39 మ్యాచ్‌ల చిన్న కెరీర్‌లో ఆరో శతకం సాధించిన కేకేఆర్‌ బ్యాటర్‌ | AFG VS IRE 1st ODI: Rahmanullah Gurbaz Hits His 6th ODI Hundred, Afghanistan Scores 310 For 5 Batting First | Sakshi
Sakshi News home page

39 మ్యాచ్‌ల చిన్న కెరీర్‌లో ఆరో శతకం సాధించిన కేకేఆర్‌ బ్యాటర్‌

Published Thu, Mar 7 2024 9:30 PM | Last Updated on Thu, Mar 7 2024 9:30 PM

AFG VS IRE 1st ODI: Rahmanullah Gurbaz Hits His 6th ODI Hundred, Afghanistan Scores 310 For 5 Batting First - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఓపెనర్‌, ఆ జట్టు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌ తన వన్డే కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతున్న ఈ 22 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్‌.. తన 39 మ్యాచ్‌ల కెరీర్‌లో ఆరో శతకం సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్‌లో ఇన్ని సెంచరీలు సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు. గుర్బాజ్‌ కెరీర్‌లో ఈ ఆరు శతకాలతో పాటు నాలుగు అర్దశతకాలు కూడా ఉన్నాయి.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో గుర్బాజ్‌ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్‌ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. గుర్బాజ్‌తో పాటు మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (60), వెటరన్‌ మొహ్మద్‌ నబీ (40), కెప్టెన్‌ షాహిది (50 నాటౌట్‌) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఐర్లాండ్‌ బౌలర్లలో థియో వాన్‌ వోర్కోమ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హ్యూమ్‌, క్రెయిగ్‌ యంగ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో వారికంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపి​ంచింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement