షార్జా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు వన్డేల్లో ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో గుర్బాజ్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే సౌతాఫ్రికాపై వన్డేల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు.
Aggression 🔥pic.twitter.com/TjTAiRuM3S
— CricTracker (@Cricketracker) September 20, 2024
99 పరుగుల వద్ద ఒక్క పరుగు కోసం తెగ ఇబ్బంది పడిన గుర్బాజ్.. మార్క్రమ్ బౌలింగ్‌లో బౌండరీ బాది రికార్డు శతకం సాధించాడు. గుర్బాజ్ కేవలం 42 వన్డేల్లో 5 హాఫ్ సెంచరీలతో పాటు 7 సెంచరీలు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. గుర్బాజ్ సెంచరీతో చెలరేగగా.. రహ్మత్ షా (50), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (86 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రియాజ్ హస్సన్ 29, మొహమ్మద్ నబీ 13 పరుగులు చేసి ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నండ్రే బర్గర్, నకాబా పీటర్, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.
కాగా, షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పోటీపడుతున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘన్లకు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం. మూడో వన్డే సెప్టెంబర్ 22న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment