంఘటన జరిగింది. రహ్మనుల్లా కొట్టిన బంతిని ఆపేందుకు ఎంగిడి చేయి అడ్డం పెట్టాడు. అయితే, బంతి అతడి చేతికి చిక్కకపోయినా.. చేయిని గీసుకుంటూ.. రహ్మత్‌కు తాకి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఫలితంగా రహ్మత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘‘అయ్యో పాపం.. ఇలా అవుటవుతాడని ఊహించి ఉండడు’’ అంటూ క్రికెట్ ప్రేమికులు రహ్మత్ షా(1)ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!This is how Rahmat Shah got out Against South Africa ❤️😂😂😂 pic.twitter.com/kw9VSJb9sl— Sports Production (@SportsProd37) September 22, 2024 -
క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 22) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆఫ్ఘన్ల చేతిలో క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. రెండో వన్డేలో సెంచరీ హీరో ఈ మ్యాచ్‌లో కూడా రాణించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బౌలర్లు.. ఆతర్వాత మార్క్రమ్ నిలకడగా ఆడి సౌతాఫ్రికాకు ఎట్టకేలకే ఓ విజయాన్ని అందించారు.Afghanistan wins the ODI series against South Africa. 🇦🇫 pic.twitter.com/ddmwyc4Akd— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ మరో మంచి ఇన్నింగ్స్‌తో (89) ఆఫ్ఘనిస్తాన్‌కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. గుర్బాజ్ మినహా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ రాణించలేదు. అల్లా ఘజన్ఫర్ (31), షాహిది (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నకాబా పీటర్, ఫ్లెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.Rahmanullah Gurbaz scored 89 (94) out of Afghanistan's 169 total.- The lone warrior of Afghans tonight! 👏pic.twitter.com/pQQIQzm1aC— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ (69 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) ప్రొటీస్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ జోర్జీ 26, బవుమా 22, రీజా హెండ్రిక్స్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నబీ, అహ్మద్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో 89 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో రికార్డు సెంచరీ చేసిన గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్‌ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. శతక్కొట్టిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
షార్జా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు వన్డేల్లో ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో గుర్బాజ్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే సౌతాఫ్రికాపై వన్డేల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. Aggression 🔥pic.twitter.com/TjTAiRuM3S— CricTracker (@Cricketracker) September 20, 202499 పరుగుల వద్ద ఒక్క పరుగు కోసం తెగ ఇబ్బంది పడిన గుర్బాజ్.. మార్క్రమ్ బౌలింగ్‌లో బౌండరీ బాది రికార్డు శతకం సాధించాడు. గుర్బాజ్ కేవలం 42 వన్డేల్లో 5 హాఫ్ సెంచరీలతో పాటు 7 సెంచరీలు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. గుర్బాజ్ సెంచరీతో చెలరేగగా.. రహ్మత్ షా (50), అజ్మతుల్లా ఒమర్జాయ్ (86 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రియాజ్ హస్సన్ 29, మొహమ్మద్ నబీ 13 పరుగులు చేసి ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నండ్రే బర్గర్, నకాబా పీటర్, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.కాగా, షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పోటీపడుతున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘన్లకు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం. మూడో వన్డే సెప్టెంబర్ 22న జరుగనుంది. చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి -
గుర్బాజ్ ఊచకోత.. ఒక్క బౌండరీ లేదు.. అన్నీ సిక్సర్లే..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 101 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మాథ్యూ ఫోర్డ్ వేసిన మూడో ఓవర్లో గుర్బాజ్ శివాలెత్తిపోయాడు. హ్యాట్రిక్ సిక్సర్లు సహా మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేదు. అన్నీ సిక్సర్లే. గుర్బాజ్ ఊచకోత ధాటికి వారియర్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. గుర్బాజ్‌కు జతగా టిమ్ రాబిన్సన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. pic.twitter.com/aXt21tOfvL— Cricket Cricket (@cricket543210) September 8, 2024వారియర్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ 11, ఆజమ్ ఖాన్ 0, హెట్‌మైర్ 8, కీమో పాల్ 1 పరుగు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ (3.3-0-16-3), ఇమ్రాన్ తాహిర్ (4-0-29-3), కీమో పాల్ (2-0-19-2), ప్రిటోరియస్ (2-0-10-1) ధాటికి 14.3 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ ఫోర్డ్ (31), జాన్సన్ ఛార్లెస్ (19), టిమ్ సీఫర్ట్ (12), అకీమ్ అగస్ట్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వారియర్స్ సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. లూసియా కింగ్స్ సీజన్ తొలి ఓటమిని ఎదుర్కొంది. -
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 29) జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా (టీ20) నిలిచింది.ఈ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచినప్పటికీ.. లీడింగ్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (8 మ్యాచ్‌ల్లో 281 పరుగులు), బౌలింగ్‌లో ఫజల్హక్ ఫారూఖీ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 257 పరుగులు) ఉండగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉన్నారు.ఈ టోర్నీలో అత్యధిక బ్యాటింగ్ సగటు రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్. 102), అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ షాయ్ హోప్ (187.72), అత్యధిక హాఫ్ సెంచరీలు రహ్మానుల్లా గుర్బాజ్ (3), అత్యధిక బౌండరీలు ట్రవిస్ హెడ్ (26), అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (17) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక బౌలింగ్ సగటు టిమ్ సౌథీ (5.14), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఫజల్హక్ ఫారూఖీ (5-9) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. ఫారూఖీతో పాటు అకీల్ హొసేన్ ఐదు వికెట్ల ఘనత (5/11) సాధించాడు. ఫజల్హక్, అకీల్ హొసేన్ ఇద్దరూ ఉగాండపైనే ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం విశేషం. -
చెలరేగిన అఫ్గాన్ ఓపెనర్లు.. ఉగండా ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించాడు. -
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
39 మ్యాచ్‌ల చిన్న కెరీర్లో ఆరో శతకం సాధించిన కేకేఆర్ బ్యాటర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఈ 22 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్.. తన 39 మ్యాచ్‌ల కెరీర్లో ఆరో శతకం సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని సెంచరీలు సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు. గుర్బాజ్ కెరీర్లో ఈ ఆరు శతకాలతో పాటు నాలుగు అర్దశతకాలు కూడా ఉన్నాయి. pic.twitter.com/J3sHi6z0OD— CricTracker (@Cricketracker) March 7, 2024 మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో గుర్బాజ్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. గుర్బాజ్‌తో పాటు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (60), వెటరన్ మొహ్మద్ నబీ (40), కెప్టెన్ షాహిది (50 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో థియో వాన్ వోర్కోమ్ 3 వికెట్లు పడగొట్టగా.. హ్యూమ్, క్రెయిగ్ యంగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో వారికంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్
దంబుల్లా వేదికగా శ్రీలంక-అఫ్గానిస్తాన్‌ను మధ్య జరిగిన మూడో టీ20 సస్పెన్స్ సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ నుంచి 1-2 తేడాతో అఫ్గాన్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. కాగా 210 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సరిగ్గా 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో లంక విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. అఫ్గాన్ కెప్టెన్ జద్రాన్ చివరి ఓవర్ వేసే బాధ్యతను వాఫ్దర్ మముండ్కు ఇచ్చాడు. అయితే వాఫ్దర్ వేసిన తొలి బంతినే కుమిండు మెండిస్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో ఐదు బంతుల్లో 15గా శ్రీలంక విజయసమీకరణం మారింది. రెండో బంతికి ఎటువంటి పరుగు రాకపోగా.. మూడో బంతిని మెండీస్ ఫోర్ బాదాడు. అయితే నాలుగో బంతిని బౌలర్ బీమర్‌గా సంధించాడు. దీంతో బ్యాటర్ హైట్ నోబాల్ కోసం అంపైర్‌ను ప్రశ్నించాడు. అంపైర్ మాత్రం ఫెయిర్ డెలివరీగానే ప్రకటించాడు. కానీ రిప్లేలో మాత్రం అది క్లియర్‌గా హైట్ నోబాల్‌గా కన్పించింది. దీంతో నాలుగో బంతికి కూడా ఎటువంటి పరుగు రాలేదు. ఐదో బంతికి మెండిస్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్వర్డ్ స్వ్కేర్ దిశగా వెళ్లింది. కానీ మెండిస్ సింగిల్ తీసుకోలేదు. ఆఖరి బంతికి 9 పరుగులు అవసరమవ్వగా మెండిస్ సిక్స్ కొట్టినప్పటికి ఫలితం లేదు. దీంతో 3 పరుగుల తేడాతో లంక ఓటమి పాలైంది. లంక బ్యాటర్లలో మెండిస్(65), నిస్సాంక(60) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగినప్పటికి విజయం మాత్రం అఫ్గాన్నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ ఓపెనర్ గుర్భాజ్( 43 బతుల్లో 70, 7 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. లంక బౌలర్లలో పతిరానా, అకిలా దనుంజయ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన హసరంగా సేన.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. -
రాణించిన రహ్మానుల్లా గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (43 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్ జట్టు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో అజ్ముతుల్లా ఒమర్జాయ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు) తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 10, మొహమ్మద్ నబీ 16 నాటౌట్, మొహమ్మద్ ఇషాక్ 16 నాటౌట్ పరుగులు చేయగా.. కరీం జనత్ డకౌటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరణ, అఖిల ధనంజయ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ వనిందు హసరంగ ఓ వికెట్ దక్కించకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (2-0-21-0), నువాన్ తుషార (4-0-48-0) భారీగా పరుగులు సమర్పించుకోగా.. దసున్ షనక (2-0-16-0) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక 2-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ ఆడింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటన ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడో టీ20లో భారీ స్కోర్ చేయడంతో విజయావకాశాలు ఉన్నాయి. -
అఫ్గాన్ స్టార్ ఓపెనర్ విధ్వంసం.. యూఏఈ చిత్తు
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో అఫ్గానిస్తాన్ శుభారంభం చేసింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మునుల్లా గుర్బాజ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. అతడితో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ హాప్ సెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో జద్రాన్ 59 పరుగులు చేశాడు. యూఏఈ బౌలర్లలో సిద్దూఖీ, ఆయాన్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. యూఏఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్వింద్(70) పరుగులతో టప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హాక్, క్వైస్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 షార్జా వేదికగా డిసెంబర్ 31న జరగనుంది. చదవండి: Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ? -
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం
యూఏఈతో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తయ్యాక గుర్బాజ్ మరో రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. గుర్బాజ్‌కు టీ20ల్లో ఇది తొలి శతకం. ఆఫ్ఘనిస్తాన్ తరఫున 44 మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్.. సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 1143 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. గుర్బాజ్ ఐపీఎల్లో గుజరాత్, కేకేఆర్‌ల తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 133.53 స్ట్రయిక్‌రేట్‌తో 227 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుర్బాజ్‌తో పాటు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 173/2గా ఉంది. జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ, అయాన్ అఫ్జల్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్.. యూఏఈలో పర్యటిస్తుండగా, షార్జాలో ఇవాళ (డిసెంబర్ 29) తొలి టీ20 జరుగుతుంది. -
అఫ్గాన్ స్టార్ ఓపెనర్ మంచి మనసు.. నిరాశ్రయులకు నగదు సాయం! వీడియో వైరల్
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్‌ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నిరాశ్రయులకు గుర్బాజ్ నగదు సాయం చేశాడు. అది కూడా తెల్లవారుజామున 3 గంటలకు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో గుర్బాజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "నిజంగా నీవు రియల్ హీరో అన్న, దీపావళి పండగ రోజు వారి ముఖాల్లో సంతోషాన్ని నింపావు" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 4 విజయాలతో అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో నిలిచింది. గుర్భాజ్ కూడా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేశాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali. - A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4 — Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023 -
ఆఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్‌ను శిక్షించిన ఐసీసీ.. ఎందుకంటే?
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్‌పై ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 15న ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. కాగా ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బిగ్ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్-1 నిబంధన ఉల్లఘించినందుకు రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఐసీసీ మందలించింది. గుర్భాజ్ ఏం చేశాడంటే? ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గుర్భాజ్(57 బంతుల్లో 80) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మంచి ఊపు మీద ఉన్న గుర్భాజ్ దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో అసహనానికి లోనైన గుర్భాజ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ తన బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను, కూర్చీని బలంగా కొట్టాడు. అయితే ఆర్టికల్ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనల ప్రకారం ఆటగాడు మ్యాచ్ సమయంలో గ్రౌండ్‌కు సంబంధించిన పరికరాలను ద్వంసం చేయడం, హెల్మెట్‌ను నెలకేసి కొట్టడం వంటివి చేయకూడదు. ఈ నేపథ్యంలోనే గుర్భాజ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. కాగా గుర్భాజ్ కూడా తన నేరాన్ని అంగీకరించాడు. చదవండి: WC 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్! -
WC 2023: వాళ్లు అద్భుతం.. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అవే.. కానీ: బట్లర్
వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్ చేతిలో ఊహించని రీతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి చెంది విమర్శల పాలైంది. అఫ్గన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చోట.. ఇంగ్లండ్ ‘పటిష్ట’ బ్యాటింగ్ ఆర్డర్ తేలిపోయింది. మెరుగైన భాగస్వామ్యాలు కరువై ఓటమిని కొనితెచ్చుకుంది. ఫలితంగా తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవైపు టీమిండియా, న్యూజిలాండ్ ఓటమి అన్నదే లేక రేసులో దూసుకుపోతున్న వేళ ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకీ వెనుబడిపోతోంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు అఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్. 57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు అఫ్గన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, ఆరో స్థానంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ ఇక్రం అలిఖిల్ అర్ద శతకం(58)తో రాణించగా... రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రహ్మమాన్ 28 పరుగులతో అఫ్గన్ మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి అఫ్గన్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. మలన్ 32 రన్స్ స్కోరు చేశాడు. జో రూట్(11) విఫలం కాగా.. హ్యారీ బ్రూక్(66) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహాయం కరువైంది. ఆఖర్లో ఆదిల్ రషీద్(20), మార్క్ వుడ్(18) బౌండరీలు బాది కాసేపు ఫ్యాన్స్‌ను సంతోషపెట్టగలిగారు గానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc) అఫ్గన్ బౌలర్ల దెబ్బకు 40.3 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 215 పరుగులకే ఆలౌటై 69 పరుగుల తేడాతో ఓడి రన్‌రేటు పరంగానూ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. ‘‘టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని.. మొదటి బంతి నుంచే పరుగులు ఇవ్వడం నిరాశ పరిచింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ అద్భుతంగా ఆడింది. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మేము బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాం. వాళ్ల జట్టులో కొంతమంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. నిజానికి మేము ఊహించినట్లుగా పిచ్‌పై డ్యూ(తేమ) లేదు. మా బౌలర్లు విఫలమైన చోట వాళ్ల బౌలర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని బాధించేదే! కానీ.. అదే తలచుకుని బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మా ఆటగాళ్లకు పట్టుదల ఎక్కువ.. జట్టు మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తుంది. ఒత్తిడిని తట్టుకుని రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆట తీరును ప్రశంసిస్తూ.. ఓటమిని హుందాగా అంగీకరిస్తూనే.. తిరిగి పుంజుకుంటామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో.. పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టిన ముజీబ్ ఉర్ రహ్మాన్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అఫ్గన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేయడంతో పాటు 10 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులిచ్చి కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 ENG VS AFG: సెంచరీకి ముందు రనౌట్.. కోపంతో ఊగిపోయిన గుర్బాజ్
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తమ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. గుర్బాజ్-జద్రాన్ జోడీ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించిన అనంతరం జద్రాన్ ఔటయ్యాడు. అనంతరం 18.4వ ఓవర్లో (122 పరుగుల వద్ద) జోస్ బట్లర్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మాత్ షా కూడా పెవిలియన్‌కు చేరాడు. షా ఔటైన మరుసటి బంతికే సెంచరీ చేస్తాడనుకున్న గుర్బాజ్ కూడా అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. #ENGvsAFG #stumpout #runout pic.twitter.com/OpNQSwkWPX — nadeem 05 (@hotvideos097) October 15, 2023 దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్వైపు నుంచి ఇంగ్లండ్‌వైపు మలుపు తిరిగింది. 8 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూడా క్రమం తప్పకుండా మరో 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్ (23) జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జో రూట్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో రషీద్ ఖాన్ కూడా ఔటయ్యాడు. 44.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 233/7గా ఉంది. అలీఖిల్ (44), ముజీబ్ క్రీజ్‌లో ఉన్నారు. Rahmanullah Gurbaz is so much angry with himself after run out #ENGvsAFG #Sorry_Pakistan #IndiavsPak #Rizwan #BabarAzam #RohitSharma𓃵 Shaheen Skipper KL Rahul BCCI Namaz Chennai Rizwan Indians, Godavari Wasim Akram Ahmedabad Gujarat, Sri Lankan Shami pic.twitter.com/meZDHuy6kp — cricketbuzz⁴⁵ (@Mohdyasir6911) October 15, 2023 కోపంతో ఊగిపోయిన గుర్బాజ్.. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన గుర్బాజ్.. అనవసరంగా రనౌట్ కావడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. గ్రౌండ్లో కోపాన్ని ఆపుకున్న గుర్బాజ్.. పెవిలియన్‌కు చేరే క్రమంలో బౌండరీ రోప్‌పై, ఆతర్వాత డగౌట్లో కుర్చీపై తన ప్రతాపాన్ని చూపాడు. పట్టలేని కోపంతో ఊగిపోయిన గుర్బాజ్ బౌండరీ రోప్‌ను, కుర్చీని బ్యాట్‌తో గట్టిగా కొడుతూ, కేకలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. Run Out On 80 💔 Rahmanullah Gurbaz Missed Out On A Well-deserved World Cup Hundred!#ENGvAFG #WorldCup #CWC23 #Gurbaz pic.twitter.com/xiHPoUWSPO — Jega8 (@imBK08) October 15, 2023 -
WC 2023: షకీబ్ రెండోసారి! 156 పరుగులకే కుప్పకూలిన అఫ్గనిస్తాన్
ICC Cricket World Cup 2023 - Bangladesh vs Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ 156 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తాళలేక బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 37.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ధర్మశాల వేదికగా శనివారం టాస్ ఓడిన అఫ్గాన్.. బంగ్లా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ల శుభారంభం.. ఆ తర్వాత ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 47, ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులతో శుభారంభం అందించారు. వీరిద్దరు అవుటైన తర్వాత ఆఫ్గన్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. బంగ్లాదేశ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పెవిలియన్‌కు క్యూ కట్టారు ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా 18, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది 18, నజీబుల్లా జద్రాన్ 5, మహ్మద్ నబీ 6, అజ్మతుల్లా ఒమర్జాయ్ 22, రషీద్ ఖాన్ 9, ముజీబ్ ఉర్ రహమాన్ 1 పరుగు తీయగా.. నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారుకీ డకౌట్లుగా వెనుదిరిగారు. షోరిఫుల్ ఇస్లాం.. నవీన్‌ను బౌల్డ్ చేయడంతో ఆఫ్గన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 156 పరుగులకే హష్మతుల్లా బృందం చాపచుట్టేసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడం గమనార్హం. ఇక బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు 3, మెహిదీ హసన్ మిరాజ్‌కు 3 వికెట్లు దక్కగా.. పేసర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒకటి, షోరిఫుల్ ఇస్లాం 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. వరల్డ్‌కప్ టోర్నీలో అఫ్గన్‌తో మ్యాచ్ అంటే షకీబ్ తగ్గేదేలే! ధర్మశాలలో అఫ్గనిస్తాన్‌తో తాజా మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గతంలో 2015, 2019 ప్రపంచకప్ ఈవెంట్లలో కాన్బెర్రా, సౌతాంప్టన్ మ్యాచ్‌లలో అఫ్గన్‌పై వరుసగా 2/43, 5/29 బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు. ఈ క్రమంలో అఫ్గన్‌పై ఐసీసీ ఈవెంట్లో రెండోసారి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: WC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దూరం.. రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్! -
చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్ ఓపెనర్.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు
ఆఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అరుదైన ఘనత సాధించాడు. 21 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్ రికార్డులకెక్కాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో గుర్బాజ్ 5 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును గుర్బాజ్ బ్రేక్ చేశాడు. సచిన్ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ను ఈ ఆఫ్గాన్ ఓపెనర్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెపర్ క్వింటన్ డికాక్, శ్రీలంక మాజీ ఓపెనర్ ఉపుల్ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా గుర్భాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్భాజ్ రికార్డులకెక్కాడు. గుర్బాజ్ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం రికార్డును గుర్బాజ్ బ్రేక్ చేశాడు. బాబర్ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన లిస్ట్‌లో క్వింటన్ డికాక్(13 ఇన్నింగ్స్‌లు), పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(13 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నారు. చదవండి: Asia Cup 2023: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! Rahmanullah Gurbaz surpasses Babar Azam to become the 3rd fastest to 5 ODI centuries. pic.twitter.com/BX5B41b4RV — Mufaddal Vohra (@mufaddal_vohra) August 24, 2023 -
చరిత్ర సృష్టించిన రహ్మానుల్లా గుర్భాజ్.. ధోనికి సైతం సాధ్యం కాని రికార్డు సొంతం
శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 24) జరుగుతున్న రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో (151 బంతుల్లో 151; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించిన గుర్బాజ్.. పాకిస్తాన్‌పై వన్డేల్లో 150 పరుగుల మార్కు తాకిన తొలి వికెట్‌కీపర్/బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గుర్భాజ్‌కు ముందు పురుషుల వన్డే క్రికెట్లో ఏ వికెట్‌కీపర్ కూడా పాక్‌పై ఈ ఘనత సాధించ లేదు. 2005లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వైజాగ్ వన్డేలో పాక్‌పై 148 పరుగులు (123 బంతుల్లో) చేశాడు. గుర్భాజ్‌కు ముందు పాక్‌పై వన్డేల్లో ఓ వికెట్‌కీపర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ రికార్డుతో పాటు గుర్భాజ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, గుర్భాజ్ భారీ శతకంతో వీరవిహారం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుర్భాజ్‌కు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (101 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించడంతో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌పై అత్యధిక వన్డే స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో గుర్భాజ్, ఇబ్రహీమ్ జద్రాన్ (80) జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకుంది. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. -
తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఇంతలో ఎంత మార్పు..!
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్ 24) హంబన్‌తోటలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఆగస్ట్ 24) అదే పాకిస్తాన్‌తో అదే హంబన్‌తోటలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ పలు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (135), ఇబ్రహీమ్ జద్రాన్ (80) తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రహ్మానుల్లా గుర్భాజ్.. పాకిస్తాన్‌పై వన్డే సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అనంతరం ఉసామా మిర్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి జద్రాన్ (80) ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. గుర్భాజ్ (147), మహ్మద్ నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. తేలిపోయిన పాక్ పేసర్లు.. తొలి వన్డేలో ఆఫ్ఘన్ ప్లేయర్ పాలిట సింహస్వప్నల్లా ఉండిన పాక్ పేసర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్ అఫ్రిది, నసీం షా సైతం అతన్ని ఫాలో అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఈ పేస్ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. -
హార్దిక్, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే!
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయయ్యాడు. ఆసియాకప్-2023తో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన అయ్యర్.. దాదాపు 8 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌తో పాటు కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. ఇక సుదీర్ఘకాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న అయ్యర్‌పై ఆఫ్గానిస్తాన్ స్టార్ బ్యాటర్, కేకేఆర్ సహచరుడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో అయ్యర్ భారత కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్బాజ్ జోస్యం చెప్పాడు. "అయ్యర్ భవిష్యత్తులో మంచి కెప్టెన్ అవుతాడని నేను భావిస్తున్నాను. అతడు ఐపీఎల్లో కేకేఆర్‌కు సారథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు ఢిల్లీ ఫ్రాంచైజీకి కూడా కెప్టెన్‌గా పనిచేశాడు. అతడికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్. ఐపీఎల్లో జట్టుకు నాయకత్వం వహించగలిగితే.. ప్రపంచంలోని ఏ జట్టునైనా ముందుకు నడిపించగలడు. అది టీమిండియా అయినా కావచ్చు. అయ్యర్ భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని" టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్భాజ్ పేర్కొన్నాడు. కాగా గుర్బాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ జరగుతున్న వన్డే సిరీస్‌లో ఆఫ్గాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌లో భారత్‌దే పై చేయి.. ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని దాయాదులు!